Intinti Ramayanam Today Episode November : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే… వినోద్ వెళ్లిపోవడం పై పొద్దున్నే కోమలి బాధ పడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కొక్క మాట అంటారు. నాదేమీ అనుమానం కాదు ముందు జాగ్రత్త అని కోమలి అప్పటికి తన తప్పని ఒప్పుకోకుండా చెప్తుంది. నన్ను అనడం కాదు అందరు అంటే ఎలా అని ఏడుస్తుంది. అక్షయ్ కూడా కోమలి మీద సీరియస్ అవుతాడు. ఇంట్లో ఎవరు వినోద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కనీసం ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడడానికైనా ఉంటుంది కదా అని అంటారు కానీ వినోద్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక అవని అక్షయ్ ని పక్కకు రమ్మని పిలుస్తుంది.
ఏవండీ ఇలా ఫోన్లతో మాట్లాడితే పని జరగదు మనిషితో నేరుగా మాట్లాడి చెప్పే విధానంలో చెప్తే వింటాడు మనం వెళ్దాం రండి నేను చెప్తాను అనేసి అంటుంది. ఇక పల్లవి ఇంట్లో కనిపించదు. ఎక్కడికి పోయిందో అని అనుకుంటారు. ఇక పల్లవి ఇక తనకు అబార్షన్ చేస్తున్న డాక్టర్ తో ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా హాస్పిటల్ కి వెళుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫోన్ చేసిన డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక అప్పుడే డాక్టర్ దగ్గరికి పల్లవి ఎంట్రీ అయ్యి ఎందుకు నా ఫోన్ మీరు కట్ చేస్తున్నారు అసలు నాకు అబార్షన్ చేశారా లేదా అని నిలదీస్తుంది. అవని చెప్పడం వల్ల నీకు అబార్షన్ చేయలేదని డాక్టర్ నిజం చెబుతుంది. అవని పేరెంట్స్ గురించి పల్లవికి నిజం తెలిసిపోతుంది..
ఇంట్లో పల్లవి కనిపించడం లేదని కంగారు పడతారు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అని ఒంటరిగా పంపడం ఏంటని కమల్ ను అందరు తిడతారు. కానీ పల్లవి సైలెంట్ జైష ఉంటుంది. అందరికి చక్రధర్ పల్లవి వాకింగ్ కు వెళ్లిందని నిజం చెప్తాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ అందరికి చెప్తాడు పల్లవిని ఎవరు ఏమి అనొద్దని ఇంట్లో వాళ్లకు చెబుతాడు. కోమలి అవనిని ఎలాగైనా కలపాలి అని అవని అక్షయ్ తో కలిసి బయటకు వెళ్తుంది. వినోద్ ఆఫీస్ పనిమీద బిజీగా ఉంటే అప్పుడే అక్కడకు వస్తారు. కోమలి గురించి అయితే నా దగ్గర మాట్లాడొద్దు అని అంటాడు. నా జీవితం ఇలా అవడానికి కోమలినే కారణం తన అనుమానమే కారణమని చెప్తాడు. అంతలోకి నిన్న కోమలి కొట్టిన మేడం ఫోన్ చేస్తుంది. మనం కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత తీసుకోండి ప్రాజెక్ట్ అయితే బాగుండాలి అని ఆల్ ది బెస్ట్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అది విని వినోద్ సంతోషంతో గంతులు వేస్తాడు. దానికి కారణం అక్షయ్ అని తెలుసుకొని అక్కడకు థ్యాంక్స్ చెబుతాడు.
ఇక అవని పురాణాల గురించి వినోద్ కి చెప్తుంది. కోమలి తప్పు చేసింది అని అనుకోవడం కాదు ఆ తప్పు చేయడానికి కారణమైన నువ్వు మారాలి. నీ భార్య నువ్వు మార్చుకోవాలని చెప్తుంది. ఆ సుధా మేడంకి మీ బావని చెప్పాడు ఆమెకు అర్థమయ్యేలా చెప్పడంతోనే నీకు ఫోన్ చేసిందని అవని చెప్తుంది. పల్లవి, చక్రధర్ కు పల్లవి అనాధ కాదు దానికి ఒక అమ్మ తమ్ముడు ఉన్నారు అని పల్లవి చెప్తుంది. నాదాన్ని అందరూ ఇంట్లో వాళ్ళు వెనకేసుకొని ఈ విషయం తెలిస్తే అందరూ షాక్ అవుతారని పల్లవి అంటుంది.. ఇక అవని మాటతో ఇంటికి వస్తాడు వినోద్.. కోమలితో మాట్లాడు. అవని అక్క చెబితేనే నేను వచ్చాను అని అంటాడు. అందరు సంతోషంగా ఉంటారు.. ఇక సోమవారం ఎపిసోడ్ లో వినోద్ కోమలి కలిసి పోవడంతో అందరు సంతోషంగా ఉంటారు. గుడికి వెళ్తారు. అక్కడ భరత్ ను పల్లవి ప్లాన్ ప్రకారం తీసుకొస్తుంది. ప్రణవిని కొందరు అకతాయిలు కామెంట్స్ చేస్తారు. చున్నీ భరత్ చేతిలో ఉండటంతో అక్షయ్ భరత్ చెప్పేది వినకుండా కొడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..