E-Paper
Advertisement

Telugu TV Serials: సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. అస్సలు ఊహించని ట్విస్ట్..

Telugu TV Serials: సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. అస్సలు ఊహించని ట్విస్ట్..
Advertisement

Telugu TV Serials: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిల్లో సీరియల్స్ ముందు వరుసలో ఉంటున్నాయి. గతకొద్దిరోజులుగా టీవీ ఛానెల్స్ పోటీ పడి మరీ ప్రసారం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సినిమాలకు మంచి డిమాండ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు సీరియల్స్ కి ఉన్న డిమాండ్ మరి ఏ ప్రోగ్రాం కి కూడా లేదు అని జనాల్లో మాటలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా టీవీ సీరియల్స్ పోటీపడి మరి కొత్త కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ జనాలని బాగా ఎంటర్టైన్ చేస్తున్న ఈ అందుకే వీటికి డిమాండ్ అనేది రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. తెలుగు చానల్స్ ఒక్కొక్కటి జనాలకు బాగా కనెక్ట్ అయ్యేలా సీరియల్స్ ని ప్రసారం చేస్తూ మంచి టిఆర్పి రేటింగ్ కూడా నమోదు చేసుకుంటున్నాయి. సినిమాలకు ఎలాగైతే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఉంటున్నాయో అలాగే సీరియల్స్ కి కూడా ప్రతివారం టిఆర్పి రేటింగ్ అనేది నమోదు అవుతుంది మరి గతవారంతో పోలిస్తే ఈ వారం స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉందో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ రేటింగ్..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కలేని సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒక అనాధగా ఉన్న వ్యక్తి తన కొంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు అందరిలో మంచి పేరును సంపాదించుకుంటాడు. అయితే ఆ వ్యక్తి ఎలాగైతే తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు తనకు శత్రువులు కూడా అలాగే పెరిగిపోతూ ఉంటారు. తన సొంత ఇంట్లోనే శత్రువులు ఉండటం చూసి ఆ మనిషి చెల్లించి పోతాడు. కానీ మంచి మనసు గల ఆ వ్యక్తి జనాలని ఆకట్టుకుంటూ కుటుంబాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లో ఆ కుటుంబ పెద్దగా ఉన్న రామరాజు తన పెద్ద కూడా లేని మళ్లీ ఇంటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అతని పెద్ద కొడుకు మాత్రం తన భార్యపై మనసు విరిగి ఇంటికి తీసుకురావద్దు అని తండ్రికి ఎదురు తిరుగుతాడు. ఇక రెండవ కొడుకు లంచాలు తీసుకొని అడ్డంగా దొరికిపోతాడు.. ప్రస్తుతం ఈ సీరియల్ కి హైలెట్ సీని ఏదైనా ఉంది అంటే అది తన రెండవ కొడుకు లంచాలు తీసుకొని దొరికిపోవడమే దీంతో ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయానికి వస్తే 11 గా నమోదయింది. ఇకముందు ఈ సీరియల్ ఎపిసోడ్లలో ఏదైనా ట్విస్టులు జరిగి రేటింగ్ ఇంకా పెరుగుతూనేమో చూడాలి..

సీరియల్ స్టోరీ ఏంటంటే..?

Advertisement

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న స్టార్ మా ఛానల్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్క నటీనటులు కూడా తమ నటనకు మంచి గుర్తింపును తెచ్చుకునేలా నటించారు. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి జనాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఈ సీరియల్లో సాగరు లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవడం హైలెట్గా నిలిచింది.. అందరికీ న్యాయం చెప్పే ఒక పెద్ద మనిషిగా ఉన్న రామరాజు కొడుకు తప్పు చేస్తే అతను వేసే శిక్ష ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. సాగర్ బయట పోవడానికి కారణం నర్మద కాబట్టి వీరిద్దరి మధ్య మళ్ళీ దూరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. నెక్స్ట్ ఈ సీరియల్ రేటింగ్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరి వల్లి ప్రెగ్నెంట్ కావడం మరొక హైలెట్ అంశం. తను ప్రస్తుతం గర్భవతిగా ఉండడంతో తన కుటుంబం తనని అక్కున చేర్చుకుంటుందా లేదా అన్నది మాత్రం చూడాలి..

Also Read :‘ఆకాశంలో ఒక తార’ సినిమా రివ్యూ..

Related News

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

పదేళ్ల ప్రయాణంలో ఎన్నో కన్నీళ్లు.. మరెన్నో విజయాలు.. దీపిక ఎమోషనల్ జర్నీ!

సరిగమపలో పాటలతో అదరగొడుతున్న కీర్తన.. కష్టం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

లవ్ బ్రేకప్ పై కన్నీళ్లు పెట్టుకున్న అనన్య.. సారీ చెప్పిన వర్ష!

బతకడానికి పైసలు లేవు.. ఇష్టంలేని సినిమాలు చేస్తున్నా.. అనన్య కన్నీటి కష్టాలు!

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్..ఉష అక్క టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే!

నిన్ను పుట్టించిన మీ అమ్మ అంటూ.. సోషల్ మీడియా బూతుల పై అనన్య ఎమోషనల్!

Big Stories

Advertisement
×