Intinti Ramayanam Today Episode june 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ తో సంతకం చేయించిన వ్యక్తిని చూసి ఫాలో అవుతూ అవని శ్రీకర్ చక్రధర్ ఇంటికి వెళ్తారు. కచ్చితంగా చక్రధర్ మనిషి అని అభిప్రాయానికి వస్తారు.. అసలు వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు వీడియో తీయాలని అనుకుంటారు. ఇది ఇద్దరు కలిసి కిటికీలోంచి చక్రధర్ మాటల్ని రికార్డ్ చేస్తారు. అక్షయ్ తో సంతకాలు పెట్టించుకోవడానికి మేము చాలా రిస్క్ చేశామని పర్సంటేజ్ ను పెంచాలని అతను అడుగుతాడు. అయితే వీడియో అయితే రికార్డు అవుతుంది కానీ ఆడియో రికార్డ్ అవ్వలేదు వదినా అని శ్రీకర్ అంటాడు. మనం నేరుగా వెళ్లి వాళ్ళతో తేల్చుకుంటే అసలు సంగతి ఏంటో తెలిసిపోతుంది కదా అని శ్రీకర్ అంటాడు.
అవని కూడా లోపలికి వెళ్లి తేల్చుకుందామని ఇద్దరు కలిసి వెళ్లిపోతారు. అయితే లోపలికి వెళ్ళగానే అక్కడ ఆ వ్యక్తి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అవని మీరు మమ్మల్ని మోసం చేసిన వ్యక్తితో డీల్ కుదుర్చుకోవాలని ఏదేదో ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లతో మీరు పెట్టుకుంటే మీకే నష్టమని అంటుంది. అసలు నిజాలు ఏంటో త్వరలోనే తెలుస్తాయని చక్రధర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అవని.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి చక్రధర్ దగ్గరికి అవని వెళ్లిన విషయాన్ని తెలుసుకొని పార్వతి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద రచ్చ చేస్తుంది. అత్తయ్య బావగారు అంటూ కేకలు పెట్టి అరవడంతో రాజేంద్రప్రసాద్ ఏమైందో అని బయటకు వస్తాడు. ఆ అవని ఏం చేసిందో తెలుసా మా నాన్న దగ్గరికి వెళ్లి క్రిమినల్ అని అనుమానించింది. అంతగా మా నాన్న ఏం చేశాడు. ఎవరిని మోసం చేశాడు..? అసలు మా నాన్న ఏం చేశారని అనుమానించడానికి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే మర్యాదగా ఉండదు అని పల్లవి అవని పై సీరియస్ అవుతుంది.
కంపెనీ దివాలా తీసినందుకు మా నాన్నకి ఏంటి సంబంధం? అసలు నువ్వు మా ఇంటికి వెళ్లాల్సిన అవసరం నీకేంటి..? మా డాడీ ఏదైనా అనే ముందర నీ గురించి నువ్వు ఆలోచించుకోవా..? తల్లిదండ్రుల గురించి నీకేం తెలుసు నువ్వు ఒక అనాధవి అని పల్లవి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. అయితే పల్లవి మాటలు విన్న రాజేంద్రప్రసాద్ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. తండ్రిని వాడిని కొంటే నువ్వు ఇలా చేసేదానివే కాదు.. అనాధగా ఆశ్రమంలో పెరిగిన నీకు ఇలాంటి విలువలు తెలియవు అని పల్లవి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.
రాజేంద్రప్రసాద్ అనాధనా అనాధ అంటే ఎవరు అందరూ ఉన్నా కూడా ఎవరూ లేరు అన్నట్లు బ్రతుకుతున్న మీరు అనాధలు.. అవనికి అందరూ ఉన్నారు అనాధలు ఎలా అవుతుంది. ఆ మాట వినగానే పార్వతి కూడా మీ మామయ్య గారికి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియక కోడల్ని వెనకేసుకొస్తున్నాడు అంటూ ఎటకారంగా మాట్లాడుతుంది. మొత్తానికైతే పల్లవి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది. పల్లవికి మాటకు మాట సమాధానం చెబుతుంది అవని. శ్రీకర్ఇంటికి రాగానే శ్రియ చక్రధర్ బాబా ఇంటికి ఎందుకు వెళ్లారు అని అడుగుతుంది. శ్రీకర్ మాత్రం దిమ్మతిరిగేలా సమాధానం చెబుతాడు. అటు కమల్ కూడా శ్రీకర్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతాడు.
Also Read : ప్రభావతిపై మౌనిక సీరియస్.. మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి..
అవని తనని అనాధ అన్నందుకు బాధపడుతూ ఉంటుంది.. భర్త కుటుంబం నాకు దూరంగా ఉన్నా కూడా నేను పర్వాలేదులే నాకు అంత అదృష్టం లేదులే అని సద్ది చెప్పుకున్నాను కానీ.. తల్లిదండ్రులు లేరు అని అందరూ అంటుంటే నా మనసులా లేదు అని బాధపడుతుంది. రాజేంద్రప్రసాద్ అవనీని బాధపడద్దని ధైర్యం చెప్తాడు. చక్రధర్ సూపర్వైజర్ గా మన కంపెనీలో చేరారు.. కోట్లు సంపాదించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది నాకు తెలుసు అక్రమంగా సంపాదించాడు. మనమే నిజమైతే నాకు చెప్పు ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక పల్లవి వెళ్ళిపోతుంటే అవని అడ్డుపడుతుంది. మీ తండ్రి కూతురు ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..