E-Paper
Advertisement

కోట్లు  విలువైన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి!

కోట్లు  విలువైన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి!
Advertisement

Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీముఖి(Sreemukhi) ఒకరు. ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు స్పెషల్ ఈవెంట్స్ అంటూ ఇండస్ట్రీలో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇలా యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు పలు వ్యాపారాలను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలో సంపాదిస్తున్న శ్రీముఖి తన సంపాదనతో ఆస్తులను కూడా భారీగా పోగు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదులో ఈమెకు సుమారు మూడు ఇండ్లు ఉన్నాయని తెలుస్తుంది. అయితే తాజాగా మరో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి..

తాజాగా ఈ కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా శ్రీముఖి ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజలు చేసి తమ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ఇంటికి సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా శ్రీముఖి తన ఇంటిని అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ తో తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారని తెలుస్తోంది. ఇలా దీపావళి పండుగ సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి గృహప్రవేశ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

నెలకు లక్షల్లో ఆదాయం…

Advertisement

ఈ విధంగా శ్రీముఖి కొత్త ఇంటిని కొనుగోలు చేశారు అనే విషయం తెలియజేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.  శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతూ భారీ స్థాయిలో సంపాదిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు 2.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. బుల్లితెర కార్యక్రమాలతో మాత్రమే కాకుండా బిజినెస్ అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా శ్రీముఖి భారీగా సంపాదిస్తున్నారు. ఇలా ప్రతి నెల లక్షల్లో ఆదాయం అందుకుంటున్న శ్రీముఖి ఆస్తులను కూడా భారీగా కొనుగోలు చేస్తున్నారు.

?srtk=MXF6MmM0YjFobDM4Mw%3D%3D

Advertisement

ఇక శ్రీముఖి దీపావళి పండుగ సందర్భంగా ఈ వీడియోని షేర్ చేస్తూ ఈ దీపావళి తనకు ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. అయితే ఈ దీపావళి ఎందుకంత ప్రత్యేకత అనే విషయాలను తాను త్వరలో మీకు తెలియజేస్తానని ఈమె పోస్ట్ చేశారు. ఇక కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఈ దీపావళి తనకు ప్రత్యేకంగా మారిందని అదేవిధంగా శ్రీముఖి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు శ్రీముఖి ఎక్కడ స్పందించకపోవడం విశేషం. మరి ఈమె పెళ్లి వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే శ్రీముఖి స్పందించాల్సి ఉంది.

Also Read: బిగ్ బాస్ వెళ్లి నా కొడుకుకు దిష్టి తగిలింది.. ఇమ్మాన్యుయేల్  మదర్ కామెంట్స్ వైరల్!

Related News

బిగ్ బాస్ వెళ్లి నా కొడుకుకు దిష్టి తగిలింది.. ఇమ్మాన్యుయేల్  మదర్ కామెంట్స్ వైరల్!

కూతుర్ని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ సీన్స్!

షన్ను పెళ్లి చేసుకుంటే నేనూ చేసుకోవాలా? పెళ్లి పై దీప్తి సునయన కామెంట్స్ వైరల్!

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !

కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత.. తండ్రి చేసిన పనితో?

శృతి రాకతో రెచ్చిపోయిన దుల్కర్.. జగపతిబాబు షోలో ఎన్నో ముచ్చట్లు!

జాను లిరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఏవో తెలుసా?టాప్ ఫోక్ సాంగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×