Illu Illalu Pillalu Today Episode june 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ బయటకు వెళుతూ తన ఫ్రెండ్స్ తో ఏదైనా చిన్న కాలేజీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. పెద్ద కాలేజీలో చదవాలంటే చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ధీరజ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అని అంటుంది.. ప్రేమ తన పరిస్థితి బాగోలేదని కచ్చితంగా నేను కాలేజీని మానేయాల్సి వస్తుందని తన ఫ్రెండ్స్ తో చెప్తుంది. అయితే ఆ మాట విన్న ధీరజ్ ఫీల్ అవుతాడు.. ప్రేమ ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ధీరజు ప్రేమ అన్న మాటలు విని బాధపడుతూ ఉంటాడు.. అటు సాగర్ కూడా నర్మదా అన్న మాటలు, మా నాన్న వాళ్ళ నర్మద ఎంత బాధపడిందో అని ఆలోచిస్తూ ఒక చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అయితే అటు ధీరజ్ కూడా అదే చెట్టుకు అటువైపుగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు… ఏమైంది ఎందుకు బాధపడుతున్నావని ధీరజ్ సాగర్ ని అడుగుతాడు. ఇద్దరు ఒకరి బాధలు ఒకరికి చెప్పుకొని ఫీల్ అవుతూ ఉంటారు.. ప్రేమ కోసం నేను ఏదో ఒకటి చేయాలి నైట్ టైం డ్రైవర్ గా పని చేస్తాను అని అంటాడు. సాగర్ జాబ్ కోసం ట్రై చేస్తానని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ తన ఫ్రెండ్స్ తో ఉదయం మాట్లాడిన మాటలు విని ఫీల్ అవుతాడు. ఆ విషయం ప్రేమ జీవించుకోలేక పోతుంది తన కోరికలు ఆశలు అన్ని ఆవిరైపోతున్నాయని బాధపడుతున్నట్లు ఉంది అని ధీరజ్ అనుకుంటాడు. ఎలాగైనా సరే ప్రేమ కోరికను కచ్చితంగా తీర్చాలి అని అనుకుంటాడు. అయితే ఆ మూడ్ లోంచి ప్రేమను బయటకు తీసుకురావాలని ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్లి ఏంటి ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఏం లేదురా ఊరికే అలా ఉన్నాను అని ప్రేమ అంటుంది.
దేని గురించి నువ్వు నీ ఫ్రెండ్స్ తో చాలా దీర్ఘంగా మాట్లాడుకున్నారు అని అడుగుతాడు. కానీ ఏదో చదువుల గురించి ఆడవాళ్ళం కదరా అని అంటుంది.. ప్రేమించిన వాళ్ల కోసం కష్టపడాలి అని అందుకే అంటారేమో అని ధీరజ్ నోరు జారతాడు. నేను నీకు చెప్పాను కాబట్టి ప్రేమ ఏమైందిరా నామీద ప్రేమ పుట్టిందా అని అమాయకంగా అడుగుతుంది. ప్రేమ లేదు ఏమి లేదు అని ఇద్దరు కొట్లాడుకుంటారు. ఏమండీ ప్రేమించిన అమ్మాయి ఏంటి అని ధీరజ్ ను అడుగుతుంది ప్రేమ. మా అన్నయ్య అని అంటాడు.
ప్రేమించిన అమ్మాయి కోసం అమ్మాయి వాళ్ళ ఇంట్లో మర్యాద కోసం ఓ నిర్ణయం తీసుకున్నాడు అని అంటాడు. ఏమైంది రా ఏం జరిగింది అంటే.. ఈరోజు వదిన వాళ్ళ నాన్న పుట్టినరోజు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్లిందట. రైస్ మిల్లులో పనిచేస్తున్న వాడిని నా అల్లుడుగా ఎలా అంగీకరించాలని అడిగాడట. దానికి వదినా చాలా బాధపడిందని అన్నయ్య బాధపడ్డాడు. అందుకే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అని అంటాడు. ఈ విషయం నువ్వు ఎక్కడ ఎవరితోనో చెప్పకు అని ప్రేమతో మాట తీసుకుంటాడు ధీరజ్.
నిజంగా చాలా గ్రేట్ కదరా.. ఈ విషయం నేను ఎవరితోనో చెప్పద్దు అని ప్రేమ దగ్గర ధీరజ్ మాట తీసుకుంటాడు.. అటు సాగర్ కూడా ప్రేమకి విషయాన్ని చెప్పొద్దు అని ధీరజ్ గురించి చెప్పి మాట తీసుకుంటాడు. ఉదయం లేవగానే తిరుపతి పెళ్లి కాలేదని బాధపడుతూ ఉంటాడు. రామరాజు తిరుపతికి వయసు అయిపోయింది ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటే అస్సలు బాగోదు అంటూ కామెంట్లు చేస్తాడు. తన కొడుకులిద్దరూ తిరుపతి పై సెటైర్లు వేస్తూ సరదాగా ఉంటారు. వీళ్ళందర్నీ చూసిన ధీరజ్ అక్కడికొస్తాడు. అయితే అప్పుడే రామరాజు అక్కడినుంచి వెళ్ళిపోతాడు.
Also Read:
కానీ అన్నదమ్ములు మాత్రం ధీరజ్ తో సరదాగా ఉంటారు.. ఇక ప్రేమ నర్మదా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చాలా బాధపడిపోతున్నావని ధీరజ్ చాలా బాధపడుతున్నాడు అని నర్మదా అంటుంది. నర్మదా నోరు జారి అసలు విషయాన్నీ చెప్పబోతోంది. మొత్తానికైతే ప్రేమకు ధీరజ్ గురించి అసలు విషయాన్ని చెప్పేస్తుంది. నిజంగా ప్రేమించే వ్యక్తి దొరకడం నువ్వు చాలా అదృష్టవంతురాలు విని నర్మదా అంటుంది. ప్రేమ నేను మాత్రమే కాదు నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి అని సాగర్ నిర్ణయం గురించి అంటుంది. ఆ మాట వినగానే నర్మదా నవ్వుతుంది. ఆయనకు రైస్ మిల్ లే మొదటి పెళ్ళాం అలాంటిది జాబ్ చేస్తాడా అని అడుగుతుంది. ఉదయం మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా అక్కడ మీ నాన్న వాళ్ళు నిన్ను బాధ పెట్టారంట కదా దానికి బావగారు బాధపడిపోయారట. జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడట అని ప్రేమ అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…