E-Paper
Advertisement

గుడ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సూరజ్.. సీరియల్స్ కు గుడ్ బై చెప్పినట్టేనా?

గుడ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సూరజ్.. సీరియల్స్ కు గుడ్ బై చెప్పినట్టేనా?
Advertisement

Karthika Deepam Suraj: బుల్లితెర నటుడు శ్రీకర్ అంటే పెద్దగా గుర్తుపట్టరు కానీ, కార్తీకదీపం సూరజ్ అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తుకు వస్తారు. బుల్లితెర సీరియల్స్ ద్వారా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకర్ కృష్ణ(Srikar Krishna) ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్లో సూరజ్ (Suraj)అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా శ్రీకర్ అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శ్రీకర్ తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు.

శ్రీకారం ప్రొడక్షన్స్..

ప్రస్తుతం బుల్లితెరపై వరుస సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్న శ్రీకర్ ఇకపై తెర వెనుక కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు నటుడిగా తెరపై సందడి చేసిన ఈయన తాజాగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. శ్రీకర్ తాజాగా తన ప్రొడక్షన్ హౌస్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈయన శ్రీకారం ప్రొడక్షన్స్ (Srikaram Productions) పేరుతో ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారని తెలుస్తోంది. ఇలా తన ప్రొడక్షన్ హౌస్ లో భాగంగా మొదటి ప్రాజెక్టు గురించి కూడా ఈయన తెలియజేశారు.

ఓ టార్చర్ ప్రేమ సినిమా డైరెక్టర్..

Advertisement

శ్రీకర్ తన కొత్త బ్యానర్ ద్వారా “ఓ టార్చర్ ప్రేమ”(O Torcher Prema)అనే న్యూ ఏజ్ లవ్ స్టోరీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాకు శ్రీకర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈ సినిమాకు దర్శకుడిగా కూడా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా తన మొదటి సినిమాలో మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల హీరోగా నటించగా, మౌనిక హీరోయిన్ పాత్రలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేత ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఈ విషయాలను శ్రీకర్ కృష్ణ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

?exln=MThybnN5MWpsZjU3YQ%3D%3D

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు శ్రీకర్ కృష్ణకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కొంతమంది నిరాశ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈయన దర్శక నిర్మాతగా మారడంతో ఇకపై బుల్లితెర సీరియల్స్ లో నటించరా? బుల్లితెరకు గుడ్ బై చెప్పబోతున్నారా? పూర్తిగా వెండితెరపై ఫోకస్ చేస్తూ బుల్లితెరకు దూరం కాబోతున్నారా? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే శ్రీకర్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడంతో బుల్లితెరకు దూరమవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈయన నటిస్తున్న కార్తీకదీపం సీరియల్ మాత్రం మంచి  ఆదరణ పొందడమే కాకుండా ఇప్పుడు కథ మొత్తం సూరజ్ పాత్రలో నటిస్తున్న శ్రీకర్ చుట్టూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Also Read: చిన్నారి అశ్వర్థకు అండగా శివ జ్యోతి ..భారీగా ఆర్థిక సాయం!

Related News

చిన్నారి అశ్వర్థకు అండగా శివ జ్యోతి ..భారీగా ఆర్థిక సాయం!

త్రిగుణ్ చేతిలో వంశీ కీలుబొమ్మా? ఇచ్చిపడేసిన చైత్ర!

పెట్టింది లక్షల్లో లాభాలు మాత్రం కోట్లలో.. రాను బొంబాయికి రాను క్రేజ్ వేరే లెవెల్!

జూనియర్ బాలు దైవిక్‌కు జరిగిన అవమానం వెనుక అసలు కథ!

సింపథీ కార్డ్ ప్లే చేయకు..ఒక్కసారైనా గెలిచావా?వర్షిణిపై సృష్టి ఫైర్!

బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే!

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు సుమతి దూరం.. రోహిణి ప్లాన్ సక్సెస్.. పాపం మీనా..

Big Stories

Advertisement
×