Keerthi Bhat : సీరియల్స్ చేస్తూ సినిమాలు చేసిన బుల్లి తెర హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కొందరు సీరియల్స్ ద్వారా ఫేమస్ అవుతున్నారు.. ఆ కోవలోకి చెందిన నటి కీర్తి భట్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె మనసిచ్చి చూడు అనే సీరియల్ ద్వారా ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సీరియల్ కీర్తికి మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస సీరియల్లలో నటిస్తూ క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో నటిస్తుంది. కానీ నిత్యం ఏదోక మ్యాటర్ వల్ల వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా తాను సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయాన్ని ఓ ఛానెల్ ఇంటర్వ్యూ లో బయట పెట్టింది. దాంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.
సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. బ్రతికిపోయాను..
బుల్లితెర హీరోయిన్ కీర్తి భట్ తెలుగు సీరియల్స్ ద్వారా అందరికి పరిచయమే.. తెలుగులో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా కొన్ని సీరియల్స్లలో ఈమె నటించింది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టింది. తన ఆట తీరుతో మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. ఈమె తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎన్నో విషయాల గురించి ఆమె పంచుకుంది. తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత తన జీవితం తలకిందులైన విషయాన్ని చెప్పింది. నాకు యాక్సిడెంట్ అయిన కూడా నా దగ్గర నుంచి చూసిన వాళ్లు కూడా నన్ను నాటకమాడుతున్నావు అననే లోపల నాకు ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ అటెంప్ట్ చేశాను. కొన్ని క్షణాల్లో నా ప్రాణం పోయేది కానీ చివరికి నాకు కాబోయే భర్త గురించి ఆలోచించి ఆలోచనను పక్కన పెట్టేసాను. ఒక్క క్షణం మరచిపోయింటే ఈపాటికి మీ ముందు ఉండేదాన్ని కాదు అని కీర్తి సంచలన విషయాలను పంచుకుంది.
Also Read : శుక్రవారం టీవీలల్లోకి కొత్త సినిమాలు.. అన్నీ సూపర్ హిట్టే..!
కీర్తి భట్ లైఫ్ స్టోరీ..
పైకి నవ్వుతూ కనిపించే కీర్తి మనసులో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. ఓ యాక్సిండెంట్ తన జీవితాన్ని తల క్రిందులు చేసింది. ఒంటరిగా నిలబడి పోరాటం చేసింది. ఎంతో కస్టపడి ఇండస్ట్రీకి వచ్చింది.బిగ్ బాస్ కు వెళ్ళివచ్చాక అందరికి మరింత దగ్గరయింది. ఈ మధ్యనే కీర్తి.. తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఇక ఆమె గతంలో ఎదుర్కున్న పరిస్థితిలు వింటే ఎవరైన బాధ పడతారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంది. తనకు పిల్లలు పుట్టరన్న విషయాన్ని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ రెడీ అయ్యాడంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మేము పెళ్లి చేసుకోవట్లేదు అంటూ మరో వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఆసక్తికర సీరియల్లలో కీలకపాత్రలో నటిస్తుంది. అంతేకాదు కొన్ని సినిమాలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పర్సనల్ విషయాలతో పాటుగా లేటెస్ట్ ఫొటోలతో అలరిస్తుంది.