Podarillu Today Episode November 21st : మాధవ్ ఏం జరిగితే అది జరుగుతుంది నువ్వు మాత్రం తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు అమ్మ అని అంటాడు ఇక ఆ మాట విన్న మహాలక్ష్మి సరే పెద్ది అని అక్కడి నుంచి వెళ్తుంది అయితే బయటికి రాగానే చక్రి ఉన్న కూడా తను పట్టించుకోకుండా తన బండి మీద వెళ్లాలని అనుకుంటుంది. చక్రి మహాలక్ష్మి పిలుస్తుందేమో అని చూస్తూ ఉంటాడు కానీ మహాలక్ష్మి మాత్రం అస్సలు పిలవకుండా తన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మధ్య ఈ దూరానికి సింక్ అయ్యేలా ఒక పాట కూడా వచ్చేస్తుంది. ఈ సీను మాత్రం ఎపిసోడ్కి కాస్త హైలెట్గా నిలుస్తుంది. మహాలక్ష్మి చక్రి అలా ఒకరికొకరు తెలియనట్టుగా ఉండడం ఫాన్స్ కి కాస్త ఫీలింగ్ అనిపించిన కూడా.. ఈ ఎపిసోడ్ లో ఇదే హైలెట్ సీన్ గా మారడం విశేషం…
మహాలక్ష్మి ఆఫీస్ కి వెళ్ళగానే ఒక పెద్ద ప్రాజెక్టు ఉంది అని దాన్ని చేయడానికి దివ్య ఇద్దరు కూడా చాలా కష్టపడి పోతూ ఉంటారు.. అయితే మహాలక్ష్మి ఎలాగైనా ఈ రోజు ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి మళ్లీ కొత్త ప్రాజెక్ట్ కి లైన్ క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటుంది. ఆ ప్రాజెక్టు గురించి ఇద్దరు చాలా కష్టపడుతూ ఉండగా విక్కీ దివ్య పక్కకు వెళ్ళగానే మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్కీ ఏం చేస్తున్నావు అని చెప్పగానే నేను ప్రాజెక్టు డిజైన్ చేస్తున్న విక్కీ అని చెప్తుంది కానీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని అంటుంది అప్పుడే విక్కి కాఫీ కి వెళ్దామని అడుగుతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి వాటిని పక్కన పెట్టి నేను ఇప్పుడు కాఫీకి రాలేను విక్కీ అని చెప్తుంది ఆ మాట విన్న దివ్య బాస్ నీకు బాగానే లైన్ వేస్తున్నాడు అని అనగానే మహాలక్ష్మి సీరియస్ అవుతుంది ముందు పని చూడు అని దివ్య కి చెప్తుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం కాస్త ఎమోషనల్ గా ఇంకాస్త కొత్తగా పూర్తవుతుంది.
మహాలక్ష్మి తన్నే రిజెక్ట్ చేసింది నేనే చాలా బాధపడిపోయిన చక్రి ఎలాగైనా సరే తన మనసులో చోటు సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా మాధవ్ కూడా నువ్వు చేసింది తప్పురా అని చెప్తాడు కానీ చక్రి మాత్రం భర్తగా తనకు విడాకులు ఇచ్చి ప్రియుడిగా తనకు మళ్ళీ దగ్గర అవ్వాలని నేను ఇలా చేశాను అని చెప్తాడు. దాంతో మాధవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ చక్రి మాత్రం అలా చేయడం వల్ల ఇంకా దూరం అవుతాడు అని అనుమానిస్తాడు. చక్రిపై అనుమానం ఉన్నా కూడా మాధవ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా వాడి జీవితాన్ని వాడే కాపాడుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక ఆ తర్వాత చక్రి కి అంత మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తాడు. చక్రిమాతరం మహాలక్ష్మి తన గురించి చాలా ఫీల్ అయిపోతాడు. మహాలక్ష్మి కూడా చెక్రి ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు అంటూ ఆలోచనలు పడిపోతుంది.
ఇక మాధవ్ ఎంత చెప్పినా సరే వీళ్ళు వినట్లేదు వీళ్ళ జీవితం వేలే ఇష్టమని అనుకుంటాడు. ఇక చక్రి సడన్గా ఇంటికి రాగానే టీ తాగుతూ కనిపిస్తాడు. అరే నీకు టీ పెట్టుకోవడం కూడా వచ్చా. నువ్వు ఎందుకు అప్పుడే టీ పెట్టుకుని తాగుతున్నావా నాకు కూడా టీ కావాలి అని చక్రి ఆలోచిస్తూ అడుగుతాడు. అయితే నేనేం పెట్టుకోలేదు అన్నయ్య పెట్టాడు అని చెప్పగానే అన్నయ్య అప్పుడే వచ్చేసాడా ఏంటి అని చక్రి డౌట్ పడతాడు. అయితే అప్పుడే స్నానం కూడా చేసి రావడం చూసినా చక్రి ఏంటయ్యా అప్పుడే వచ్చేసావ్ ఎక్కడికైనా వెళ్తున్నావా స్నానం కూడా చేశావు అని అడుగుతాడు. అయితే మాధవ్ మాత్రం ఇంట్లోకి రాదని ఏదో ఒక సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు కానీ చక్రి వాళ్ళకి అనుమానం మొదలవుతుంది. నిజంగానే వాళ్ళిద్దరూ మాధవ్ పై డౌటుతో తనని ఫాలో అవ్వాలని అనుకుంటారు మాధవి రెడీ అయ్యి చాలా స్మార్ట్గా తయారయ్యి వెళ్ళిపోతాడు.
పని ఉంది సైట్ ఇంజనీర్ మనవరాలు కొమ్మలు కొట్టే ఫంక్షన్ అది ఇది అని అబద్ధం చెప్పాడు అన్నయ్య అని చక్రి కన్ఫామ్ చేసుకుంటాడు. ఎలాగైనా సరే అన్నయ్య మనీషా దగ్గరకి వెళ్తున్నాడని అర్థం ఉంది. కచ్చితంగా మనీషా దగ్గరే అన్నయ్య ఉంటాడు అని ఆలోచిస్తూ చక్రి అలాగే కన్నా ఇద్దరూ కూడా మనిష వాళ్ళ ఇంటిదగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అన్నయ్య ఇంకా రాలేదేంటి మనమే తప్పుగా అర్థం చేసుకున్నామా లేదా అన్నయ్య రావడానికి టైం పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అయితే చక్రి మాత్రం అన్నయ్య సైకిల్ మీద వస్తున్నారు కదా.. కాస్త నిదానంగానే వస్తాడు అని అనగానే అప్పుడే మాధవ్ అక్కడ సడన్గా ప్రత్యక్షమవడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మాధవ్ రాగానే సిగ్గు పడిపోతూ మనిషా దగ్గరికి వెళ్తాడు అది చూసినా ఇద్దరు తమ్ముళ్లు కూడా అన్నయ్య ఇంత ముదిరిపోతాడని అస్సలు ఊహించలేదని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..