Software Employee: స్నేహితులతో బయటకు వెళ్లి వచ్చిన ఓ యువకుడు ఇంట్లో నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం రాజేంద్రనగర్ బండ్లగూడ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీవాస్తవ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవాస్తవ్ తన స్నేహితులను కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం దాదాపు 11 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు ఆఫీసుకు వెళ్లనని ఇంట్లోనే నిద్రపోయాడు. అయితే, సాయంత్రం సమయంలో ఉద్యోగానికి వెళ్లి తిరిగి వచ్చిన అతడి అక్క, బావ ఎంత సమయమైనా శ్రీవాస్తవ్ లేవకపోవడంతో అనుమానం వచ్చి లేపేందుకు ప్రయత్నించారు.
అప్పటికే కన్నుమూసిన శ్రీవాస్తవ్
అతడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, శ్రీవాస్తవ్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడితో పాటు అతడి అక్క, బావ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగానే పనిచేస్తున్నారని సమాచారం.
కేసు నమోదు..
ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీవాస్తవ్ మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు రీజన్, పోస్టుమార్టం నివేదిక కోసం నిరీక్షిస్తున్నారు.
Also Read: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో పాఠశాలలకు సెలవులు, విద్యుత్ ఉద్యోగుల సెలవులు క్యాన్సిల్