IND VS AUS 1st ODI: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా వన్డేల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారధ్యంలో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఆడనున్నారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ తొలి వన్డే మ్యాచ్ పెర్త్ స్టేడియం వేదికగా జరగనుంది. ఆస్ట్రేలియాలో మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో టైమింగ్స్ లో పూర్తిగా మార్పులు ఉంటాయి. ఉదయం 9:00 సమయానికే ఈ వన్డే మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అంటే ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ఉంటుందన్నమాట. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ చానల్స్ లో మనం ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. జియో హాట్ స్టార్ లేని వాళ్ళు ఒరిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కు వర్షం విలన్ గా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు దారి చేస్తోంది. మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దీంతో పెర్త్ వన్డే మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. అలా జరిగిన కూడా సెకండ్ బ్యాటింగ్ చేసే సమయానికి కూడా మళ్లీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. అంటే ఈ మ్యాచ్ కు దాదాపు 40 శాతం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చాలా తర్వాత రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూద్దామని అనుకుంటే వర్షం విలన్ గా మారిందని అంటున్నారు.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI: ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్ (c), మాట్ రెన్‌షా, మాట్ షార్ట్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్ (WK), కూపర్ కొన్నోలీ, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హేజిల్‌వుడ్
ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్/ప్రసిధ్ కృష్ణ