E-Paper
Advertisement

తింగరి సీతకు ఇంత క్రేజ్ ఏంట్రా మావా? అల్లరి ఆరతి అసలు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

తింగరి సీతకు ఇంత క్రేజ్ ఏంట్రా మావా? అల్లరి ఆరతి అసలు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Advertisement

Allari Aarathi:అల్లరి ఆరతి..అచ్చంగా ఇరవై ఏళ్ళు కూడా ఉండవు..కానీ తను వీడియో వదిలిందంటే చాలు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చి చేరాల్సిందే.ముఖ్యంగా తనదైన చలాకీ మాటతీరుతో చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ల దాకా అందర్ని ఇట్టే కట్టి పడేస్తుంది.

అలా పది, ఇరవై కాదండోయ్ ..ఏకంగా 77 లక్షల మందిని తన అభిమానులుగా మార్చేసుకుంది.మరింతకీ తనదైన క్రియేటివిటీ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అల్లరి అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది?అసలు యూట్యూబ్ సెన్సేషన్ గా మారిన అల్లరి ఆరతి ఛానెల్ ఎప్పుడు మొదలైంది?విశేషమైన ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఆరతి యూట్యూబ్ నుండి నెలకి ఎంత సంపాదిస్తుంది. చూసేద్దాం.

Advertisement

కేవలం 11 ఏళ్ల వయసులోనే

ఆరతి ఆలియాస్ అల్లరి ఆరతి పుట్టి పెరిగింది ఆంద్ర ప్రదేశ్ లోని వైజాగ్. చిన్న తనంలోనే టీవీలో వచ్చే పాటల్ని, యాడ్స్ ని చూసి గుర్తు పెట్టుకుని తిరిగి వాటిని రిపీట్ చేసేది.అలా చిన్నప్పుడే హైపర్ యాక్టివ్ గా ఉండే ఆరతికి అప్పుడే డాన్స్ ,సింగింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇప్పించారు తన పేరెంట్స్ .

Advertisement

అలా ఆరతి కేవలం 11 ఏళ్ల వయసులోనే డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రాంతో బుల్లి తెరమీదకి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది.అయితే తన తల్లికి తనని కెమెరా ముందు చూడాలి అన్న కోరిక ఉండటంతో డ్రామా జూనియర్స్ తర్వాత ఏడాది పాటు సినిమాల్లో ప్రయత్నించినప్పటికీ అవకాశాలని దక్కించుకోలేకపోయింది.

అయితే అదే సమయంలో తెల్సిన వాళ్ళు పోలీసులకి రాఖీ కట్టి ఆ డబ్బులని వాటిని అస్సాం వరదబాధితుల కోసం ఉపయోగించడం కోసం చేసిన వీడియో లో భాగంగా ఆరతి తొలిసారి కనిపించడం ,అది కాస్తా బాగా వైరల్ అవ్వడం జరిగిపోయింది.దానితో ఆరతి లోని టాలెంట్ ని గ్రహించిన వారు ఆరతి తోనే ఒక యూట్యూబ్ చానెల్ జనవరి1 2022 న లాంచ్ చేశారు.దానికి ఆరతి లోని అల్లరినే టైటిల్ గా పెట్టడం విశేషం.

కేవలం ఒక నిమిషంలోనే వెయ్యి వ్యూస్

ఇక అలా చిన్నగా మొదలైన యూట్యూబ్ చానెల్ మొదట్లో అంతగా ఆదరణ పొందలేదు.ఇక అప్పటికి ఛానెల్ సబ్ స్క్రైబర్స్ కూడా కేవలం రెండు వేల మంది మాత్రమే ఉన్నారు.అయితే అదే సమయంలో ఇండిపెండెన్స్ రోజున చేసిన ఒక వీడియో బాగా కనెక్ట్ అయిపోయి కేవలం ఒక నిమిషంలోనే వెయ్యి వ్యూస్ రావడంతో టీమ్ మొత్తం షాక్ అయిపోయారు.

ఇక ఆ వీడియో క్రమంగా ట్రెండింగ్ లోకి ఏకంగా వారం పాటు ఆ వీడియో ట్రెండింగ్ లో కంటిన్యూ అవడం విశేషం.ఒక రకంగా చెప్పాలంటే అల్లరి ఆరతి ఛానెల్ కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.దీనితోనే ఛానెల్ లో ఎలాంటి కంటెంట్ ని ఆడియన్స్ ఎక్కువ సంఖ్యలో ఆదరిస్తున్నారు అన్నది కూడా టీమ్ మెంబర్స్ కి అర్థం అయిపొయింది.

ఎంటర్ టైనింగ్ వీడియోలతో మిలియన్ల వ్యూస్

అలా మెల్లిగా చిన్నపిల్లలకి ,యూత్ కి నచ్చే కంటెంట్ చేస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గరైపోయింది.అందులో భాగంగానే నవరసాలు, కొత్త జంట ,అల్లరి పిడుగు,తింగరి సీత గా మొదలైన ప్రయాణం క్రమంగా టైప్స్ ఆఫ్ టీచర్స్ ,చలికాలం చిత్రాలు ,టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్,స్కూల్ vs కాలేజ్,తింగరి సీత,2ksమామ్ ..90s మామ్ ,పిసినారి నాన్న అంటూ వరుస కామెడీ ,ఎంటర్ టైనింగ్ వీడియోలతో మిలియన్ల వ్యూస్ కి కొల్లగొట్టి ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

957 వీడియోలు –  77 లక్షల ఫాలోవర్స్

అలా ఇప్పటి వరకు 957 వీడియోలు పెట్టిన ఆరతి 77 లక్షల మందిని తన ఫాలోవర్స్ గా మార్చుకుందంటే కంటెంట్ లో ఎంత కిక్కుంటుందో అర్థమైపోతుంది.ముఖ్యంగా తను చేసిన తింగరి సీత అయితే యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఇక ఈ పేరే ఆరతికి ఇంటి పేరుగా మారిందంటే కూడా ఆశ్చర్యం లేదు.ఇక ఒక వైపు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూనే రంగు బొమ్మలు అనే సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించి ఆరతి.అయితే అనుకోని కారణాల వల్ల సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడం గమనార్హం.

ఆరతి సంపాదన విషయానికి వస్తే

ఇక పెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ ని సొంతం చేసుకున్న ఆరతి సంపాదన విషయానికి వస్తే దాదాపు నెలకి సుమారుగా 4 లక్షల నుండి పది లక్షల మధ్య యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా ఇన్ కం వస్తుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.

అయితే వీడియోస్ రీచ్ ని బట్టి ఈ నంబర్ కొన్ని సార్లు ఎక్కువ ,మరికొన్ని సార్లు తక్కువ కూడా అయ్యే అవకాశం ఉందని సమాచారం .మరి ఇందులో నిజమెంతో ఈ తింగరి సీత ఆలియాస్ అల్లరి ఆరతి బయట పెడితే కాని తెలీదు. ఏది ఏమైనా చిన్నతనంలోనే నెలకి లక్షల్లో సంపాదిస్తున్న ఆరతి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పకతప్పదు.

also read :బులెట్ బండి సెన్సేషన్ …మోహన భోగరాజు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

నా ఆయుష్షు తీసుకున్నా పర్లేదు.. మా అక్కను బ్రతికించు దేవుడా.. కన్నీళ్లు పెట్టిస్తున్న ముఖేష్!

త్రిగుణ్ పై శివ రివేంజ్.. ఆ బాధ ఏంటో తెలియాలంటూ!

నా కలలను నాశనం చేశారు.. బిగ్ బాస్ తీరుపై ఝాన్సీ మండిపాటు!

పెళ్లి పీటలెక్కిన దీపికా రంగరాజు.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి తల్లీ?

ముఖేష్ – త్రిగుణ్ మీ పంతం వీడరా?

అందరినీ నవ్వించే రాంప్రసాద్ జీవితంలో ఇంతటి విషాదమా?

నా భార్య అందుకే నన్ను వదిలేసింది. సుధీర్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×