Karthika Deepam 2 serial today Episode: మాలిని, పారిజాతం అవమానించినా జ్యోత్స్న మాత్రం ఇంకా ఆశలతోనే సూరజ్‌కు ఫోన్ చేస్తుంది. ఏదో నిర్ణయం తీసుకున్నాను అన్నావు కదా ఏంటది అని అడుగుతుంది. అందుకు సూరజ్ ఆ తన నిర్ణయానికి ఎక్స్‌ఫైరీ అయిపోయిందని ఇక తనకు ఫోన్ చేయోద్దని.. తాను కూడా ఫోన్ చేయనని చెప్పి కాల్ కట్ చేస్తాడు. జ్యోత్స్న మాత్రం నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటో నాకు తెలుసు సూరజ్. కానీ నేనే లేట్ అయ్యాను.. ఎవరో చేసిన తప్పుకు నేను బలైపోయాను అని మనసులో అనుకుంటూ బాధపడుతుంది జ్యోత్స్న.
మాలినికి ఫోన్ చేసిన పారిజాతం తాను జ్యోత్స్న విషయంలో చెప్పినట్టే చేశానని.. తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వమని మాలినిని అడుగుతుంది. అందుకు మాలిని పని ఇంకా పూర్తి కాలేదని పని మొత్తం పూర్తయ్యాక డబ్బులు ఇస్తానని అంతవరకు తనకు అవసరం అయితే జ్యోత్స్న అకౌంట్‌లో ఉన్న రెండు కోట్లను వాడుకోమని చెప్తుంది. అందుకు పారిజాతం కోప్పడుతూ.. పని సగం అయిపోయింది కదా..? నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అయినా ఇప్పుడు జ్యోత్స్నను ఆ డబ్బుల గురించి అడిగితే అసలు ఇవ్వదు అంటూ చెప్తుండగానే.. జ్యోత్స్న వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు గ్రాణి అంటూ ఫోన్ లాక్కుని చూస్తుంది. మాలిని కాల్ కట్ చేస్తుంది. పారిజాతం మాత్రం నాతో చేతులు కలుపు.. సూరజ్‌ను మర్చిపో నీకు రెండు కోట్లు కాదు పది కోట్లు డిమాండ్ చేస్తాను అంటుంది. పారిజాతం మాటలకు జ్యోత్స్న కోపంగా చూస్తూ.. ఒక ఆడపిల్లను అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్లను ఏమంటారో నీకు తెలియదా.? తెలియకపోతే తెలుసుకో అంటూ తిట్టి జ్యోత్స్న వెళ్లిపోతుంది.
ఆఫీసుకు వెళ్లిన మాలిని జ్యోత్స్న చైర్ ఖాళీగా ఉండటం చూసి ఇక ఇది ఆఫీసుకు రాదు అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది. కానీ అప్పుడే జ్యోత్స్న కాఫీ తాగుతూ తన కుర్చీ దగ్గరకు వెళ్తుంది. జ్యోత్స్నను చూసిన మాలిని షాక్ అవుతుంది. కోపంగా దగ్గరకు వెళ్లి ఏంటే నువ్వు ఇంట్లో జుట్టు విరబోసుకుని ఏడుస్తూ ఉంటావ్ అనుకుంటే ఆఫీసుకు వచ్చావు అంటూ తిడుతుంటే.. ఏంటత్తా నీ కొడుకు ఇంట్లో అలాగే చేస్తున్నాడా..? అంటూ జ్యోత్స్న అడిగితే.. అది సరే కానీ నా కొడుకు మనసులో నువ్వే ఉన్నావ్ అన్నావ్ ఆ మాట ఇప్పుడు చెప్పగలవా.. చెప్పలేవ్.. ఎందుకంటే సూరజ్ మనసులో ఇప్పుడు జ్యోత్స్న లేదు అంటూ మాలిని అంటే..
చూడత్తా ఇన్ని రోజులు నిన్ను ఆటపట్టించడానికో.. ఏడిపించడానికో కొన్ని మాటలు చెప్పేదాన్ని.. కానీ ఎప్పుడైతే సూరజ్ ముందు నా క్యారెక్టర్ తీసేశావో అప్పుడే నీకు నాకు డైరెక్ట్ యుద్ధం మొదలైంది. నేను ఈ ఆఫీస్‌లో చేరింది నీ కొడుకు కోసమే.. నన్ను ప్రేమించి పెళ్లి వరకు వచ్చిన నీ కొడుకుని ఎలా వదిలేస్తా అనుకున్నావ్.. నీ కొడుకుని నాకు ఎలా దూరం చేశావ్ నీకు అలాగే దూరం చేస్తా.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ జ్యోత్స్న మాలినికి డైరెక్టుగా వార్నింగ్ ఇస్తుంది. అందుకు మాలిని కూడా జ్యోత్స్న కు వార్నింగ్ ఇస్తుంది. నా దారికి అడ్డొస్తే తొక్కేస్తా అంటూ బెదిరిస్తుంది మాలిని. ఇద్దరి మధ్య మాటల యుద్దం జరుగుతుంది.
మాలిని, జ్యోత్స్న ఒకరినొకరు వార్నింగ్ ఇచ్చుకోవడం దీప, కార్తీక్ చూస్తారు. మాలిని ఇంటికి వెళ్లి అందరికీ జ్యోత్స్న రెండు కోట్లు తీసుకున్న విషయం చెబితే ఏంటి మన పరిస్థితి అని దీప అడిగితే.. ఇక నుంచి మనం దేనికైనా రెడీగా ఉండాలని కార్తీక్ చెప్తాడు. తర్వాత సూరజ్ ఆఫీసుకు రాగానే జ్యోత్స్న వెళ్లి ఫైల్స్ చూపిస్తుంటే.. సూరజ్ కోపంగా తనకు పీఏ అవసరం లేదని వెళ్లిపోవచ్చని జ్యోత్స్నను వెళ్లిపోమ్మని వార్నింగ్ ఇస్తాడు. జ్యోత్స్న మాత్రం సాయంత్రం మీతో మాట్లాడాలి టైం ఇస్తారా అని అడిగితే.. టైం లేదని తన క్యాబిన్‌లోంచి వెళ్లిపోమ్మని అసలు ఆఫీసులోంచే వెళ్లిపోమ్మని చెప్తాడు సూరజ్.
మాలిని తన కిరాయి రౌడీని పిలిపించి సీక్రెట్ ప్లేస్‌లో కలుస్తుంది. ఆ రౌడీతో వెంటనే రేపటి వరకు జ్యోత్స్నను చంపాలని చెప్తుంది. అందుకోసం వేరే కిరాయి రౌడీలను పురమాయించమని చెప్తుంది. అందుకు ఆ వ్యక్తి సరే అంటాడు. మాలిని, ఆ రౌడీ మాట్లాడుకోవడం దీప చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.