E-Paper
Advertisement

బిగ్ బాస్ వెళ్లి నా కొడుకుకు దిష్టి తగిలింది.. ఇమ్మాన్యుయేల్  మదర్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ వెళ్లి నా కొడుకుకు దిష్టి తగిలింది.. ఇమ్మాన్యుయేల్  మదర్ కామెంట్స్ వైరల్!
Advertisement

Emmanuel: ఇమ్మాన్యుయేల్ బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్(Emmanuel) బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈయన టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగుతూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయేల్ బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివార్(Aadivaram with star maa parivaram) కార్యక్రమంలో పాల్గొన్నారు.

దిష్టి తగిలి బక్క చిక్కిపోయాడు..

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ మెన్స్ డే స్పెషల్ నిర్వహించారు. ఇందులో భాగంగా పాల్గొన్న సెలబ్రిటీలు వారి పేరెంట్స్ , భర్తలతో ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇమ్మాన్యుయేల్ తనతో పాటు తన తల్లిని కూడా వేదిక పైకి తీసుకువచ్చారు. ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఇమ్మాన్యుయేల్ తల్లి (Emmanuel Mother)వేదికపైనే తన కొడుకుకి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ నా కొడుకు బిగ్ బాస్ హౌస్  లోకి వెళ్లి వచ్చిన తర్వాత దిష్టి తగిలి బాగా చిక్కిపోయాడు అంటూ దిష్టి తీశారు.

గుమ్మడికాయతో దిష్టి తీసిన తల్లి..

Advertisement

ఈ విధంగా ఇమ్మాన్యుయేల్ తల్లి దిష్టి తీసివేయడంతో శ్రీముఖి మాట్లాడుతూ అవును నిజంగానే బాగా చిక్కిపోయి వచ్చినవాడు మళ్లీ బలిసిపోయాడు అంటూ శ్రీముఖి కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఇలా దిష్టి తీసి తీసి వాడికి దిష్టి పోయిందో లేదో తెలియదు కానీ వాడి జుట్టు మొత్తం  పోయింది అంటూ శ్రీముఖి మరోసారి సెటైర్ వేశారు. ఇలా శ్రీముఖి సరదాగానే ఈ కామెంట్స్ చేయడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో తన కొడుకు గెలుపు కోసం తల్లితండ్రులు బాగా కష్టపడినట్లు తెలిపారు.

Advertisement

గతంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఇమ్మాన్యుయేల్ తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో అక్కడ గెలవాలని తన తల్లిదండ్రులు తమ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి తన కొడుకుకి ఓటు వేసి గెలిపించండి అని అందరిని అడిగారు అంటూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆటతీరుతో, కామెడీ డైలాగులతో అందరిని మెప్పించిన ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలవకపోయినా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఈయన తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: రావణాసురుడిగా యష్.. కాస్ట్యూమ్స్ బరువు ఎంతో తెలుసా? నిజంగా గ్రేట్ అంటూ!

Related News

కూతుర్ని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ సీన్స్!

షన్ను పెళ్లి చేసుకుంటే నేనూ చేసుకోవాలా? పెళ్లి పై దీప్తి సునయన కామెంట్స్ వైరల్!

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !

కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత.. తండ్రి చేసిన పనితో?

శృతి రాకతో రెచ్చిపోయిన దుల్కర్.. జగపతిబాబు షోలో ఎన్నో ముచ్చట్లు!

జాను లిరి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఏవో తెలుసా?టాప్ ఫోక్ సాంగ్స్ ఇవే!

నరేష్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఏంటి సామి!

Big Stories

Advertisement
×