Illu Illalu Pillalu Today Episode September 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. నేను డబ్బులు తీసుకున్న సేటు అలాంటివాడు నన్ను అంతగా టార్చర్ చేశాడు. కాబట్టే నేను వల్లి తో అలా మాట్లాడిన తప్ప వల్లి అంటే నాకు ప్రాణం అని చందు అంటాడు.. ఆ తర్వాత వల్లిని భాగ్యం బయటకు తీసుకొని వస్తుంది. అయితే అక్కడే ఉన్న భద్ర విశ్వం చూసి వల్లితో నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళు చెప్పినట్టు విను నీకు కావాల్సింది వచ్చింది కదా నీకు కాపురం కి ఇక్కడ డోకా లేదు అని భాగం చెప్తుంది. భద్ర అనుకున్న ప్లాన్ సక్సెస్ అవడంతో విశ్వం ఇద్దరు కూడా సంతోషంలో మునిగిపోతారు. వల్లి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది.. అయితే ఆ తర్వాత శ్రీవల్లి అమూల్యని ఎలాగైనా సరే ఆ విశ్వం గాడిచేతిలో పెట్టాలని అనుకుంటుంది.. ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఆ కళ్యాణ్ గాడి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ తనలో తానే దిగులు పడుతుంది. . ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి నాకు ఆకలి బాగా వేస్తుంది కడుపులో డైనోసార్లు పరిగెడుతున్నాయి తిందాం రా అనేసి బ్రతిమలాడుతాడు.. ప్రేమ ఎంత చెప్పినా సరే ధీరజ్ మాట వినదు. నువ్వు కళ్యాణి నుంచి తప్పించుకోవడానికి నన్ను పెళ్లి చేసుకున్నానని ఎన్నోసార్లు అన్నావు.. ప్రేమ టెన్షన్ని ఏదో ఒక విధంగా పోగొట్టాలి అని ధీరజ్ ఆలోచిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తన ఫ్రెండ్స్ తో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ.. అయితే అప్పుడే కళ్యాణ్ గాడు ప్రేమకు ఫోన్ చేస్తాడు.. వాడి ఫోన్ చూసి షాక్ అయిన ప్రేమ పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. నీకు ఒళ్ళు పగలగొట్టిన బుద్ధి లేదా అని అంటుంది. నీకు వార్నింగ్ ఇచ్చే టైం అయిపోయింది ఇక వార్ లోకి దిగాల్సిందే అని కళ్యాణ్ అంటాడు.. ప్రేమని ఇంకాస్త టెన్షన్ పెట్టేలా కళ్యాణ్ మాట్లాడడంతో ప్రేమ భయపడిపోతుంది. ఎలాగైనా సరే వీడు నుంచి బయటపడాలి అని అనుకుంటుంది.
ఇక శ్రీవల్లి ప్రేమ వల్ల గదిలోకి వెళ్లి ఆ రోజు వచ్చిన లెటర్ ఏంటో తెలుసుకోవాలని వెతికేస్తూ ఉంటుంది. ప్రేమ దాచుకున్న ఒక పెట్టెలో ఏమున్నాయో తెలుసుకోవాలని దాన్ని పగలగొడుతుంది. అందులో ఆరోజు వచ్చిన లెటర్ కనిపించడంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. ప్రేమకి ఆరోజు వచ్చిన లెటర్ ఇదే అని దాన్ని తీసుకొని అందులో ఏమున్నాయి అని చూస్తుంది. అయితే అందులో ఉన్న ఫోటోలను చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఫోటోలలో ఉన్న అబ్బాయి ఎవరు? సీక్రెట్ ఎవరు నడిపిస్తుందా ధీరజ్ కి విషయం తెలుసా అని తనలో తానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటుంది.
దీని గురించి నేను ఇంతగా బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? ఈ ఫోటోలు ని మామయ్య గారి దగ్గర చూపిస్తే ఆయనే అన్ని తెలుసుకుంటాడు కదా అని శ్రీవల్లి ఆ ఫోటోలో తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది. బయట తలుపు తీయగానే నర్మదా ఎంట్రీ ఇస్తుంది. ప్రేమ వాళ్ళు లేకున్నా వాళ్ళ గదిలోకి రావడం నీకు కొంచమైన బుద్ధుందా అని అడుగుతుంది. వాళ్ల పర్సనల్ విషయాలు గురించి నీకెందుకు.. ఇలా రావడం తప్పు కదా. నీ గురించి అన్ని విషయాలు తెలిసిన సరే.. నీ జీవితం బాగుండాలి అని దాచి పెట్టాము అంతే.. నువ్వు బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటావని అనుకున్న కానీ నువ్వు మారవు అని నాకు అర్థం అయిపోయింది.
కుక్క బుద్ధి వంకర అన్నట్లు నీ బుద్ధి ఇక మారదు అని నర్మదా శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది. నేను ఊరికే రాలేదు ఆ రోజు ప్రేమకు వచ్చిన లెటర్ ఎందుకు తెలుసుకుందామని వచ్చాను ఇందులో ఫోటోలు ఉన్నాయి చూడు అని శ్రీవల్లి అంటుంది. ఆ ఫోటోలను చూసిన నర్మదా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ కళ్యాణ్ ఫోటో లాగా ఉన్నాయి అయినా ఇది శ్రీవల్లి అక్కకు దొరికింది అంటే కచ్చితంగా ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. వీటి నుంచి ఏదో ఒకటి చెప్పాలి అని అనుకుంటుంది నర్మదా..
బుద్ధుందా అక్క నువ్వు కూడా ఏంఏ చదివావు కదా ఒక అబ్బాయి తో ఫోటోలు దిగితే తప్పేంటి అని నర్మదా శ్రీవల్లిని అడుగుతుంది.. ఈ విషయం గురించి ఎక్కడ చెప్పకు నిన్నే అంటారు అని నర్మదా శ్రీవల్లితో అంటుంది. ఆ ఫోటోలను తీసుకొని నర్మదా వేదవతి దగ్గరికి వెళుతుంది. వాటిని చూసిన వేదవతి షాక్ అవుతుంది. ఈ ఫోటోలు మీ మావయ్య కంటబడితే మనం చేసిన దొంగ పెళ్లి గురించి తెలిసిపోతుంది. ఇన్ని రోజుల తర్వాత ఆ కళ్యాణ్ గాడు ఇప్పుడు ఎందుకు ఈ ఫోటోలను పంపాడు అని వేదవతి టెన్షన్ పడుతుంది..
Also Read : మారిపోయిన భరత్.. ప్రణతికి మొదలైన అనుమానం.. దొరికిపోయిన కమల్…
శ్రీవల్లి మాత్రం వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఈ ఫోటోలు వినకున్నా అసలు రహస్యం ఏంటో నేను తెలుసుకోవాలి అని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక వేదవతి ప్రేమ ఇన్ని రోజులు నరకాన్ని అనుభవించింది. వయసులో చిన్నదైనా సరే చాలా గొప్పగా ఆలోచించింది. మనం ఎక్కడ టెన్షన్ పడిపోతాము అని తనలో తానే ఎంతో కుమిలిపోయింది అని వేదవతి అంటుంది. రామరాజు తిరుపతి టీ షాప్ దగ్గర ఆగి మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ తన ఫ్రెండ్ తో వచ్చి ఫోటోలని చూపించాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..