Illu Illalu Pillalu Today Episode Novemberth 21st: తను ఆ ఇంటి వారసున్ని తన కడుపులో మోస్తున్నాను అని వల్లి చాలా సంతోషంగా ఉంటుంది.. అత్తయ్య వాళ్ళకి అలాగే బావకి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే తన మంచి కోరే తన నర్మదకి ముందుగా ఈ విషయాన్ని చెప్పాలి అని వల్లి అనుకుంటుంది. కానీ సాగర్ జైలుకు వెళ్లి వచ్చాడు అని నర్మదా తనమీద ఎలాంటి కోపంగా ఉంటాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ సమయంలో మళ్ళీ ఫోన్ చేస్తే అక్క నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని పెట్టేస్తుంది. భాగ్యం ఇప్పటికైనా నువ్వు నా మాట విను నా చెయ్యి పట్టుకో నీకు నీ బిడ్డకి ఒక స్థానాన్ని కల్పిస్తాను అని అంటుంది. నువ్వు ఆ ఇంట్లో దర్జాగా ఉండేలాగా నేను చేస్తాను ఇప్పటికైనా నువ్వు నా చేయి పట్టుకోవాల్సిందే అని భాగ్యం అంటుంది కానీ నావల్లి మాత్రం నా జీవితం నా ఇష్టం నువ్వు నాకోసం ఏమి చేయొద్దు అని అంటుంది..
ఇక నర్మదా అలాగే సాగర్ ఇద్దరూ భోజనం చేయలేదు అని ప్రేమ ధీరజ్ ఎలాగైనా సరే వాళ్ళ చేత భోజనం చేసేలా చేయాలి అని అనుకుంటారు. నర్మదా అలాగే సాగర్ ఇద్దరూ గొడవ పడడం చూసి వాళ్ళిద్దరూ కూల్ చేయాలని చూసినా కూడా వినరు చివరికి నర్మదా నాకు బాగా ఆకలేస్తుంది నేనే తింటాను అని తినేస్తుంది. ఇక సుకన్య గదిలోకి వెళ్ళగానే తిరుపతి మందు తాగుతూ కనిపిస్తాడు అది చూసిన సుకన్య ఏంటి నువ్వు రూమ్ లోనే కూర్చొని మందు తాగుతున్నావు ఎందుకు ఇలా మారిపోయావు అని అడుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితానికి ఏమీ కలగలేదు నీవల్లే నేను ఇలా మారిపోయాను ఈరోజు మనిద్దరికీ శోభనం జరగాల్సిందని సుకన్యకు చుక్కలు చూపిస్తాడు తిరుపతి..
నర్మదా వల్లే తనని పోలీసులు అరెస్ట్ చేశారు అని సాగర్ చాలా ఫీల్ అయిపోతుంటాడు. అయితే భోజనం కూడా చేయకుండా సాగర్ ఆలోచిస్తూ ఉండగా ప్రేమ అలాగే ధీరజ్ భోజనం గురించి చాలా గొప్పగా చెప్పు అక్కడికి వెళ్తారు. కానీ సాగర్ మాత్రం నాకు ఎటువంటి భోజనం వద్దు. నా జాబ్ పోయింది నా పరువు పోయింది అని అనుకుంటూ ఉంటాడు కానీ నర్మద మాత్రం చంప దెబ్బలు కొట్టించుకున్న నాకు బాగా ఆకలేస్తుంది అందుకే నేనే తింటాను ఆ రెండు ప్లేట్లు నేనే తింటాను అని అనగానే సాగర్ నన్ను కూడా తినేసేయ్ ఒక పని అయిపోతుంది నేనంటే ఎలాగో నీకు ఇష్టం లేదు కదా అనేసి అంటాడు.. నేను చచ్చిన కూడా నువ్వు ఇలానే ఉంటావా కనీసం మారవాని సాగర్ నర్మదని అడుగుతాడు.
ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈసారి రాబోయే ఎగ్జామ్స్ లో ఎలాగైనా సరే నువ్వు పాస్ అయ్యి ఎస్ ఐ పోస్ట్ కొట్టలేని ధీరజ్ అంటాడు. కానీ మాట విన్న ప్రేమ ఇవాళ చదవలేను రా రేపు చదువుతాను అని ఎంత చెప్తున్నా సరే ధీరజ్ మాత్రం అస్సలు వినడు. నువ్వు ఇవాళ చదవాల్సిందే ఇవాళ చదివితేనే నీకు ఏదైనా డౌట్ ఉంటే రేపు క్లాసులో అడుగుతావు లేదంటే మాత్రం ఇలానే ఉంటావు అని ప్రేమ అని ధీరజ్ బలవంతంగా చదివించే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రేమ మాత్రం నేను చదువు చదవలేకున్నాను రా ఇంకా ఏదైనా చెప్పు నీకోసం ఏదైనా చేస్తాను అని అంటుంది. ఇంకేదైనా ఏం చేస్తావ్ నాకోసం నువ్వు ఇంకేమీ చేయొద్దు అయితే నాకు ఒక ముద్దు పెడతావా అని అడగగానే ప్రేమ అసలు సిగ్గుపడకుండా ముద్దు పెట్టడమే చాలా ఈజీ అంటూ ధీరజ్ కి ముద్దు పెట్టబోతుంది. కానీ వాళ్ళిద్దరికీ దిమ్మతిరిగే ట్విస్ట్ తగులుతుంది. అది ఎపిసోడ్కి కాస్త హైలైట్ గా నిలుస్తుంది..
ప్రేమ ధీరజ్ కి ముద్దు పెడుతూ ఉండగా మధ్యలో నుంచి సుకన్య వెళ్లి వెనకాల దాక్కుంటుంది.. ఏమైంది ఎందుకు నువ్వు ఇలా దాక్కుంటున్నావు ఏంటి సుకన్య చెప్పు అని ప్రేమ ఎంత అడుగుతున్నా సరే నన్ను కాపాడండి నన్ను రక్షించండి అంటూ అంటుంది. ఆ మాట వినగానే వెంటనే తిరుపతి అక్కడికి వచ్చి ఈ రోజు నిన్ను వదిలి ప్రసక్తే లేదు నువ్వు రావాల్సిందే.. ఈరోజు మనకి జరగాల్సిందే అని తిరుపతి అంటాడు. మీరిద్దరు చిన్న పిల్లలు మీరిద్దరి మధ్యలో అది ఉంటే నేను తీసుకెళ్లలేదని అనుకుంటుంది. కచ్చితంగా దాన్ని తీసుకుని వెళ్తాను అని తిరుపతి అంటాడు. మీ బాబాయి నుంచి నన్ను కాపాడాల్సిన నువ్వే ప్రేమ నాకు విముక్తి కలిగించు అని ప్రేమ అంటుంది.. ఇక తిరుపతి ప్రవర్తన చూసి భయపడి పోయిన ధీరజ్ కి కూడా ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ తిరుపతి మాత్రం అస్సలు ఆగకుండా తనని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది చూడాలి..
Also Read :Podarillu Today Episode : మహాకు యాక్సిడెంట్.. మాధవ్ అడ్డంగా బుక్కయ్యాడు.. అయ్యో చక్రీ..