Intinti Ramayanam Today Episode August 26th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోకి పార్వతి రావడం చూస్తారు. వ్రతం గురించి అన్నయ్య వాళ్ళతో చెప్పారా వస్తానని అన్నారని కమల్ అడుగుతాడు. ఏమైంది పార్వతి వ్రతం చేయించడానికి అక్షయ్ ఒప్పుకున్నాడా అని భానుమతి అడుగుతుంది. కానీ పార్వతి మాత్రం దిగులుగా రతన్ చేయడానికి అక్షరం రావట్లేదు అని చెప్పేసాడని అంటుంది. అప్పుడే పార్వతికి అవని ఫోన్ చేస్తుంది. అక్షయ్ ని అవని రాజేంద్రప్రసాద్ ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు.
పల్లవి బావగారికి పెళ్లంటే ఇష్టం లేదు ఇక ఈ వ్రతాన్ని ఎలా చేస్తారు అనుకున్నారు అంటూ మాటలతో బాధపెడుతుంది. ఈ వ్రతాలు అవి ఇవి ఎందుకు ఏదో పెళ్లయింది అందరితో సంతోష పడాలి కానీ.. అన్ని చేయాలంటే అదృష్టం కూడా ఉండాలని ప్రణతిపై సీరియస్ అవుతుంది పల్లవి. శ్రేయ కూడా పల్లవి ఏదంటే అదే అంటుంది. కమల్, శ్రీకర్ ఇద్దరు కలిసి ఎలాగైనా ఇప్పిస్తామని అంటాడు.. మీ అమ్మ వెళ్లి మాట్లాడిన కూడా ఒప్పుకొని మీ అన్నయ్య నువ్వు వెళ్లి రమ్మంటే ఒప్పుకుంటాడా ఏంటి అని పల్లవి మనసులో అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీకర్ కమల్ ఇద్దరూ కూడా అక్షయ్ దగ్గరికి వెళ్తారు. నువ్వు వ్రతానికి రానన్నావ్ అంట కదా ఏమైంది అన్నయ్య అమ్మ బాధపడుతుంది అని కమల్ అంటాడు.. అతనికి రావాలని పిలవడానికి వచ్చాము అని అక్షయ్ అంటాడు.. నువ్వు రాలేదని అమ్మ దిగులుగా కూర్చుంది వ్రతం చేయలేదు… అక్షయ్ మాత్రం తమ్ముళ్లపై సీరియస్ అవుతాడు.. కమల్ అవనీకి ఫోన్ చేసి మేమెంత రిక్వెస్ట్ చేసినా రానన్నాడు వదిన అని అంటాడు.. మీరేం కంగారు పడకండి కన్నయ్య మీ అన్నయ్యను వ్రతానికి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటుంది. అక్షయ్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆఫీస్ లో మేడం భార్యలను ప్రేమించే వాళ్ళకి మాత్రమే ఉద్యోగం ఇస్తుందని తెలుసుకొని షాక్ అవుతాడు.
ఇంటర్వ్యూ కి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని రమ్మని పిలుస్తుంది. అక్షయ్ ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంది.. భార్యాభర్తలు ఎలా ఉండాలి? మీ భార్యని మీరు ఎలా చూసుకుంటారు అని అదే ప్రశ్నలు వేసి అక్షయకి ముప్పు తిప్పలు పెడుతుంది.. అయితే అక్షయ్ మాత్రం జాబ్ కోసం మొదట కాంప్రమైజ్ అయిన కూడా ఆ తర్వాత వద్దనుకొని వెళుతూ ఉంటాడు.. కానీ ఆరాధ్య స్కూల్ ఫీజు గుర్తొచ్చి మళ్లీ వెనక్కి వచ్చి జాబ్ లో జాయిన్ అవుతానని ఆమెతో చెప్తాడు.
అయితే ఆమె కచ్చితంగా వెరిఫికేషన్ చేస్తుందని భయపడుతూ ఉంటాడు అక్షయ్.. అటు శ్రేయ పల్లవి ఇద్దరు కూడా వ్రతం జరగదని సంతోషంగా ఉంటారు.. వ్రతం జరగకపోతే కచ్చితంగా అవని ఇంటికి రాదు అని అనుకుంటారు. అయితే అక్కడికి వచ్చిన పార్వతి నా కోడలు చేయాలనుకున్న వ్రతం జరగకూడదని అనుకుంటున్నారా మీరు మనుషులేనా అని అంటుంది. ప్రణతి భరత్లను చూసి పల్లవి రెచ్చిపోతుంది.. భానుమతి భరత్ ని కూర్చోమని అడుగుతుంది.
భరత్ కూర్చోడు.. పల్లవి మన పని వాళ్ళు మనం వెయ్యి రూపాయలు ఇస్తానన్న మనం ముందు ఎలా కూర్చుంటారు అమ్మమ్మ అని వెటకారంగా మాట్లాడుతుంది.. పని వాళ్లకు ఉన్న స్థాయి అంతే అని పల్లవి అంటుంది. దారుణంగా అవమానిస్తుంది. ఆ మాటలు విన్న పార్వతి కొంచమైన బుద్ధుందా నీకు నా ఇంటికి కోడలు వేయండి నా పరువు తీసేలా మాట్లాడతావా? నా కూతురు కాదు నా ఇంటి పరువును కాపాడాల్సింది నువ్వు నా ఇంటి పరువును కాపాడాలి అని గట్టిగానే అరుస్తుంది పార్వతి.
ఆ మాటలు విన్న పల్లవి షాక్ అవుతుంది.. ఇప్పుడు అక్కడికి శ్రీకర్ కమల్ పూజకు కావలసిన సామాన్లను తీసుకొని వస్తారు.. ఏమైంది అని అడుగుతారు. ఏంట్రా ఇది ఇవి తీసుకొచ్చారు ఏంటి అని పార్వతి అడుగుతుంది.. పూజకు కావలసిన సామాన్లు అన్ని తీసుకొచ్చాం అమ్మ అని ఇద్దరు అంటారు.. మీ అన్నయ్య వస్తానని అన్నాడా అని అడుగుతుంది.. మాతో అయితే ఏం చెప్పలేదు అమ్మ వదిన మాత్రం నేను ఆయన ఒప్పించి తీసుకొస్తాను అంది అని కమలంటాడు.
Also Read : ప్రభావతికి దిమ్మతిరిగే షాకిచ్చిన సత్యం.. రోహిణికి మీనా వార్నింగ్..
ఇక పార్వతి అక్షయ్ రాకుంటే అవని రాదు. వాళ్లిద్దరూ రాకుంటే మీ నాన్న కూడా రాడు ఈ వ్రతం మనిద్దరం చేసుకుని ఏం ప్రయోజనం అని అంటుంది.. వదిన మీద మాకు పూర్తి నమ్మకం ఉందమ్మా ఖచ్చితంగా ఒప్పించి తీసుకొని వస్తుంది అని అంటాడు. అటు అవని అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయనకు జాబు రాలేదంటే కచ్చితంగా నువ్వు ఎదురు రావడం వల్ల అని నా మీద వేస్తాడు మామయ్య అని అంటుంది. అక్షయ్ అక్కడికి సంతోషంగా స్వీట్లు పట్టుకుని వస్తాడు. జాబ్ వచ్చింది అన్న విషయాన్ని అందరితో పంచుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…