Illu Illalu Pillalu Today Episode june 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన మాటను కాదని పెళ్లి చేసుకుందని కూతురి పై కోపంతో అరుస్తాడు. నర్మదా తండ్రి అన్నమాట తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. సాగరు బండి ఆపి పెళ్లికి ముందే నేను రైస్ మిల్ లో పనిచేస్తున్న సంగతి నీకు తెలుసు కదా నర్మదా అని అంటాడు. మా నాన్న ప్రతి మాటకి నా దగ్గర సమాధానం లేదు. లేచిపోయి పెళ్లి చేసుకున్నాను అన్న కోపం ఆయనకు తగ్గిపోయింది. కానీ ఆయన బాధంతా అల్లుడు ఏం చేస్తున్నాడో చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉందని అంటున్నాడు అని నర్మదా అంటుంది.. నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానని నాతో అన్నావు కానీ దాని గురించి నువ్వు మాట్లాడట్లేదు అని నర్మదా సాగర్ నిలదీస్తుంది. అటు ప్రేమ ఎగ్జామ్ కోసం కాలేజ్ కు వెళ్తుంది. ప్రేమ ధీరజ్ ఇద్దరూ మాస్ కాపీ కొడుతూ దొరికిపోతారు. అయితే ప్రేమ ఏదో ఒకటి మేనేజ్ చేసి ఆ గండం నుంచి బయటపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ బయటకు వెళుతూ తన ఫ్రెండ్స్ తో ఏదైనా చిన్న కాలేజీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. పెద్ద కాలేజీలో చదవాలంటే చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ధీరజ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అని అంటుంది.. ప్రేమ తన పరిస్థితి బాగోలేదని కచ్చితంగా నేను కాలేజీని మానేయాల్సి వస్తుందని తన ఫ్రెండ్స్ తో చెప్తుంది. అయితే ఆ మాట విన్న ధీరజ్ ఫీల్ అవుతాడు.. ప్రేమ ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ధీరజు ప్రేమ అన్న మాటలు విని బాధపడుతూ ఉంటాడు.. అటు సాగర్ కూడా నర్మదా అన్న మాటలు, మా నాన్న వాళ్ళ నర్మద ఎంత బాధపడిందో అని ఆలోచిస్తూ ఒక చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అయితే అటు ధీరజ్ కూడా అదే చెట్టుకు అటువైపుగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు… ఏమైంది ఎందుకు బాధపడుతున్నావని ధీరజ్ సాగర్ ని అడుగుతాడు. ఇద్దరు ఒకరి బాధలు ఒకరికి చెప్పుకొని ఫీల్ అవుతూ ఉంటారు.. అయితే ప్రేమ కోసం నేను ఏదో ఒకటి చేయాలి నైట్ టైం డ్రైవర్ గా పని చేస్తాను అని అంటాడు.
వదిన కోరుకున్నట్లుగా నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత నర్మదా వల్ల నాన్న మన ఇంటికి వచ్చేలాగా చేస్తాను అని సాగర్ అంటాడు. అయితే ఇద్దరూ ఈ విషయాన్ని ఇంట్లో తెలియని ఇవ్వకూడదు అని అనుకుంటారు. అటు తిరుపతి ఆగమేఘాల మీద వచ్చి బావ ఒకేసారి 10 ఇళ్లలో దొంగతనాలు చేశారు మనం జాగ్రత్తగా ఉండాలి బావ ఊర్లో అందరూ టెన్షన్ పడుతున్నారు అని అంటాడు. అది నిజమేరా? ఇంట్లో 10 లక్షలు డబ్బులు ఉన్నాయి వెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయమని అంటాడు. అన్నానంటే అన్నానంటారు ఇంట్లో ఉన్న బంగారు గురించి మీరు ఆలోచించరా అని వేదవతి అంటుంది.
అవును అది నిజమే కదా ఇంట్లో డబ్బులతో పాటు పిల్లలు బంగారు కోడలు తెచ్చిన బంగారు అన్నీ ఉన్నాయి కదా వాటిని కూడా రేపు బ్యాంకులో పెట్టేద్దామని రామరాజు అంటాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి ఫ్యూజులు అవుట్ అవుతాయి. అయితే శ్రీవల్లి ఆ బంగారం గురించి తెలిసిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆ నగలు అన్నిటిని ఒకచోట పెట్టుకుని ఇవి గిల్టు నగల అని తెలిస్తే నా బండారం బయటపడుతుంది. దొంగలు వీటికి ఎత్తుకుపోయిన బాగుండేది పీడ వదిలిపోయేది అని ఆలోచిస్తూ బాధపడుతూ మరోవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది..
Also Read: రెచ్చిపోయిన పల్లవి.. కన్నీళ్లు పెట్టుకున్న అవని.. చక్రధర్ పై అనుమానం..
వెంటనే ఇంటికి వచ్చిన చందు నగలన్నీ ఇట్లా పెట్టుకున్నవేంటి దొంగలు పడ్డారంట బ్యాంకులో పెట్టాలి వీటిని అని అంటాడు. ఆ తర్వాత మీ అమ్మ 10 లక్షలు ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ పది లక్షలు ఇవాళ రేపు ఇవ్వలేకపోతే నేను కచ్చితంగా ఇంటికి వెళ్లి అడుగుతానని శ్రీవల్లికి షాక్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..