Intinti Ramayanam Today Episode November 11th : పల్లవి అలా రమ్యను కొట్టగానే అవని ఇంటికి వచ్చిన గెస్ట్నువ్వు కొడతావా నీకు ఎంత ధైర్యం అని అరుస్తుంది. అంతే కాదు పల్లవిని కొడుతుంది కూడా.. నువ్వు నా ఇంటికొచ్చిన నా ఫ్రెండ్ నే కొడతావని కమల్ కూడా పల్లవిని కొట్టబోతాడు. ఇక అందరూ కూడా ఇంట్లోని వాళ్ళందరూ పల్లవిని అరుస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అతను ఇంట్లోకి రానివ్వడమే నేను చేసిన పొరపాటు అని అందరూ చాలా ఫీల్ అవుతారు. అయితే పల్లవి మీ అంత చూస్తాను మీరు ఇంత సంతోషంగా ఉంటారు నేను అసలు అనుకోలేదు అని ఇక అంటుంది ఆ మాటతో భరత్ కూడా రెచ్చిపోతాడు ఇక అందరూ కూడా కొట్టుకునే వారికి వెళ్తారు మొత్తానికి పల్లవి వెళ్లిపోగానే రమ్య ఫీల్ అయిపోయిందని చాలా బాధపడిపోతారు.
పల్లవి పై చక్రధర్ సీరియస్ అవుతాడు మీరు ఎందుకు తీసుకొని వెళ్లారు. ఇలాంటివేదో చేస్తారనే మేము మీతో రాలేదు.. మీరు అక్కడికి వెళ్లి ఇంత పెద్ద ఘనకార్యం చేస్తారని మేము అసలు ఊహించలేదు చూసావా నీ బుద్ధి మార్చుకోలేదు అని అందరూ కూడా పల్లవిని తిడతారు. నా తప్పేమీ లేదు కేవలం మీ ముద్దుల కూతురే ఇదంతా చేసింది అది ఎవరితో మేకప్ వేసుకునే దాన్ని తీసుకొని వచ్చి నెత్తిన పెట్టుకుంది అని పల్లవి పై సీరియస్ అవుతారు మొత్తానికి పల్లవికి మాత్రం చివాట్లు తప్పలేదు. ఒకసారి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే అస్సలు ఊరుకోను. ఎప్పుడు వెళ్ళినా కలిసిపోవాలని ఆలోచన తప్ప గొడవలు పడాలని మాత్రమే ఆలోచిస్తావని చక్రధర్ వార్నింగ్ ఇస్తాడు.
పల్లవి ఎలాగైనా సరే ఈ ఇంటికి మళ్ళీ రాకూడదు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. పల్లవి ఇంటికి వస్తే ఏదో ఒక రచ్చ చేస్తుంది అందుకే పల్లవి నీ ఇంటికి రానివ్వకుండా చేయాలి అంటే వీళ్ళిద్దరికీ త్వరగా విడాకులు రావాల్సిందే అని పార్వతి అంటుంది. రమ్య అనే అమ్మాయిని మనము ఇంటికి పిలిచి మరి అవమానించాము. అమ్మాయి ప్లేస్ లో ఇంకొకరు ఉంటే కచ్చితంగా పల్లవిని అలాగే మనల్ని కూడా చాలా అవమానించేవారు. కానీ అమ్మాయి మంచిది కాబట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అని పార్వతి అంటుంది. మనము పల్లవికి విడాకులు ఇవ్వకుండా ఉంటే కచ్చితంగా మళ్ళీ మళ్ళీ వస్తుంది ఆ విడాకులు సంగతి ఏంటో చూడండి అని అందరూ పల్లవి గురించి భయపడుతూ ఆలోచిస్తూ ఉంటారు.
పల్లవికి తొందరగా విడాకులు ఇచ్చేస్తే మనకు తనకు ఎటువంటి సంబంధం లేకుండా పోతుంది కాబట్టి మనము తొందరగా ఆ పని చేయాలి. లేదంటే మాత్రం మన ఇంటి తో సంబంధం ఉంది అని ఏదో ఒక వంకతో ఏదో ఒకటి మనల్ని చేసి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అని పార్వతి భయపడిపోతూ ఉంటుంది. అయితే పల్లవి మా బాబుని కిడ్నాప్ చేసి చంపేయాలని చూసింది అలాంటిది మళ్లీ బాబుని గనక దగ్గరికి తీసుకుంది అంటే మాకు చాలా భయంగా ఉంది అని శ్రీకర్ భయపడుతూ ఉంటాడు అందుకే కమల్ తీసుకున్న నిర్ణయానికి అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు పల్లవి ఇంకెప్పుడు ఇంటికి రానివ్వద్దు అని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.
రమ్య చాలా బాధపడిపోతుందని వెనకాలే వెళ్లిన కమ్మలు తనని ఎలాగైనా సరే.. రవి ఇంటిదగ్గర వదిలిపెట్టాలని వెంట వెళ్తాడు. అయితే రమ్య ఇంటికి వద్దు అని ఎంత చెప్తున్నా సరే.. కమల్ మాత్రం ఇక్కడ పోకిరీలు చాలా ఎక్కువగా ఉన్నారు పద.. నేను ఇంటికాడ వదిలిపెడతాను అని తీసుకొని వెళ్తాడు అయితే అప్పుడే వాళ్ళ అన్నయ్య రావడంతో రమ్య వాళ్ళ అన్నయ్యకి కమల్ తో కనిపించి అడ్డంగా దొరికిపోతుంది.. ఎవరి వీడు వీడితో తిరగడానికే నువ్వు వెళ్ళావా? గుడికి వెళ్తానని చెప్పి వీడితో తిరుగుతున్నావా అని రమ్య వాళ్ళ అన్నయ్య అనగానే కమల్ షాక్ అవుతాడు. రమ్య బాధపడుతుంది. ఇక కమల్ ఒక్కసారిగా అతని మాట విని చంప పగలగొడతాడు దాంతో రమ్య వాళ్ళ అన్నయ్య కింద పడిపోతాడు కమల్ కి మా అన్నయ్య ఎందుకలా కొట్టావు అని అడగదని సరే మీ అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళు అని రమ్య పంపిస్తుంది.
రమ్య వాళ్ళ అన్నయ్య ఎవడేవాడు వారితో తిరుగుతున్నావా వాడితో లేచిపోతావా అంటూ దారుణంగా మాట్లాడడంతో రమ్య చాలా ఫీల్ అయిపోతుంది. ఇక కమల్ ఇంకా ఇంటికి రాలేదని అవని ఎదురు చూస్తూ ఉంటుంది.అయితే అప్పుడే ఇంటికి వచ్చిన కమల్ వాళ్ళ అన్నయ్య ఒక పచ్చి తాగుబోతు అని చెప్పగానే ఏదేమైనా రమ్యకు నా వల్లే ఇదంతా జరిగింది దానికి సారీ చెప్పాలి అని అవని రమ్యకు ఫోన్ చేసి సారీ చెప్తుంది. ఇలాంటి వాళ్ళు నాకు సారీ చెప్పడం ఏంటని ఎంతగా అడుగుతున్నా సరే అసలు వినకుండా అవని నా వల్లేదంతా జరిగింది అని అంటుంది మొత్తానికి రమ్యసరి అక్క పర్వాలేదు అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :అయ్యో.. మనోజ్ కు అందుకే పిచ్చిపట్టిందా..? ఇదేం ట్విస్ట్ మావ..