BigTV English

Intinti Ramayanam Today Episode : పల్లవి గురించి నిజం తెలుసుకున్న అవని.. ఇంట్లో నుంచి బయటకు శ్రీకర్..

Intinti Ramayanam Today Episode : పల్లవి గురించి నిజం తెలుసుకున్న అవని.. ఇంట్లో నుంచి బయటకు శ్రీకర్..

Intinti Ramayanam Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో పల్లవికి అవని షాక్ ఇస్తుంది. స్వాతి స్పృహలోకి రాలేదని చెప్పి నమ్మించి కోర్టుకి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత స్వాతి చెప్పింది విని జడ్జి అక్షయ్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తారు.. పల్లివి తండ్రితో ఓడిపోయామని చెబుతుంది. అప్పుడే స్వాతి వచ్చి డబ్బుల కోసమే ఇదంతా చేసానని చెబుతుంది. మీరు డబ్బులు ఇవ్వకుంటే నేను నిజం అందరికీ చెబుతానని చెబుతుంది. ఇక ఇంట్లో అక్షయ్ కోసం పార్టీని ఏర్పాటు చేస్తారు. అందరు డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తారు.. పల్లవి స్వాతి కోసం డబ్బులను తీసుకొని బయటకు వస్తుంది. అది చూసిన అవని స్వాతి అంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. స్వాతి ఇంట్లోకి వస్తుంటే చూసి బయటకు లాక్కొని వెళ్తుంది. ఇదిగో నువ్వు అడిగిన కోటి రూపాయలు. ఏమైనా చేసుకో.. ఇవి తీసుకొని నువ్వు దుబాయ్ వెళ్తావో లేక పాకిస్తాన్ వెళ్తావో నీ ఇష్టం అని చెబుతుంది. అప్పుడే అవని అక్కడకు వస్తుంది.. పల్లవి ఈ టైం లో ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటూ వస్తుంది. అది గమనించిన పల్లవి స్వాతి ని వెళ్ళమని చెబుతుంది. అవని స్వాతి అంటూ వెంట వెళ్తుంది. కానీ స్వాతి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి దగ్గరకు వస్తుంది. స్వాతి నీకెలా తెలుసు అంటుంది. నాకు తెలియదు అంటే పల్లవి చెంప పగలగొట్టింది. ఇప్పటివరకు నువ్వే ఇలాంటివి చేస్తున్నావని అనుమానం ఉండేది అది ఇప్పుడు నిజం అని తేలింది.. ఇంట్లో దొంగపడ్డాడు అని అందరిని నమ్మించి ఆ పెన్డ్రైవ్ ఇంట్లో పెట్టావా.. ఎందుకు చేశావు ఇదంతా అని చెంప పగలగొడుతుంది. ముసుగులో గుద్దులాట వద్దు అవును ఇదంతా చేసింది నేనే.. నాకు శ్రీకర్ ను దక్కనివ్వకుండా చేసిన ఈ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాను. ఇంట్లో ఎవరు సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేను..

శ్రీకర్ తో నా పెళ్లి చెడిపోవడానికి అసలు కారణం నువ్వే.. అందుకే నేను ఆ పిచ్చోడితో సంతోషంగా ఉండలేను. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండకూడదు అనే నీ మొగుడిని జైలుకు పంపించాలని అనుకున్నా అని అంటుంది. ఇక నా గురించి తెలిసిపోయింది. కదా నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పినా నమ్మరు. ఇద్దరం పోటి పడదాము.. అని వెళ్తుంది. ఇక ఉదయం పల్లవి ఏం చేస్తుందా అని అందరిని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ల అత్తయ్య అక్కడికి వస్తుంది. అవని ఏమైంది అని అడుగుతుంది. అక్షయ్ మీద ఇలాంటి నింద పడటం ఏంటో అని ఆలోచిస్తున్నా అంటుంది. నా కొడుకు శ్రీకర్ మళ్లీ ఇంటికి రావడానికే ఈ కేసు వచ్చిందని అనుకోవాలి అంటుంది. అప్పుడే శ్రీకర్ కాపీ ఇవ్వు అంటాడు. శ్రీకర్ తో వాళ్ల మాట్లాడటం చూసిన పల్లవి కోపంతో రగిలిపోతు అక్కడకు వస్తుంది.


అప్పుడు అవనినీ నీలాంటి కోడలు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక శ్రీకర్ శ్రియా లను ఒకటి చేస్తే ఇక ఏమి బాధ ఉండదు అని అవని అంటుంది. అది విన్న పల్లవి శ్రీకర్ ను ఇంట్లో నుంచి పంపిస్తే శ్రియా కూడా రాదు ఎలాగైనా రాకుండా చేస్తాను అంటుంది. ఇక పల్లవి ముందే అవనిని అత్తయ్య పొగడటం చూడలేకున్నా అని మనసు లో రగిలిపోతుంది. ఇక అవని నేను ఉన్నంతవరకు నీ పప్పులు ఏవి ఉడకినవ్వను అనుకుంటాను అని అవని అనుకుంటుంది. ఇక కమల్ స్నానం చేస్తాడు. పాటలు పాడతాడు. అది విన్న పల్లవి వీడు ఎందుకు పనికిరాడు అంటుంది. ఇక సబ్బుతోనే బయటకు వస్తాడు. బాత్ రూమ్ లో నీళ్లు రాలేదు ఎవరినైనా అడుగు అని అంటాడు. ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. నేను నీళ్లు తీసుకు రాను అంటుంది. నువ్వు నీళ్లు తీసుకురాకుంటే నేను ఇలానే ఉంటాను అని చెప్పి కమల్ వెళ్ళిపోతాడు.. దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో పల్లవి శ్రీకర్ ను కమల్ బావ అని కౌగిలించుకుంటుంది. పల్లవి నేను కమల్ ను కాదు శ్రీకర్ అని చెప్తాడు. పల్లవి పెద్ద డ్రామా ను ప్లే చేస్తుంది. దాంతో ఇంట్లో అందరు వస్తారు. మామయ్య శ్రీకర్ ను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేస్తాడు.. రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×