OTT Movie : గ్రామీణ వాతావరణంలో వచ్చే సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులోనూ అల్లరి, చిల్లరగా తిరిగే యూత్ ఉంటే కథకి కొంచెం హైప్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, గ్రామీణ వాతావరణంలో ఉండే నలుగురు యువకుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఆ గ్రామంలో చేసే అల్లరి, చిన్న చిన్న దొంగతనాలు, వీటితో పాటు ఒక లవ్ స్టోరీ ఈ సినిమాను ఆసక్తికరంగా నడిపిస్తుంది. ఈ బాలీవుడ్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి అనే వివరాల్లోకి వెళ్తే ..
‘కెర్రీ ఆన్ కుట్టన్’ 2016లో వచ్చిన హిందీ సినిమా. దీనిని అశోక్ యాదవ్ డైరెక్ట్ చేయగా, శశాంక్ శేఖర్ సింగ్ ప్రొడ్యూస్ చేశాడు. ఇందులో సత్యజీత్ దుబే (కెర్రీ), అరధనా జాగోతా (జ్యోతి), అదిత్య కుమార్ (అర్జున్), కరణ్ మహావర్ (విక్రమ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2016 జూలై 1న థియేటర్లలో రిలీజ్ అయింది. 1 గంట 59 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా, IMDbలో 5.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
బలియా అనే చిన్న గ్రామంలో నలుగురు టీనేజ్ అబ్బాయిలు, ఒక అమ్మాయితో ఈ కథ మొదలవుతుంది. కెర్రీ అనే ఒక స్మార్ట్, రెబెల్ అబ్బాయి, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాడు. అదే ఊర్లో ఉండే జ్యోతి అనే అందమైన అమ్మాయి, తన డ్రీమ్స్ (స్టడీస్, ఫ్రీడమ్) కోసం ఎదురుచూస్తుంటుంది. ఇక అర్జున్, విక్రమ్, శివమ్ అనే ముగ్గురు కూడా జాబ్, లవ్ ప్రాబ్లమ్స్‌తో ఉంటారు. వీళ్ళంతా గ్రామంలో కలిసి టైమ్ స్పెండ్ చేస్తుంటారు. కానీ వాళ్ళకు గ్రామీణ లైఫ్ బోరింగ్ అవుతుంది. అంతే కాకుండా నలుగురు యూత్ కలిసి గ్రామంలో ఇబ్బందులు ఫేస్ చేస్తారు.
ఇంతలో కెర్రీ, జ్యోతి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. కానీ జ్యోతి ఫ్యామిలీ మరో అబ్బాయితో పెళ్లి ప్రెషర్ పెడతారు. అర్జున్, విక్రమ్ జాబ్‌లేక, గ్రామంలో చిన్న చిన్న చోరీలు చేయడం మొదలు పెడతారు. వీళ్లు కలిసి ఆ గ్రామం నుంచి బయటపడాలని ప్లాన్ చేస్తారు. కానీ చిన్న చిన్న క్రిమినల్ యాక్టివిటీస్ లో చిక్కుకుంటారు. పోలీస్ కంట్లో కూడా పడతారు. ఈ సమయంలోనే జ్యోతి, కెర్రీతో పారిపోవాలని ట్రై చేస్తుంది. కానీ ఫ్యామిలీ వాళ్ళను ఆపడానికి ట్రై చేస్తారు.
ఈ నలుగురు యూత్ కలిసి ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. గ్రామం నుంచి తప్పించుకుని, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసిన ఒక దొంగతనం వల్ల, పోలీస్ లకు పట్టుబడతారు. దీంతో జ్యోతి ఫ్యామిలీ ఆమెకు వేరొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. కెర్రీ ఆమెను అక్కడి నుంచి లేపుకెళ్లడానికి ట్రై చేస్తాడు. చివరికి వీళ్ళు ఆ గ్రామం నుంచి బయటపడి, కొత్త జీవితం స్టార్ట్ చేస్తారా ? జ్యోతిని కెర్రీ పెళ్లి చేసుకుంటాడా ? ఈ నలుగురి జీవితాలకు ఎలాంటి ముగింపు వస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పెళ్లి కాకుండానే టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన వయసులో ఇవేం పిచ్చి పనులు పాపా ?