Rohit Naidu Patnam: రోహిత్ నాయుడు పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ 10 తెలుగు కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఈ కార్యక్రమంలో విజేతగా నిలుస్తారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా రోహిత్ ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఇలా రోహిత్ ఎలిమినేషన్(Rohit Elimination) అనేది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ విధంగా రోహిత్ ఎలిమినేట్ కావడంతో కచ్చితంగా ఈయన రీ ఎంట్రీ ఇస్తారని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే రోహిత్ మాత్రం ఇప్పటివరకు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు బిగ్ బాస్ టీం ఎక్కడ తెలియజేయలేదు.
రోహిత్ కచ్చితంగా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతారని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు కానీ అభిమానుల ఆశలు నిరాశగా మిగిలిందనే చెప్పాలి. తాజాగా రోహిత్ తన రీ ఎంట్రీ(Rohit Re Entry) గురించి అదేవిధంగా బిగ్ బాస్ జర్నీ గురించి ఈ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా రోహిత్ స్పందిస్తూ.. డియర్ ఫ్యామిలీ మెంబర్స్.. బిగ్ బాస్ 10 లో నా ప్రయాణం ఎలిమినేషన్ రోజుతో ముగిసిపోయింది. తిరిగి తాను బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
నా విషయంలో మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత, మీ మద్దతు చూసి నాలో ఏదో ఒక మూలన రీ ఎంట్రీ ఇస్తాననే చిన్న ఆశ ఉండేది. కానీ విధి మరోలా నిర్ణయించిందని నేను భావిస్తున్నాను. బహుశా బిగ్ బాస్ హౌస్ లో నా ప్రయాణం ముగిసిపోయి ఉండవచ్చు. కానీ మీ హృదయాలను గెలుచుకునే విషయంలో మాత్రం ఈ ప్రయాణం ఇలాగే కొనసాగిస్తూ ఉంటానని తెలిపారు. గేమ్ ముగిసిపోయి ఉండవచ్చు కానీ మన మధ్య ఉన్న బంధం మాత్రం ముగిసిపోదని రోహిత్ తెలిపారు. నాకు అండగా నిలిచి, నన్ను ప్రేమించినందుకు, ఈ ప్రయాణాన్ని మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతో ప్రేమతో.. రోహిత్ నాయుడు పట్నం అంటూ ఈయన భావోద్వేగమైన పోస్ట్ చేశారు.
The END 💔 pic.twitter.com/UeONolRCG4
— Rohit Naidu Patnam (@RohitNaiduPatnm) November 16, 2026
ఈ విధంగా రోహిత్ నాయుడు బిగ్ బాస్ జర్నీ గురించి అలాగే ఆయనని సపోర్ట్ చేసిన విధానం గురించి ఈ సందర్భంగా స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియచేయడమే కాకుండా ఇకపై తన రీ ఎంట్రీ ఉండబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇలా రోహిత్ తన రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు తమదైన శైలిలోనే స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రోహిత్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈసారి కూడా కామనర్ గా హౌస్ లోకి వెళ్లిన రోహిత్ విన్నర్ అవుతారని అందరూ భావించారు. ఇక బిగ్ బాస్ మాత్రం ఊహించని విధంగా రోహిత్ ను ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు పంపించటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read: సూర్య సీన్ మూవీ మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్…చేసుంటే వెయ్యి కోట్లు పక్కా?