E-Paper
Advertisement

నువ్వో చేతకానివాడివి అంటూ హేళన చేశారు: డైరెక్టర్ బాబు

నువ్వో చేతకానివాడివి అంటూ హేళన చేశారు: డైరెక్టర్ బాబు
Advertisement

Kissik talks: జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న బాబు (Babu).. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మారి మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్నో విషయాలు పంచుకున్న ఈయన.. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తాను ఎదుర్కొన్న అవమానాలు, అలాగే తాను దర్శకుడిగా సినిమా చేస్తున్న సమయంలో తన కుటుంబానికి చెప్పకుండా దాచిన విషయాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నేను దర్శకుడిగా మారానని మా ఇంట్లో చెప్పలేదు – బాబు

ఇకపోతే బాబు మాట్లాడుతూ..” నేను డైరెక్టర్గా ఒక సినిమా చేస్తున్నానని మా ఇంట్లో చెప్పకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. సినిమా మొదలయ్యాక మద్యలో ఆగిపోయిన చిత్రాలు ఉన్నాయి. ఏమో నా సినిమా కూడా అలా ఆగిపోతుందేమో అనే భయంతో నేను డైరెక్టర్గా సినిమా చేస్తున్నానని చెప్పలేదు. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. నెలకు రూ.25,000 ఇస్తారు. అందులో రూ.10వేలు మాత్రమే పంపించగలను అని మా నాన్నకు చెప్పాను. పర్లేదు తమ్ముడు ఉన్నాడు కదా మేనేజ్ చేస్తాడని చెప్పారు. పైగా మా అక్కకు కూడా ఈ విషయం తెలియదు. కానీ ప్రీ రిలీజ్ పోస్టర్లు విడుదలయ్యాక ఊర్లో వాళ్ళు చెప్పడంతో ఆ తర్వాత అక్కకు తెలిసింది. సినిమా చేస్తున్నాడంట? ఎలా? ఏంటి? ఎలాగైనా నా తమ్ముడు సక్సెస్ కావాలి అని దేవుళ్లకు కూడా మొక్కుకుందంట మా అక్క. వాడు అమాయకుడు.. ఎలా చేస్తాడో ఏమో అని భగవంతుడిని ప్రార్థించిందట.

నాకే షాక్ ఇచ్చిన నా ఫ్యామిలీ..

Advertisement

ఇక సినిమా విడుదల అయ్యి సక్సెస్ అయ్యాక ఇంటి దగ్గర పెద్ద పెద్ద క్రాకర్లు పేల్చి ఆ వీడియోని నాకు పంపించారు. ఇక నేను షాక్ అయ్యాను. అసలు నేను డైరెక్టర్ అనే విషయాన్ని ఇంట్లో చెప్పలేదు కదా అని అడిగితే.. నువ్వు చెప్పకపోతేనేమి .. మాకు ఎవరు చెప్పరా? అని మా కుటుంబ సభ్యులు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటూ బాబు తెలిపారు.

also read: జగపతిబాబు షోలో సుమ,రాజీవ్ సందడి.. బయటపడ్డ పాత ప్రేమ రహస్యాలు!

ఆ అవమానాలు భరించలేకపోయాను – బాబు

Advertisement

ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు పనికిరావు.. నీతో చేతకాదు.. నువ్వు అలా అంటావు.. ఇలా అంటావ్.. నీతో ఏదీకాదు అని చాలామంది కించపరుస్తూ ఉంటారు. ఆ మాటలు పడే వాళ్ళు కూడా నిజమేనేమో.. నేనేం చేయలేమో అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు నువ్వేం చెబుదావు అని ప్రశ్నించగా.. అలా అనుకున్న వాళ్లలో నేను కూడా ఒకడిని. ఇక అలాంటప్పుడు నేను మాత్రం ఏం చెప్పగలను. నేను అలా ఎన్నో అనుభవించాను. అవమానాలు పడ్డాను. కానీ చివరికి నేను తెలుసుకున్నది ఏమిటంటే కష్టపడి ప్రయత్నిస్తే ఫలితం లభిస్తుంది. దేనికైనా మనిషికి ఓర్పు ఉండాలి.. ప్రయత్నిస్తే ప్రతిదీ వస్తుంది. కానీ టైం వస్తుంది.. అదృష్టం వస్తుంది అని నమ్ముకుని కూర్చుంటే మాత్రం ఏదీ రాదు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

Related News

జగపతిబాబు షోలో సుమ,రాజీవ్ సందడి.. బయటపడ్డ పాత ప్రేమ రహస్యాలు!

మూడేళ్లకే ప్రపంచ రికార్డులు.. పొదరిల్లు చక్రి కొడుకు టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే!

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ బాబు..డేట్ కూడా ఫిక్స్!

కామనర్స్ హౌస్లోకి రీ ఎంట్రీ..మిథిలేష్ దెబ్బకు ముఖేష్ గప్ చుప్ ..!

శ్రీవిద్యను ఆ స్టార్ హీరోయిన్ తో పోల్చిన వర్ష!

మీనా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? వాట్ ఏ క్రేజ్ మావా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బాలు పై అనుమానం.. మీనాకు నిజం తెలుస్తుందా..? బాలు, అరుణ్ మధ్య సుమతి..

Big Stories

Advertisement
×