E-Paper
Advertisement

విశాఖ సీఐఐ సదస్సు సర్వం సిద్ధం.. 58 దేశాల నుంచి ప్రతినిధులు, సాయంత్రం హోంమంత్రి అమిత్ షా రాక

విశాఖ సీఐఐ సదస్సు సర్వం సిద్ధం.. 58 దేశాల నుంచి ప్రతినిధులు, సాయంత్రం హోంమంత్రి అమిత్ షా రాక
Advertisement

Visakha CII Summit: విశాఖలో జరగనున్న సీఐఐ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. 18 మంది దేశాల మంత్రులు 1250 మంది పారిశ్రామిక దిగ్గజాలు ఈ సమ్మిట్ హాజరవుతున్నట్లు అంచనా. కేంద్రమంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు హాజరవుతున్నారు.

విశాఖ సీఐఐ సదస్సు సర్వం సిద్ధం

పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి, అంతర్జాతీయ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం, ప్రపంచ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులను ఒకచోట చేర్చే ప్రతిష్టాత్మక 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం వేదికైంది. గురువారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి 18 మంది విదేశీ మంత్రులు, 40 మంది అంతర్జాతీయ నేతలు, దాదాపు 58 దేశాల నుంచి 3800 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా.

58 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు రాక

Advertisement

దీని ద్వారా రూ. 11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో కూడిన 160కి పైగా అవగాహన ఒప్పందాలు- MoU లు కుదరనున్నాయని సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 2.5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖ నగరానికి వచ్చే అతిథులకు మెచ్చేలా ఆతిథ్యం రెడీ చేసింది. సమ్మిట్‌ కోసం విచ్చే అతిథుల కోసం 26 హోటళ్లలో 580 గదులను బుక్‌ చేశారు.

అమరావతి నుంచి బుధవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖకు రానున్నారు. ఇతర డెలిగేట్లు, ఉన్నతాధికారులతో సాయంత్రం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం కేంద్రమంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్ తోపాటు పలువురు కేంద్రమంత్రులు విశాఖకు రానున్నారు. 12న సమ్మిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్రమంత్రుల చేతుల మీదుగా జరగనుంది. విదేశీ ప్రతినిధులు, పరిశ్రమల అధినేతలతో బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

Advertisement

ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామిక దిగ్గజాల రానున్నారు. సింగపూర్, యూఏఈ, జపాన్, రష్యా, స్లోవేకియా, గ్వాటెమాల ప్రతినిధుల భాగస్వామ్యం అయ్యారు. బుధవారం అనగా నేటి నుంచి ప్రీ-సమ్మిట్ సమావేశాలు జరుగుతాయి. 14న ప్రజల కోసం ఓపెన్ ఎగ్జిబిషన్ నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ సదస్సులో ప్రధాన ఆరు అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఏపీ ప్రజలకు పండగ కానుక, మూడు నెలలపాటు అందుబాటులో

అలాగే దేశీయంగా ఉండే పారిశ్రామికవేత్తలంతా హాజరుకానున్నారు. సదస్సులో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ఆర్థికమంత్రి సీతారామన్ వచ్చే అవకాశం ఉంది.

Related News

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఏపీ ప్రజలకు పండగ కానుక, మూడు నెలలపాటు అందుబాటులో

డబ్బులు ఇవ్వలేదని గరుడ పురాణం శిక్ష.. బాధితుడి పరిస్థితి ఏంటి? నెల్లూరులో షాకింగ్ ఘటన

రాప్తాడు ఎన్‌కౌంటర్ కేసు.. హైకోర్టులో కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

కిర్లంపూడి పీఎస్‌లో అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ విడాకులపై ఎమన్నారంటే?

ఏపీ ఎంపీపీ, జడ్పీ అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన అన్నపరెడ్డి.. జగన్ తీరుపై తీవ్ర విమర్శలు!

ఏపీ రాజకీయాల్లో న్యూ ట్రెండ్.. పవన్ విడాకుల వేళ, బాబు-జగన్ సీరియస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×