Binde Folk Songs:తెలంగాణా జానపదాలు జోరు చూపిస్తున్నాయి.ఒకప్పుడు గ్రామాలకి పరిమితమైన పల్లె గొంతులు ఇపుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా పరుగులు పెడుగుతున్నాయి.ముఖ్యంగా సినిమా పాటల కంటే దీటుగా అశేషమైన ఆదరణ ని సొంతం చేసుకుంటూ మిలియన్ల వ్యూస్ ని కొల్లగొడుతున్నాయి.పార్టీ అయినా ఫంక్షన్ అయినా,ఈవెంట్ అయినా మ్యారేజ్ అయినా పంట వేసేటప్పుడైనా , వంట చేసేటప్పుడైనా ఈ ఫోక్ సాంగ్స్ లేకుండా జరగట్లేదంటే ఆశ్చర్యం లేదు.
అలాంటి ఈ ఫోక్ సాంగ్స్ లో గత కొంత కాలంగా బిందె అనే పదం చాలా కామన్ అయిపొయింది.ముఖ్యంగా ఈ పదం ఉన్న పాటలన్నీ ఇపుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.మరి ఇప్పటి వరకు బిందె అనే పదంతో వచ్చిన టాప్ ఫోక్ సాంగ్స్ ఏంటో మనమూ ఒక లుక్ వేద్దాం.
మొదటగా ఈ లిస్టు లో చెప్పుకోవలసిన పాట‘బిందె మీద బిందె పెట్టి ‘అనే DJ సాంగ్. వరిజినల్ గా వైష్ణవీ సోనీ స్టెప్పులేయగా నాగవ్వ కామియోతో వచ్చిన పాటకి DJ వెర్షన్ వచ్చిన ఈ పాట వరిజినల్ పాట కన్నా మించి దూసుకుపోవడం విశేషం. ఈ సెప్టెంబర్ 16న నెట్టింట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పాటకి శాండీ మ్యూజిక్ అందించగా ,తిరుపతి సాహో అధ్బుతమైన ఆకట్టుకునే పదాలకి,యమునా తారక్, పూజా నాగేశ్వర్ లు తమ స్టెప్పులతో పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశారు.ముఖ్యంగా ఈ పాటకి ఇచ్చిన బీట్స్ యూత్ ని ఫిదా చేస్తుంది.ఇక ఎ పాట ఇప్పటికి 86 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుకోవడం విశేషం.
ఇక ఈ పాటకి వరిజినల్ గా వచ్చిన’బిందె మీద బిందె పెట్టి’అనే పాట కూడా సోషల్ మీడియాని గట్టిగానే షేక్ చేసింది. నాగవ్వ పెక్యులర్ గొంతుతో,పాటు శ్రీనిధి కూడా గాత్రం అందించిన ఈ పాటకి తనవైన స్టెప్పులతో అదరగొట్టింది వైష్ణవీ సోనీ.ఇక ఈ పాట ఈ ఏడు ఏప్రిల్ 26న వచ్చి ఏకంగా 3.6 కోట్ల వ్యూస్ ని కొల్లగొట్టిందంటే పాట ఆడియన్స్ ని ఎలా మెస్మరైజ్ చేసిందో అర్థం అవుతుంది.
ఇక తనవైన ఫోక్ సాంగ్స్ తో నెట్టింటిని షేక్ చేస్తున్న మాధురి రాథోడ్ ఈ సారి ‘బిందెలు బిందెలు బావయో’ అనే పాటతో వచ్చి యూత్ ని ఫిదా చేసేసింది.గత అక్టోబర్ 7 న ఎంట్రీ ఇచ్చిన ఈ పాట ఇప్పటికి ఏకంగా 1.1కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం.ముఖ్యంగా ఈ పాటకి శాండీ అందించిన మ్యూజిక్ తో పాటు గిరమ్మ గొంతు మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. ఇకఈ పాటకి లీడింగ్ బాయ్స్ అందించిన కోరియోగ్రఫీ కూడా పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేసింది.
ఇక చివరగా ఇదే మాధురి రాథోడ్ మరోసారి ‘రాజు బిందెల నీళ్ళు’ అంటూ ,మరో పాటకి స్టెప్పులేసి ఆడియన్స్ ని ముఖ్యంగా ఫోక్ లవర్స్ ని మెస్మరైజ్ చేసింది. ఈ ఏడు జూన్ 5న వచ్చిన ఈ పాటకి AMR కోరియోగ్రఫీ అందించగా AS చౌహాన్ ట్యూన్ తో పాటు లిరిక్స్ కూడా అందించడం విశేషం.ఇక ఈ పాట ఇప్పటికే 2.1కోట్ల వ్యూస్ ని కొల్లగొట్టి దూసుకుపోతుంది.మొత్తంగా బిందె అనే పదంతో వచ్చిన పాటలన్నీ ఇలా మిలియన్ల వ్యూస్ ని వెనకేయడం విశేషం. చూడాలి మరి ఈ బిందె అనే పదంతో ముందు ముందు ఇంకెన్ని పాటలొస్తాయో !