Brahmamudi serial today Episode: జ్యూవలరీ ఎక్స్ ఫో గురించి తెలుసుకుని ఈ ఎక్స్‌ఫో లో పాల్గొందామని ఐశ్వర్య అంటే మీరు ఈ కంపెనీకి ఎలా ఎండీ అయ్యారు అంటూ పార్వతీశం మనం అందులో పాల్గొనలేమని చెప్తాడు. ఎందుకని ఐశ్వర్య అడిగితే.. మన కంపెనీ అల్‌రెడీ ఐసీయూలో ఉందని కానీ ఒక్క చాన్స్ మాత్రం ఉందని ఏదైనా పెద్ద కంపెనీకి మన కంపెనీ సిస్టర్ కంపెనీ అని ప్రూవ్ చేయగలిగితే ఆ ఎక్స్‌ఫోలోకి మనకు ఎంట్రీ దొరుకుతుందని ఎలాగూ మీ స్వరాజ్ కంపెనీ ఉంది కదా దానికి మన కంపెనీ సిస్టర్ కంపెనీ అంటూ ఇందు మేడం సంతకం పెడితే చాలని చెప్తాడు పార్వతీశం. సంతకమేగా పెట్టిద్దాం అంటూ ఐశ్వర్య చెప్తుంది.
చలపతి ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్పగానే.. రాజు వెళ్లిపోతుంటే.. వెంకీ వస్తాడు. నాన్నకు ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తావు.. ఆ ఇంటి గురించి ఆయన ముందు ఎందుకు చెప్తావు అంటే.. అరేయ్ నీకు అర్థం కావడం లేదు.. బయట పరిస్థితులు బాగా లేవు. మామూలు డిగ్రీ అసలు ఏందుకు పనికిరాకుండా పోతుంది. పైగా నువ్వు ఇప్పుడు ఎక్కడికి జాబ్ కోసం వెళ్లినా జైలు వెళ్లి వచ్చావనే అడుగుతారు.. అంటూ రాజు చెప్తుంటే.. అదంతా నా కర్మ ఏం చేయను అంటూ బాధపడతాడు. కర్మ కాదని నువ్వు నేను చెప్పేది విను.. కొన్ని రోజులు మన కంపెనీలో జాబ్ చేస్తూ.. బయట కంపెనీలో జాబ్ చేస్తున్నానని నాన్నకు చెప్పు.. ఇక్కడ జాబ్ చేస్తూనే.. వేరే కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నించు.. వేరే కంపెనీలో జాబ్ వచ్చాక నాన్నకు నిజం చెప్పు అంటాడు. ఇది అమ్మా నాన్నలను మోసం చేయడం కాదు వాళ్ల కష్టాలను తగ్గించాలి అనుకుంటే నువ్వు రేపటి నుంచి ఆఫీసుకురా అంటూ చెప్పి వెళ్లిపోతాడు రాజు.
రాజు కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటారు ఇందు, నందు. రాజు ఇంకా రాలేదేంటి..? అసలు అక్కడికి వెళ్లాడా..? లేదా..? వెళ్తే ఒప్పించాడా లేదా..? ఒప్పుకుంటే ఈ పాటికి ఇక్కడకు వచ్చి ఉండాలి. ఒప్పుకోకుంటే అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని ఇందు అంటే ఏంటక్కా టెన్షన్ పడుతున్నావు..? టెన్షన్ పడాల్సింది నేను కదా.? అంటూ నందు అడిగితే.. హలో వెంకీ మీద నీకే కాదు అభిమానం ఉంది తను నా మరిది అంటుంది ఇందు. అప్పుడే రాజు వచ్చి వెంకీ రేపే వచ్చి జాయిన్ అవ్వబోతున్నాడని అపాయింట్‌మెంట్ లెటర్ రెడీ చేసుకోండి అంటాడు రాజు.
ఇందు అనుమానంగా మామయ్య గారు అంత ఈజీగా ఒప్పుకోరే ఎలా ఒప్పుకున్నారు..? అంటూ అనుమానంగా అడుగుతూ ఫోన్ చేయబోతుంటే… రాజు తన ఫోన్ నుంచి చేస్తాను ఉండు అంటూ రాజు ఫోన్ చేస్తాడు. చలపతి కోపంగా ఫోన్ లిఫ్ట్ చేయడు. నేను ఇచ్చిన డోస్‌కు ఫోన్ ఎత్తడు అని రాజు మనసులో అనుకుంటాడు. ఫోన్ ఎందుకు ఎత్తడం లేదని ఇందు అడిగితే.. చిన్న కొడుక్కి జాబ్ వచ్చిన సంతోషంలో ఊరంతా చెప్పడానికి వెళ్లి ఉంటాడు అని రాజు చెప్పగానే.. అయితే సంతోషం అని ఇందు చెప్తుంది.
రాజు, ఇందు పనిలో ఉంటే ఐశ్వర్య వచ్చి హైదరాబాద్ బిజినెస్ ఎక్స్‌ఫో లో పాల్గొనాలి అంటే స్వరాజ్ కంపెనీకి ఐశ్వర్య కంపెనీ సిస్టర్ కంపెనీ అని డ్యాకుమెంట్ రెడీ చేయించాను సంతకం పెట్టు అని అడగ్గానే.. ఇందు ఆశ్చర్యంగా చూస్తుంది. రాజు ఎక్స్‌ఫో అంటే అంత ఈజీ కాదు.. అంటాడు. భూషణ్, రేఖ, భ్రమరాంబ.. ఐశ్వర్యకు సపోర్టుగా మాట్లాడతారు. దీంతో అందరి మద్య గొడవ జరుగుతుంది. ఎవరేమనుకున్నా ఐడోంట్ కేర్ ఐషు మారింది అని మాకు నమ్మకం వచ్చే వరకు నేను సంతకం చేయను అంటూ ఇందు వెళ్లిపోతుంది. ఐశ్వర్య కోపంతో చూస్తుంది.
మరోవైపు వెంకీని కలిసిన నందుకు ఇంట్లో తన జాబ్ విషయంలో జరిగిన గొడవ మొత్తం చెప్తాడు. అందుకు నందు బావ ఇంత అబద్దం చెప్పావా..? అనుకుంటుంది. కానీ రాజు చేసింది కరెక్టేనని అంటుంది. అబద్దం చెప్పడం తప్పు కాదా..? అంటే తప్పేం కాదని అంటుంది నందు.
ఇంటికి వచ్చిన సుభాష్ ఫ్రెండ్ నరేంద్రతో సుభాష్ ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే.. రాజు చాటు నుంచి వింటూ బాధపడతాడు. మీ పరిస్తితి ఏంటి ఇలా మారిపోయింది అంటూ నరేంద్ర బాధపడుతుంటాడు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే అసలు నచ్చడం లేదు అంటూ నరేంద్ర ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.