Illu Illalu Pillalu Today Episode November 11th: అందరూ సరదాగా భోజనం తిన్న తర్వాత అలా వెళుతూ ఉండగా రామరాజు వెనకాల వచ్చిన ధీరజ్ ఒక నోట్ ని తీసుకుని వచ్చి రామరాజుకి ఇస్తాడు. అది చూసిన రామరాజు అరె ఏంట్రా ఇది అంటే నాన్న ఒకసారి చూడండి మీరే అని అంటాడు.. అయితే అది చదివిన సుకన్య ఒక్కసారిగా విని రామరాజు షాక్ అవుతాడు.. రామరాజు దగ్గర తీసుకున్న 30 లక్షలు వడ్డీతో సహా ఇస్తాను అని రాసి ఉంటుంది. అయితే ఎందుకురా నేను నీ కన్నతండ్రిని రా నువ్వు ఇలా ఇచ్చిన డబ్బులకి వడ్డీ కడతాను అని అంటే నా మనసు బాధపడుతుంది అని రామరాజు ఎంతగా చెప్పినా సరే నా ఆత్మ అభిమానం కోసం మీరు ఒప్పుకోవాల్సిందే నాన్న అని అనగానే రామరాజు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.. దానికి ధీరజ్ మాటతో రామరాజు ఫీలైన కూడా తన గౌరవాన్ని పెంపొందించుకోవడానికి అనగానే మౌనంగా ఉంటాడు.
ఎంతగా దెబ్బ కొట్టాలని చూసినా వాడు ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు అని భద్ర చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ధీరజ్ గాన్ని ఎలాగైనా సరే ఈసారి దెబ్బ కొట్టాల్సిందే అని భద్రావతి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది.. నాకు షాప్ ఓపెనింగ్ కి రమ్మని ఇన్వైట్ చేసాడు కదా… కచ్చితంగా నేను వెళ్తాను ఆ భాగ్యంకి ఫోన్ చేసి రమ్మను కచ్చితంగా వాడికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాను అని అని భద్రావతి అంటుంది. వాడి జీవితానికి ఇకమీదట ఏమి కోలుకోలేని దెబ్బతీస్తాను అని భద్రమైపోయింది.
అయితే నర్మదా ప్రేమని మళ్లీ వల్లిని ఇంటికి తీసుకొని వస్తాను అనడం ఇంట్లోని వాళ్ళందరికీ తెలియడంతో అయితే వల్లి మళ్లీ మళ్లీ ఇంటికి వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు కదా అని అందరూ చాలా ఫీల్ అయిపోతుంటారు. అయితే ప్రేమ మాత్రం ఏంటక్కా నువ్వు ఆ వల్లి చేసిన పనులు ఏంటి తన గురించి తెలిసి కూడా నువ్వు ఇలాంటి మాటలు ఎందుకు అంటావు. తీసుకొని వస్తానని ఎందుకు అడుగుతున్నావు అని ప్రేమ ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.ఆ వల్లి చేసిన పనులు నీకు గుర్తుకు రాలేదా ఇంటిని నాశనం చేసింది అని ప్రేమ నర్మదపై సీరియస్ అవుతుంది. ఏమైనా చెప్పక్క ఆ వల్లిని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తే నేను అస్సలు ఒప్పుకోను అని ప్రేమ అంటుంది.
నర్మదకు ధీరజ్ సపోర్ట్ గా ఉంటాడు అటు వేదవతి కూడా ప్రేమకు తోడుగా ఉండడంతో ఇద్దరు ఆ శ్రీవల్లి నేను మళ్లీ ఇంటికి తీసుకురావద్దు అంటున్నారు గొడవ పెట్టుకుంటారు.. ధీరజ్ మాత్రం నర్మద వదిన ఏం చేసినా కూడా అందులో ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వదినని ఇంటికి తీసుకొని వస్తుంది అని నర్మదకు సపోర్ట్ చేస్తాడు.. ఇక మొత్తానికి శ్రీవల్లి మళ్ళీ ఇంటికి వస్తుందని తెలుసుకున్న ప్రేమ మాత్రం ఇప్పట్లో అది వస్తే మళ్ళీ ఏదో ఒకటి పెడుతుంది మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. తిరుపతి వచ్చి షాప్ కి ఎవరు పేరు పెట్టాలి అని అడిగితే కచ్చితంగా నా పేరు పెడతాడు అని ప్రేమ అంటుంది. కానీ వేదవతి ఫీల్ అవ్వడంతో చీటీలు వెయ్యాలని అనుకుంటారు అయితే మొత్తం చీటీలలో ప్రేమ పేరు రాసుకోవడంతో అందరూ ప్రేమపై కాస్త కోపంగా ఉంటారు మొత్తానికి ఇది ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.
చందు విశ్వం ని కొట్టడంతో విశ్వం చాలా ఫీల్ అయిపోతుంటాడు అయితే అతనితో మాట్లాడాలి అని వెళ్లిన అమూల్యతో విశ్వం మీ ఇంట్లో వాళ్లకి నేను తబలాగా కనిపిస్తున్నానేమో అని అంటాడు.. మా అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు రా అందుకే నిన్ను కొట్టాడు తప్ప ఇంకేమీ లేదు అని చందు ఎంతకు చెప్పినా కూడా అమూల్య మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే విశ్వం పరవాలేదు మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను కొట్టినా కూడా నువ్వు మాత్రం నన్ను కొట్టలేదు. అయినా మీ అన్నయ్య వల్లికి విడాకులు ఇవ్వడం ఏంటి అతను చాలా అమాయకురాలు అని అనగానే అమూల్య కొడుతుంది. ఎలా కొట్టిందో చూడు అని విశ్వం బాధపడుతూ ఉంటాడు.
ఇకపోతే చందు కోసం నేను వెయిట్ చేస్తాను అని ధీరజ్ బయటకు రాగానే అక్కడ చందు ని తీసుకుని రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంజలి ఏంటి ఈ టైంలో అన్నయ్యని తీసుకొని వచ్చిందేంటి అని అడగగానే అసలు ఏంటి ప్రాబ్లం ఇంతగా తాగి మా ఇంటి దగ్గర పడిపోయారు. అందుకే తీసుకొని వచ్చాను అని అంజలి అంటుంది. అన్నయ్య ఇలా తాగడానికి కారణం ఇంట్లోనే సమస్యలే ఇంకేమీ లేదు అని చెప్పగానే అంజలి చాలా ఫీల్ అయిపోతుంది. అయితే చందు పరిస్థితిని చూసి అంజలి ఏంటి చందుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతుంది. ఇక ధీరజ్ అన్నయ్యను ఇలా చూడడం ఎవరైనా చూస్తే బాధపడతారు అని ఇంట్లోకి తీసుకొని వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: రమ్యకు ఘోర అవమానం.. పార్వతి షాకింగ్ నిర్ణయం..? ఇదే ఫైనల్ ట్విస్ట్..