Illu Illalu Pillalu Today Episode March 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి వేదవతి ఎందుకు కొడుతుందో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరి గురించి ఏం చెప్పినా సరే అత్తయ్య గారు నన్ను తబలా వాయించుకుంటూ వాయించేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని వల్లి లోపలికి వెళ్లి బాధ పడిపోతూ ఉంటుంది.. అత్తయ్య గారు నా గురించి ఏం తెలుసుకున్నారు అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావడమే లేదు. ఎప్పుడు వచ్చినా మీద పడుతుందో అర్థం కావడం లేదు అని శ్రీవల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. వల్లి లోపల ఆలోచిస్తూ ఉండగా రామరాజు నాకు ఆ విషయం తెలియదండి అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి గెట్టిగా కేకలు వేస్తాడు.. వల్లి అమ్మ వల్లి అంటూ కేకలు వేయడంతో నర్మద ప్రేమలో నిజం ఎక్కడ చెప్పేశారో అని కంగారు పడిపోతూ ఉంటుంది శ్రీవల్లి..
కొంపతీసి మావయ్య గారికి నిజం చెప్పారో ఏంటో అని భయపడుతూ వచ్చిన వల్లి. ఏమైంది మావయ్య గారు ఎందుకలా అరుస్తున్నారు అని అడుగుతుంది. నువ్వు ఇన్ని రోజులు స్కూల్ కి ఎందుకు వెళ్లలేదు అని రామరాజు అడగగానే.. మీరు దాని గురించి అడిగారా నేను ఇంకా ఏదో దాని గురించి అని అనుకున్నాను అని వల్లి అంటుంది. ఇంక దేని గురించి అనుకున్నావ్అక్క అని ప్రేమ అడుగుతుంది. శ్రీవల్లి స్కూలుకు వెళ్లాల్సిందే అని వేదవతి కండిషన్ పెట్టడంతో ఇక తప్పక స్కూల్ కి వెళ్తుంది. అయితే అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ పుట్టింట్లో చేరుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ అమూల్యని కాలేజీకి రెడీ చేసి వెళ్ళమని చెప్తుంది. ఇప్పుడు నా మరదలు చాలా అందంగా ఉంది కాలేజీకి వెళ్తే అంతా మర్చిపోతావు అని ప్రేమ అంటుంది. నాకు భయంగా ఉంది వదిన అని అమూల్య ఎంతగా చెప్తున్నా సరే ప్రేమ మాత్రం భయపడడం ఎందుకు? కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ అందరితో నాలుగు రోజులు సరదాగా ఉంటే అన్ని మర్చిపోతావు అని ప్రేమ అంటుంది.. చాలా థాంక్స్ వదినా అని అమూల్య ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మా చెల్లెలు గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని అది నేను నా వాళ్ళు తీసుకుంటారు నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవద్దని ధీరజ్ అంటాడు.. ఇక తర్వాత ధీరజ్డు ప్రేమని ఎంతగా అసహ్యించుకుంటున్న సరే ప్రేమ మాత్రం ధీరజ్ పై ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది.
వీరిద్దరికీ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్లి గురక పెట్టి నిద్రపోవడం చూసిన భాగ్యం నా కూతురు ఎంత ఇబ్బందులు పడుతుందో ఇలా గురక పెట్టి సోయ లేకుండా పడుకుంది అని అనుకుంటూ ఉంటుంది.. అయితే టైం చూడగా 5 అవుతుందని బల్లిని భాగ్యం లేపుతుంది.. నేను నిద్రపోక రెండు రోజులైంది అమ్మ నువ్వేంటి టైం చెప్తున్నావు నన్ను నిద్రపోనివ్వు అని వల్లి అంటుంది. నీ బాధ నాకు అర్థమైంది కానీ స్కూల్ టైం అయిపోయింది కదా మీ ఆయన నిన్ను తీసుకెళ్లడానికి స్కూల్ కి వస్తాడేమో నువ్వు బేగి వెళ్లాలి కదా అని భాగ్యం అంటుంది.. నేను ఇవాళ ఇక్కడే ఉంటానని మీ అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు అని శ్రీవల్లి వాళ్ళ అమ్మతో చెప్తుంది అప్పుడే ప్రేమ నర్మద ఇద్దరు కలిసి వల్లికి ఫోన్ చేస్తారు..
ఏంటి వల్ల అక్క ప్రశాంతంగా ఉన్నట్లు ఉన్నావు బావకు నేను వాయిస్ లోని పంపించాను. నువ్వు పరిగెత్తు.. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో పరిగెడితే తప్ప బావ దగ్గరికి నువ్వు చేరుకోలేవు అని బెదిరిస్తారు.. వామ్మో మా ఆయనకి వాయిస్ నోటు పంపించారంట నా పని అయిపోయినట్లే అని శ్రీవల్లి పరుగులు పెట్టి స్కూల్ దగ్గరికి చేరుకుంటుంది.. చందు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వల్లి లిఫ్ట్ చేయకపోవడంతో చందు కంగారు పడిపోతూ ఉంటాడు.. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని పదేపదే ఫోన్లు చేస్తాడు. కానీ స్కూల్ లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన వల్లిని చూసి ఏంటి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు అని అంటాడు.
ప్రేమ ఇందాక నాకు ఒక వాయిస్ నోట్ పంపించింది అదేంటో నేను ఇంకా చూడలేదు అని చందు అనగానే.. అది నేను వింటాను నేను వింటాను అని శ్రీవల్లి అంటుంది.. అయితే చందు ఏంటి చిన్నపిల్లలాగా ఇలా చేస్తావు ఆగు నేను ప్లే చేస్తాను విందువు అనేసి అంటాడు.. ఇక చందు బావ వల్లి అక్కకు స్కూల్ టైం అయింది. నువ్వు వెళ్లి తీసుకురా లేట్ చేయకు మళ్ళీ అక్క టెన్షన్ పడిపోతుంది అని వాయిస్ లో వినిపించడంతో శ్రీవల్లి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది.. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఇవాళ రాత్రి వల్లి అక్కని ఆడుకోవడానికి ఎవరి టైం అని ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. అందులో ప్రేమ గెలుస్తుంది. ఇక తర్వాత వల్లిని చూసిన ప్రేమ నర్మద ఇద్దరు కూడా రమ్మని పిలుస్తారు..
Also Read : కమల్ కు అడ్డంగా దొరికిన పల్లవి.. అందరికి బట్టలు తెచ్చిన చక్రధర్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..
నీకు కేవలం రెండు రోజులు మాత్రమే టైం ఇస్తున్నాము.. ఆ లోపల నీ అంతటి నువ్వే నిజాన్ని ఒప్పుకున్నావా సరే సరే లేదంటే మాత్రం నీ బతుకు బస్టాండ్ అని ఇద్దరు వార్నింగ్ ఇస్తారు.. ఆ తర్వాత ప్రేమ ధీరజ్ఇద్దరు కూడా కాసేపు గొడవ పడతారు. వీరిద్దరి గొడవా ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. ధీరజు ఎలాగోలాగా బయటకు వచ్చి బట్టలు వేసుకోవాలని చూస్తే ప్రేమ ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటుంది. ప్రేమ దెబ్బకు ధీరజ్ కు ఫీజులు అవుట్ అవుతాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…