Madhuri Rathod: ఫోక్ డాన్సర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మాధురి రాథోడ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2000వ సంవత్సరంలో హైదరాబాదులో జన్మించిన ఈమె.. 2019లో తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి బీటెక్ పూర్తి చేసింది. కళాశాల రోజుల్లోనే ఫోక్ పాటలకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ అభిమానులను సంపాదించుకుంది. మొదట టిక్ టాక్ లో మొదలైన ఆమె ప్రయాణం.. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ వరకు చేరింది .అలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకొని.. తన టాలెంట్ ను నిరూపించుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఢీ 20 లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ‘భామ సుందరలో’, ‘ఆకుల కుర సిసల కళ్ళు డీజే’, ‘మంజులో మాట్లాడి పోతా’ , ‘బాసింగ బలాలే’ ఇలా ఎన్నో ఫోక్ సాంగులతో , మ్యూజిక్ వీడియోలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
కెరియర్ పీక్స్ లో ఉండగానే తన తోటి డాన్సర్ ఈశ్వర్ సాయితో వివాదంలో చిక్కుకొని మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఈశ్వర్ సాయితో ఏకాంతంగా గదిలో ఆయన భార్య శరణ్యకు చిక్కడం, ఆ తర్వాత పోలీసులు, కోర్టు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. ముఖ్యంగా ఈశ్వర్ సాయి తనను నమ్మించి మోసం చేశాడు అంటూ ఆత్మహత్యయత్నం కూడా చేసింది మాధురి రాథోడ్. అలా ఈ ఒక్క విషయంతో సోషల్ మీడియాలో మరింత ట్రెండింగ్ లోకి వచ్చేసింది మాదిరి రాథోడ్. అయితే ఈ వివాదం తర్వాత ఆమె మళ్ళీ కనిపించదేమో అని ఆడియన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు. కానీ రెట్టింపు వేగంతో మరికొన్ని ఫోక్ సాంగ్స్ తో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన లవ్ బ్రేకప్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఒక అభిమాని తనకు చేసిన పెళ్లి ప్రపోజల్ జీవితాంతం గుర్తుండిపోతుంది అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంటర్వ్యూలో భాగంగా.. “ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా.. మీకు వారి నుండి ఏవైనా ప్రపోజల్స్ వచ్చాయా?” అని అడగగా.. “చాలా వచ్చాయి. అయితే అందులో ఒక అభిమాని పెట్టిన ప్రపోజల్ అయితే నేను ఇప్పటికీ ఎప్పటికీ మరిచిపోను. పేరు కూడా గుర్తులేదు కానీ.. నాకు చాలా ఆస్తి ఉంది. 2 పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి. నీ పేరు మీద రాసిచ్చేస్తాను. నన్ను పెళ్లి చేసుకోండి మాదిరి గారు అని అడిగారు. అదైతే నేను ఇప్పటివరకు మర్చిపోలేదు. ఇప్పటివరకు నాకు ఎన్నో మెసేజ్లు పంపిస్తూనే వచ్చాడు” అంటూ ఒక అభిమాని గురించి ఆమె చెప్పుకొచ్చింది.
also read: నీతో స్నేహం నాకొద్దు.. ఎప్పటికైనా సారీ చెబుతావ్ !
అదే ఇంటర్వ్యూలో మీ అభిమానులకు, మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని చాలా ఆత్రుత ఉంటుంది కదా.. దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా అని ప్రశ్నించగా.. “బీటెక్ నుండి డిప్లమా లైఫ్ వరకు నాకు ఒక లవ్ స్టోరీ ఉండేది. కానీ ఇప్పుడైతే లేదు. ప్రస్తుతానికి నేను సింగిల్” అంటూ తాను సింగిల్ అన్న విషయాన్ని అభిమానులకు స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది మాధురి రాథోడ్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.