Sadar Sammelan: సదర్ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. యాదవ సోదరులందరికీ సదర్ సమ్మేళన శుభాకాంక్షలు సీఎం తెలిపారు. ఇది యాదవులకే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి ఆత్మగౌరవ సమ్మేళనం అని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటి గోల్కొండ కోట ఒకనాటి గొల్లంకొండ. యాదవ సోదరుల సహకారంతోనే హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందిందని, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారిని యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని అన్నారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలన్న ఆలోచన చేయలేదు. యాదవులు కొరగానే మేం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాంమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సదర్ సమ్మేళనం నిర్వహణకు రూ.5 కోట్లు మంజూరు చేశామని, తెలంగాణలో మేం కులగణన చేసి చూపించాం. తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా కులగణన నిర్వహించామని అన్నారు. మా ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం కల్పించామని, అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్ కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దీంతో పాటుగా ఈశ్వరమ్మ యాదవ్ ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించామని అన్నారు.
యాదగిరి గుట్ట గోశాలలో గోసంరక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రాబోయే యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటామని సీఎం హమీ ఇచ్చారు. యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు లేకుండా చూసే బాధ్యత మాది. దేశంలో తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనినేదే మా ప్రయత్నం అని, మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని ఇందుకు యాదవ సోదరుల సహకారం ఉండాలని కోరుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.