E-Paper
Advertisement

పదేళ్ల ప్రయాణంలో ఎన్నో కన్నీళ్లు.. మరెన్నో విజయాలు.. దీపిక ఎమోషనల్ జర్నీ!

పదేళ్ల ప్రయాణంలో ఎన్నో కన్నీళ్లు.. మరెన్నో విజయాలు.. దీపిక ఎమోషనల్ జర్నీ!
Advertisement

Deepika Rangaraju:దీపికా రంగ రాజు..బ్రహ్మముడి సీరియల్ తో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది ఈ తమిళ అమ్మాయి.ముఖ్యంగా బ్రహ్మ ముడి సీరియల్ లో కావ్యగా దీపిక ఫెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.ఇక తెలుగు ఆడియన్స్ లో వంటలక్క తర్వాత ఆ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నది దీపిక అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు కూడా.

అయితే దీపిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా గతంలో ఒక వీడియోలో మాట్లాడుతూ తన కెరీర్ లో ఎదురైన అనుభవాలని,ధైర్యంగా తానూ తీసుకున్న నిర్ణయాలని గుర్తు చేసుకుంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇపుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాను మమందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న రోజుల్లో తన కెరీర్ కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ దొరికిందని తెలిపింది.తాను మాట్లాడే తీరు ,తనలోని చలాకీ తనం చూసి అక్కడికి వచ్చిన ఒక తమిళ చానెల్ వాళ్ళు న్యూస్ రీడర్ గా అవకాశమిచ్చారని గుర్తు చేసుకుంది.

అయితే అప్పటికి తాను ఫైనల్ ఇయర్ చదువుతున్నానని,సరిగ్గా ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలోనే ఒక పెద్ద లైవ్ షో చేసే ఛాన్స్ వచ్చిందని తెలిపింది. దాంతో తన ముందు రెండు దారులు ఉన్నాయని ఒకటి చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తూ పరీక్ష రాయడానికి వెళ్ళడమా లేక లైవ్ షో చేసే ఛాన్స్ దక్కించుకోవడమా అన్నది ఒక దశలో తేల్చుకోలేకపోయానని వాపోయింది.అయితే తాను మాత్రం ఛానెల్ లో లైవ్ షో చేయడానికే వెళ్లానని తెలిపింది .ఒక రకంగా ఆ నిర్ణయమే తన కెరీర్ ని మలుపుతిప్పిందని గుర్తు చేసుకుంది.

Advertisement

ఇక అలా న్యూస్ రీడర్ గా మొదలైన తన జర్నీ ఆ తర్వాత సీరియల్స్ వైపు మళ్లిందని తెలిపింది.అలా తమిళంలో ‘చిత్రిరమ్ పెసుతాడి’ సీరియల్‌తో నటిగా మారానని, అలాగే ఆరడి అనే ఒక తమిళ సినిమాలో కూడా నటించానని చెప్పింది.అయితే తనకి మొదటి నుండి డబ్బుల కంటే నటిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నానని, తన నటన గురించి అందరు మాట్లాడుకోవాలని కోరుకునేదాన్ని అని తెలిపింది.

అలా మొదట్లో కొన్ని పాత్రలు చేసినా తాను అనుకున్న స్థాయిలో పేరు రాలేదని కానీ ఆ నిరాశను పక్కనపెట్టి తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదని ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకుంది.ఇక ప్రస్తుతం ఉన్న ఈ స్థానానికి తాను అంత ఈజీగా రాలేదని ,ఎన్ని కష్టాలు కన్నీళ్ళు దాటుకొని వస్తేనే ఇది సాధ్యమైందని గుర్తు చేసుకుంది.

ఇక సరిగ్గా అలాంటి టైంలోనే తెలుగులో ‘బ్రహ్మముడి’ సీరియల్‌లో కావ్య పాత్ర రూపంలో తనకి ఒక మంచి అవకాశం దక్కిందని తెలిపింది.ఇక ఆ సీరియల్ లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా, ఎన్ని కష్టాలు ఎదురైనా కుటుంబం కోసం నిలబడే యువతిగా కావ్య పాత్రలో దీపిక జీవించేసిందనే చెప్పాలి.

ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన చూసి తెలుగు ఫిదా అయిపోయారు తెలుగు ఆడియన్స్.ఇక ఇంతటి మంచి అవకాశాన్ని కలిపించిన స్టార్ మా కి కూడా గుర్తు చేసుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది దీపిక.ఇక ప్రస్తుతం ‘బ్రహ్మముడి’తో పాటు ఆహా వేదికగా ప్రసారమవుతున్న ‘చెఫ్ మంత్ర’లోని ‘ప్రాజెక్ట్ కే’లోనూ దీపిక సందడి చేస్తున్న సంగతి తెల్సిందే.

ఇక దీపిక ఇండస్టీలోకి వచ్చి పూర్తి అయిన సందర్భంగా గతంలో చేసిన ఈ వీడియోని మళ్ళీ వాయిస్ కి తగ్గట్టుగా దీపిక నటించిన సీరియల్స్ విజువల్స్ ,ఈవెంట్ షాట్స్ తో రీ ఎడిట్ చేసి దీపిక కి విషెస్ చెప్పారు.దాంతో గతంలో దీపిక చెప్పిన మాటలు ఇపుడు మరోసారి వైరల్ అయ్యాయి.

Tags

Related News

సరిగమపలో పాటలతో అదరగొడుతున్న కీర్తన.. కష్టం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

లవ్ బ్రేకప్ పై కన్నీళ్లు పెట్టుకున్న అనన్య.. సారీ చెప్పిన వర్ష!

బతకడానికి పైసలు లేవు.. ఇష్టంలేని సినిమాలు చేస్తున్నా.. అనన్య కన్నీటి కష్టాలు!

ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్..ఉష అక్క టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే!

నిన్ను పుట్టించిన మీ అమ్మ అంటూ.. సోషల్ మీడియా బూతుల పై అనన్య ఎమోషనల్!

ఇంటిమేట్ సీన్స్.. బట్టలతో ప్రాబ్లం కాదు.. ఇండస్ట్రీ పై అనన్య శర్మ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!

ముఖేష్ ట్రాప్ లో పడ్డ త్రిగుణ్..మరీ ఇంత వెర్రోడా?

Big Stories

Advertisement
×