E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు వేసిన టెండర్ డీటెయిల్స్ రఘువీర్ కు తెలుస్తాయా..?  

Brahmamudi Serial Today Episode November 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు వేసిన టెండర్ డీటెయిల్స్ రఘువీర్ కు తెలుస్తాయా..?  
Advertisement

Brahmamudi serial today Episode: రుద్రప్రతాప్‌ జువ్వెల్లరీ కోసం అన్ని రకాలుగా ఎంక్వైరీ చేయమని చెప్తుంది ఐశ్వర్య. అందరికీ అన్ని రకాలుగా సలహాలు సూచనలు ఇస్తుంటే… పార్వతీశం కాఫీ తీసుకొచ్చి మీరు చాలా కష్టపడుతున్నారు కొంచెం రిలాక్స్‌ అవ్వండి అని చెప్తాడు. రఘువీర్‌ గురించి చెప్తాడు. మీరు చాలా లక్కీ మేడం అంటూ చెప్పగానే.. నేను లక్కీ కాబట్టే ఈ డీల్ కూడా మనకు వస్తుంది అంటూ వెళ్లిపోతుంది ఐశ్వర్య.

మరోవైపు ఇందుకు రాజు కాఫీ తీసుకెళ్లి ఇస్తాడు. ఇందు పని చేసుకుంటుంటే.. రాజు నసగా ఆఫీసులో అందరూ వెళ్లిపోయారు. మనం తప్ప ఎవ్వరూ మిగల్లేదు.. అంటే.. అందరి పని అందరూ చేశారు. ఇక మన పని కొటేషన్ పంపించడమే మిగిలింది. అది పూర్తి అయ్యాక వెళ్దాం అని ఇందు చెబితే.. అయితే ఇవాళ మన శోభనం అయినట్టే అంటూ రాజు ఫీలవుతాడు. అప్పుడే అపర్ణ ఫోన్‌ చేసి ఇంకా ఇంటికి రాలేదేంటని తిడుతుంది. సాయంత్రం కాగానే ఇంటికి రమ్మని చెప్పాను కదా అంటూ చెప్తుంది. పనేదైనా ఉంటే రేపు చూసుకోవచ్చు ముందు ఇంటికి రమ్మని చెప్తుంది. ఇందు సరే వస్తామని కాల్‌ కట్‌ చేసి రాజును ఏంటి తెగ రెచ్చిపోతున్నావు.. రాజు నిజం చెప్పు పక్కకు వెళ్లి నాన్నమ్మకు ఫోన్‌ చేయమని నువ్వే కాల్‌ చేశావు కదా అంటే.. ఇందు నేను చాలా మంచోడిని నన్ను అనుమానించకు అంటాడు రాజు. నేనేం శోభనానికి ముఖం వాచిపోలేదు.. ఏదో అమ్మమ్మ అడిగింది కదా..? ఏదో లాంచనానికి వాళ్లు చేస్తున్నారు కదా అందుకే ఒప్పుకున్నాను అంటాడు రాజు.

Advertisement

ఐశ్వర్య వేసిన కొటషన్‌ను రఘువీర్‌ చింపేస్తాడు. ఐశ్వర్య కోపంగా రఘువీర్‌ నువ్వేం చేశావో తెలుసా..? నాలుగు గంటలు నా టీం కష్టపడి వేసిన కొటేషన్ అది కనీసం నువ్వు చూడకుండానే చించేశావేంటి..? అని అడిగితే.. కష్టపడితే కాంట్రాక్ట్‌ రావు ఐశ్వర్య.. తెలివితో సంపదించాలి అంటూ రఘువీర్‌ చెబితే.. నువ్వేం అంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ ఐశ్వర్య అడిగితే.. బిజినెస్‌ అనేది గేమ్‌ లాంటిది. అందులో మనం గెలవాలంటే కొన్నిసార్లు కష్టపడటం కంటే ఎదుటి వాడు ఓడిపోవాలని చూడాలి. అప్పుడే మనం గెలుస్తాం.. అంటూ స్వరాజ్‌ గ్రూప్‌ గురించి చెబుతూ.. వాళ్లు వేస్తున్న కొటేషన్‌ తెలుసుకుంటే మన పని ఈజీ అయిపోతుంది. అంటూ చెప్పగానే.. స్వరాజ్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రశాంత్, రఘువీర్‌కు కొటేషన్ మెయిల్‌ చేయనని.. డైరెక్టుగా వచ్చి చెప్తానని అంటాడు. అంతా లౌడ్‌ స్పీకర్‌ పెట్టి ప్రశాంత్‌తో మాట్లాడుతూ ఐశ్వర్య వినేలా చేస్తాడు. ఐశ్వర్య ఆశ్చర్యపోతుంది.

అపర్ణ, పనిమనిషితో కలిసి రాజు, ఇందుల శోభనం కోసం రూంను రెడీ చేయిస్తుంది. బయటి నుంచి రేఖ, భ్రమరాంబ, భూషణ్‌, శేషు చూస్తుంటారు. నువ్వేదో చేస్తానని చెప్పావు కదా రేఖ ఏమీ చేయకుండా బయటి నుంచి చూడటం ఏంటి..? నువ్వే ఏదో ఒకటి చేయ్‌ రేఖ ఆ శోభనం ఆపు అంటూ చెప్తుంది. అందుకు రేఖ తాను ప్లాన్‌ చేశానని అది సర్‌ఫ్రైజ్‌ అంటూ షాకింగ్‌ న్యూస్‌ వినడానికి రెడీగా ఉండండి అని చెప్తుంది రేఖ.

Advertisement

రాజు రూంలో రెడీ అవుతుంటే.. లక్కీ వెళ్లి హెల్ప్‌ చేయబోతే రాజు కోపంగా తిట్టి నువ్వు చేసిన మిత్రద్రోహం ఇంకా గుర్తు ఉంది వెళ్లిపో అంటూ తిడతాడు. లక్కీ సారీ చెప్తాడు. బాధగా ఎమోషనల్‌ అవుతుంటాడు. అయినా రాజు వినకుండా లక్కీని తిట్టి పంపిచేస్తాడు. మరోవైపు నందు, ఇందును రెడీ చేస్తుంది. అపర్ణ వచ్చి నందును పంపిచేస్తుంది. అపర్ణ ఎమోషనల్ అవుతుంది. ఇందు కూడా ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు ఘోర అవమానం.. ఇదేం ట్విస్ట్.. రవి పై అనుమానం..

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. యూత్ కు పునకాలే..!

వైష్ణవి సోనీ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. మల్లె చెట్టు రచ్చ మామూలుగా లేదుగా!

మాధురి రాథోడ్ మరో సెన్సేషన్.. బండి రాజయ్యతో రచ్చ రచ్చ!

ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!

ఘనంగా బిగ్ బాస్ ప్రేరణ సీమంతం వేడుక.. డెలివరీ ఎప్పుడంటే?

బిగ్ బాస్ టాప్ 5లో వీరికే ఛాన్స్.. శివాజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×