Illu Illalu Pillalu Today Episode Novemberth 20: ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా కార్ షోరూమ్ లో ఎలాగైనా సరే కారులని బుకింగ్ కి పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే అప్పుడే తిరుపతి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని ధీరజ్ తో చెప్తాడు.. ధీరజ్ మాత్రం ఎలాగైనా సరే సాగర్ ని బయటకు తీసుకురావాలి అని అక్కడికి వెళ్తాడు.. ప్రేమ కూడా ఇంటికి వెళుతుంది అయితే అప్పటికే బాధపడుతున్న నర్మద నీ ప్రేమ ఓదారి చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా సాగర్ నీ పోలీసులు తీసుకుని వెళ్లారు అని చాలా బాధపడిపోతూ ఉంటారు.
వీళ్ళందరూ బాధపడుతూ ఉండగా భద్రావతి డోలు తీసుకొని వచ్చి వాయిస్తుంది.. రామరాజు కొడుకు లంచం తీసుకుని దొరికిపోయాడంట అంటూ దండోరు వేయడంతో రామరాజు కుటుంబం ఒక్కసారిగా శాఖ ఈ భద్రావతి దగ్గరికి వెళ్తారు. కానీ భద్ర మాత్రం నీ కొడుకు లంచం తీసుకున్నాడు కదా.. నువ్వు కూడా అలాంటి పని చేస్తున్నావా నువ్వే అందరికీ నేర్పిస్తున్నట్టున్నావు. నీ పిల్లలు ఎవరు సరిగ్గా లేరు అంటూ దారుణంగా మాట్లాడుతుంది. అది విన్న నర్మదా భద్రావతి పై సీరియస్ అయ్యి తనతో వాదనకు దిగుతుంది. నీకు ఇప్పటికీ పెళ్లి కాలేదు అది కొంచెం ఆలోచించవా ఎందుకు నువ్వు ఇలా పగలు పెంచుకొని అందరి ముందు ఇలా మాట్లాడతావు అని అనగానే వేదవది చాలా సీరియస్ అయ్యి నర్మదన కొడుతుంది. అయితే అప్పుడు ధీరజ్ సాగర్ ని తీసుకొని వస్తాడు నర్మదా జాబు పోవడానికి కారణం అని సాగర్ చాలా సీరియస్ గా ఉంటాడు కానీ రామరాజు మాత్రం నువ్వు ఇకమీదట ఇలాంటి పాపపు పనులు చేయను అని బొట్టు వెయ్యి లేదంటే మాత్రం నువ్వు ఇంట్లోకి రావడానికి కుదరదు అని అంటాడు..
నువ్వు లంచాలు తీసుకుంటూ ఇలా తప్పుడు దారిలో వస్తే మాత్రం అసలు ఊరుకోను అని రామరాజు అంటాడు. నువ్వు ఇలా తప్పుడు దారిలో మాత్రం వెళ్తాను అని ఎప్పుడు అనుకోవద్దు నా పరువు ని మాత్రం అస్సలు తీయద్దు అని సాగర్ కి రామరాజు వార్నింగ్ ఇస్తాడు. అయితే నువ్వు తప్పు చేస్తాను అంటే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రామరాజు అంటాడు ఆ మాట వినగానే సాగర్ నువ్వు నన్ను ఇంట్లో నుంచి పంపించడం కాదు నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. సాగర్ మాటతో ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు తన కొడుకు మంచి కోసం చూస్తే తను మాత్రం ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు.
సాగరు ఈ ఇంట్లో నాకు ఎక్కడ మర్యాద ఉంది. నా పరువు పోయేలా నా భార్య ప్రవర్తించింది. అలాగే నా కన్న తండ్రి నాకు ఏం చేశాడు అంటూ చాలా బాధపడిపోతాడు. ఇంట్లో ఏం చేసినా కూడా నాదే తప్పు అంటారు. నన్ను ఇంట్లో ఉండనివ్వడం కాదు నేనే ఇంట్లో ఉండను నా పరువు పోయింది.. నా జాబు పోయింది మీరు కోరుకున్నట్లుగా ఇప్పుడు మీరు సంతోషంగానే ఉన్నారు కదా.. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని సాగర్ చాలా ఆవేశంగా బయటికి వెళ్లిపోవాలని చూస్తాడు.. కానీ తన అన్నదమ్ములు అలాగే తన మామ నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంట్రా పిచ్చి ఏమైనా పట్టిందా పాదా ఇంట్లోకి అని బలవంతంగా తనని తీసుకొని లోపలికి వస్తారు. రామరాజు అలాగే నర్మదపై వేదవతి చాలా సీరియస్ అవుతుంది. మీరు ఇద్దరు వల్లే నా కొడుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు వాడు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న జాబును కూడా పోగొట్టుకున్నాడు అని వేదవతి చాలా కోపంగా ఉంటుంది.
తను ఆ ఇంటి వారసున్ని తన కడుపులో మోస్తున్నాను అని వల్లి చాలా సంతోషంగా ఉంటుంది.. అత్తయ్య వాళ్ళకి అలాగే బావకి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే తన మంచి కోరే తన నర్మదకి ముందుగా ఈ విషయాన్ని చెప్పాలి అని వల్లి అనుకుంటుంది. కానీ సాగర్ జైలుకు వెళ్లి వచ్చాడు అని నర్మదా తనమీద ఎలాంటి కోపంగా ఉంటాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ సమయంలో మళ్ళీ ఫోన్ చేస్తే అక్క నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని పెట్టేస్తుంది. భాగ్యం ఇప్పటికైనా నువ్వు నా మాట విను నా చెయ్యి పట్టుకో నీకు నీ బిడ్డకి ఒక స్థానాన్ని కల్పిస్తాను అని అంటుంది. నువ్వు ఆ ఇంట్లో దర్జాగా ఉండేలాగా నేను చేస్తాను ఇప్పటికైనా నువ్వు నా చేయి పట్టుకోవాల్సిందే అని భాగ్యం అంటుంది కానీ నావల్లి మాత్రం నా జీవితం నా ఇష్టం నువ్వు నాకోసం ఏమి చేయొద్దు అని అంటుంది..
ఇక నర్మదా అలాగే సాగర్ ఇద్దరూ భోజనం చేయలేదు అని ప్రేమ ధీరజ్ ఎలాగైనా సరే వాళ్ళ చేత భోజనం చేసేలా చేయాలి అని అనుకుంటారు. నర్మదా అలాగే సాగర్ ఇద్దరూ గొడవ పడడం చూసి వాళ్ళిద్దరూ కూల్ చేయాలని చూసినా కూడా వినరు చివరికి నర్మదా నాకు బాగా ఆకలేస్తుంది నేనే తింటాను అని తినేస్తుంది. ఇక సుకన్య గదిలోకి వెళ్ళగానే తిరుపతి మందు తాగుతూ కనిపిస్తాడు అది చూసిన సుకన్య ఏంటి నువ్వు రూమ్ లోనే కూర్చొని మందు తాగుతున్నావు ఎందుకు ఇలా మారిపోయావు అని అడుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితానికి ఏమీ కలగలేదు నీవల్లే నేను ఇలా మారిపోయాను ఈరోజు మనిద్దరికీ శోభనం జరగాల్సిందని సుకన్యకు చుక్కలు చూపిస్తాడు తిరుపతి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మనోజ్.. రవికి బంఫర్ ఆఫర్.. ప్రభా ఫుల్ హ్యాపీ..