సినిమాల సన్నివేశాలు రియల్ లైఫ్‌లో రిపీట్ అవుతున్నాయి. తాజాగా తమిళనాడు జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకుని పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఖైదీల్లో కొందరు.. జైలు సిబ్బందిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. పారిపోయిన ఖైదీల్లో ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఖైదీల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? జైలులో ఏం జరిగింది?
విదేశాలు, సినిమాల్లో ఖైదీలు జైలు గోడలను బద్దలు కొట్టి తప్పించుకుంటారు. అలాంటి సందర్భాలు రియల్‌గా జరిగాయి. కానీ జైలు సిబ్బందిపై దాడి చేసి న తర్వాత సోమవారం అర్ధరాత్రి 17 మంది ఖైదీలు పారిపోయారు. ఈ వార్త తమిళనాడు వ్యాప్తంగా దుమారం రేపింది. భారీగా ఖైదీలు పారిపోవడంతో పోలీసు యంత్రాంగం తీవ్ర ఆందోళనకు గురైంది. పారిపోయిన వారిలో ఓ ఖైదీని అరెస్టు చేశారు అధికారులు. అతడు మదురైకి చెందినవాడు.
మిగతా 16 మంది ఖైదీలను పట్టుకోవడానికి 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. జైలు వెనుక అటవీ ప్రాంతం ఉండడంతో అక్కడ కూంబింగ్ మొదలుపెట్టినట్టు దక్షిణ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయేంద్ర బిడారి వెల్లడించారు. ఖైదీల అరెస్టు చేసేందుకు గాలింపు తీవ్రతరం చేశారు. పారిపోయిన ఖైదీల కోసం పొరుగున దిండిగల్ జిల్లాలో 16 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గాల ద్వారా వెళ్లే అన్ని వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తు్న్నారు పోలీసులు.
పోలీసుల కథనం ప్రకారం.. 17 మంది ఖైదీలను ఒకే సెల్‌లో ఉంచారట. ఖైదీల్లో ఒకరు అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడారు. ఈ సమాచారం అందడంతో జైలు సిబ్బంది సెల్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సిబ్బందిపై దాడి చేశారు. జైలుకు చెందిన గ్రేడ్-II పోలీస్ సిబ్బంది తంగపాండి తలకు గాయం కావడంతో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనతోపాటు మరో ఇద్దరు సిబ్బందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.
1995 తర్వాత జైలు నుంచి ఖైదీలు పరారీ ఇదే అతిపెద్ద ఘటనగా చెబుతున్నారు కొందరు అధికారులు. ఆనాడు ఎల్‌టీటీఈ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న 43 మంది జైలు నుంచి తప్పించుకున్నారు. అప్పట్లో అది సెన్సేషన్‌గా మారింది. ఆనాడు వేలూరు కోటలో ప్రత్యేక జైలులోని సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్నారు. ఆ ఘటన తర్వాత ఇప్పుడు 17 మంది ఖైదీలు తప్పించుకున్నారు.
ALSO READ: “శరణమా? మరణమా?.. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక!
#WATCH | Tamil Nadu | Security teams conduct intensive vehicle checking following the incident where 17 inmates have escaped from the Theni sub-jail. 17 special teams have been formed to track down and apprehend the escaped prisoners.
One escaped prisoner has been arrested by… pic.twitter.com/FYD20alGSx
— ANI (@ANI) October 26, 2026