E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode November 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి పెళ్లి ఫోటోల్లో మంగళ, పార్థును చూస్తుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode November 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి పెళ్లి ఫోటోల్లో మంగళ, పార్థును చూస్తుందా..? 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని ఫాలో అవుతూ వెనకాలే కారులో వెళ్తుంటాడు అమర్‌. కొద్ది దూరం వెళ్లాక మనోహరి కారు ఆపేసి చంభాతో మాట్లాడి మళ్లీ వెళ్లిపోతుంటే.. అమర్ అంతా గమనిస్తూ.. ఇదేంటి మళ్లీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటూ అమర్‌ కూడా కారు ఎక్కబోతుంటే.. రామ్మూర్తి వచ్చి ఆపేస్తాడు. బాబు ఇక్కడికి వచ్చారేంటి అని అడిగితే.. అవును మామయ్య గారు చిన్న పని ఉండి వచ్చాను అని అమర్‌ చెబితే.. అయితే ఇంటికి రండి బాబు కాఫీ తాగి వెళ్దురు అంటూ రామ్మూర్తి అడిగితే..

లేదు మామయ్య వేరే పని మీద వెళ్తున్నాను అంటూ అవును మీ ఇంట్లో ఎవరో గెస్ట్‌ ఉన్నారని చెప్పారు కదా మళ్లీ తన గురించి ఏం చెప్పలేదు అని అమర్‌ అడిగితే.. చెబుదామనే అనుకున్నాను బాబు మీరే ఏదో ఏదో సమస్యల్లో ఉన్నారు. అందుకనే అతనెవరో అతని కుటుంబ సభ్యులు ఎవరో నేనే వెతుకుదామనుకుంటున్నాను. అవును భాగీ పిల్లలను చూడాలని మీ అత్తయ్య కూడా ఇంటికి వచ్చింది బాబు అని చెబితే.. అయితే నేను ఇంటికి వెళ్లాక కలుస్తాను అంటూ అమర్‌ కారెక్కి వెళ్లిపోతాడు. రామ్మూర్తి ఈ కుర్రాడు ఎక్కడున్నాడో ఏంటో ఇప్పుడు ఎక్కడని వెతకాలి అనుకుంటూ వెళ్తుంటాడు. కొద్ది దూరం వెళ్లాక ఒక బస్టాఫ్ లో పార్థు కనిపిస్తాడు రామ్మూర్తికి.

Advertisement

దగ్గరకు వెళ్లి చూడు బాబు ఇక్కడ కూర్చున్నావేంటి..? రా ఇంటికి వెళ్దాం అని అడిగితే.. కాసేపు ఉండి వస్తానండి అంటూ పార్థు చెప్తాడు. అందుకు రామ్మూర్తి చూడు బాబు నీకు తెలియని మనుషుల మధ్య నీ వాళ్ల గురించి ఎంత వెతికినా ఏం ప్రయోజనం ఉండదు. నీకు ఇలా జరగడం విధి. ఆ విధి నీకు మళ్లీ గతాన్ని గుర్తు చేస్తుంది. అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టడం తప్పదు అంటూ రామ్మూర్తి చెబితే.. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అంటూ పార్థు చెప్తాడు. ఏం ఇబ్బంది లేదు. అదే నా కన్న కొడుకు అయితే ఇలాగే వదిలేస్తానా..? చెప్పు నువ్వు మా ఆవిడ అన్న మాటలు ఏవీ పట్టించుకోవద్దు. నిన్ను నీ ఇంటికి చేర్చే వరకు నువ్వు మా ఇంటి మనిషివి.. ఏ రుణం మనల్ని కలిపిందో నాకు తెలియదు ఆ రుణం తీరిపోయే వరకు మనం కలిసి ఉండక తప్పదు.. ఏం ఆలోచించకు రా వెళ్దాం అంటూ పార్థును తీసుకుని వెళ్లిపోతాడు రామ్మూర్తి.

ఇంట్లో ఉన్న మంగళను చూసిన రాథోడ్‌ బాగా తిన్నారా..? మంగళ గారు అని అడిగితే.. బాగా తిన్నాను రాథోడ్‌ అని మంగళ చెబితే.. ఆ తృప్తి మీ ముఖంలోనే తెలిసిపోతుంది ఇదిగోండి మనోహరి గారి పెళ్లి ఆల్బమ్‌ అంటూ ఆల్బమ్ ఇస్తాడు రాథోడ్‌. అప్పుడే మిస్సమ్మ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. మంగళ కాఫీ తీసుకుని తాగుతూ.. అబ్బబ్బా నీ చేతి కాఫీ అమృతం భాగీ అంటుంది. మీ చేతి కాఫీ విషమా అండి అంటే.. మంగళ షాక్ అవుతుంది. భలే వాడివే రాథోడ్‌.. భాగీ అంత కాకపోయినా నేను కూడా కాఫీ బాగానే పెడతాను అంటూ కాఫీ తాగుతూ.. మనోహరి పెళ్లి ఆల్బమ్‌ ఓపెన్‌ చేస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నను మాలిని చంపేస్తుందా..?    

Podarillu Today Episode : మహాకు యాక్సిడెంట్.. మాధవ్ అడ్డంగా బుక్కయ్యాడు.. అయ్యో చక్రీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కోర్టులో కమల్ కు దిమ్మతిరిగే షాక్.. పల్లవి రాకతో టెన్షన్..

Brahmamudi Serial Today Episode November 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు వేసిన టెండర్ డీటెయిల్స్ రఘువీర్ కు తెలుస్తాయా..?  

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు ఘోర అవమానం.. ఇదేం ట్విస్ట్.. రవి పై అనుమానం..

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. యూత్ కు పునకాలే..!

వైష్ణవి సోనీ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. మల్లె చెట్టు రచ్చ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×