BigTV English

Festival Season shopping : డబ్బులు ఊరికే రావ్.. పండుగ సేల్‌లో ఇవి పాటిస్తే మీ డబ్బులు సేఫ్!

Festival Season shopping : డబ్బులు ఊరికే రావ్.. పండుగ సేల్‌లో ఇవి పాటిస్తే మీ డబ్బులు సేఫ్!

Festival Season shopping : పండగలు వచ్చాయంటే ఏదో ఒకటి కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకే స్థానిక షోరూంల నుంచి ఇ-కామర్స్‌ సంస్థల వరకూ రాయితీలు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ సమయంలో వినియోగదారులు కాస్త ప్రణాళికతోనూ వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సంపాదించిన మొత్తం ఖర్చు చేయడం కరెక్ట్ కాదు.. అలాగని కొనుగోళ్లు చేయకుండానూ ఉండలేం. కాబట్టి పండగలను ఉత్సాహంగా జరుపుకుంటూనే దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సని గుర్తుపెట్టుకోవాలి. వేడుకలు, పండగల వేళ ఆర్థిక ఒత్తిడిని వీలైనంత వరకు నివారించుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడే అది మీ దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపకుండా ఉంటుంది.


బడ్జెట్‌ వేసుకోండి – ముందుగా పండగ ఖర్చుల నిర్వహణలో భాగంగా మీ బడ్జెట్‌ ఎంతో చూసుకోవాలి. అంటే మీ దగ్గర ఎంత ఉంది? అందులో మీరు ఎంత ఖర్చు చేయగలరో నిర్ణయించుకోవాలి. అనంతరం కొత్త దుస్తులు నుంచి ఆభరణాలు, ఎలక్ర్రానిక్ ఐటెమ్స్​, స్మార్ట్ ఫోన్స్​.. ఇలా ఏం కొనాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. తొందరపడి ఏది ఆఫర్​లో దొరికితే అది కొనుగులు చేయకూడదు. ఇదే సమయంలో కొందరికి గిఫ్ట్​ కూడా ఇవ్వాల్సి రావచ్చు. లేదంటే మొత్తం కుటుంబ సభ్యులు ఒకేచోటకు చేరడంతో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందుకే లెక్కలు వేసుకుని ప్రాధాన్య క్రమంలో ఉన్న దాంట్లో భారం అవ్వకుండా ఖర్చు చేయాలి.

నియంత్రణలో ఉండండి – ఒకసారి ఎంత ఖర్చు చేయాలని బడ్జెట్‌ వేసుకుంటే, దానికి కట్టుబడి ఉండాలి. ఆ సమాయనికి ఉత్సాహంగా ఎంత పడితే అంత ఖర్చు చేసేసి, ఆ తర్వాత అయ్యో ఆర్థికంగా చిక్కుల్లో పడిపోయామే అని బాధపడకూడదు. అలానే కొనుగోళ్లకు సాధ్యమైనంత వరకు నగదు లేదా డెబిట్‌ కార్డునే ఉపయోగించడం మంచిది. అప్పుడు ఖర్చుల నియంత్రణ కొంత వరకు మెయిన్​టెయిన్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అది మనకు ఎంత వరకు అవసరం అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే కొనుగోలు చేయండి.


అలా చేయడం సరికాదు – ఈ పండగ సేల్స్ ​లో భాగంగా గోల్డ్​ ఆర్నమెంట్స్​, ఎలక్ట్రానికి ఐటెమ్స్ పై డిస్కౌంట్లు వస్తుంటాయి. అవి చూసి అప్పటికప్పుడు మన దగ్గర ఉన్న అత్యవసర నిధిని వాడుకోవడం లేదా రుణాలు తీసుకోవడంలాంటివి సరికాదు. పైగా వాటికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. కాబట్టి ఇలాంటివి కొనాలని అనుకుంటే ముందు నుంచే దాని కోసం వేరుగా డబ్బులు దాచుకోండి. ఆ డబ్బులతోనే సరైన సమయం చూసి, ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నప్పుడు కొనుగోలు చేయండి.

ALSO READ : ఐఫోన్ కొంటున్నారా? మరి అది ఒరిజినలా? ఫేకా.. అనేది ఇలా కనిపెట్టేయండి

కార్డులతో జాగ్రత్తగా ఉండండి – పండగల సీజన్​లలో ఆఫర్లకు, ఫ్రీ కాస్ట్, క్యాష్​ బ్యాక్​ వంటి వాటికి టెంప్ట్​ అయ్యి క్రెడిట్​ కార్డులను తెగ వాడేస్తుంటారు. అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకూ వినియోగించకుండా ఉండండి. అత్యవసరమైన వస్తువుల కొనుగోలుకే క్రెడిట్‌ కార్డును వినియోగించుకోవాలి. వెంటనే ఆ బిల్లును చెల్లించేలా సిద్ధంగా ఉండాలి.

రుణాలు వద్దు – ఒక్కోసారి పెద్ద మొత్తంలో పెట్టి కొనుగోలు చేయడానికి వీలుగా డిజిటల్‌ లోన్స్​ అందించే యాప్స్​, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మనల్ని తెగ ఊరిస్తుంటాయి. క్షణాల్లో రుణాలను ఇచ్చేస్తాం అని వెంటపడి మరీ చెబుతుంటాయి. అలాంటి వాటి నుంచి అప్పు చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల దీర్ఘకాలంలో వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. కట్టకపోతే మెడపై కత్తిలా వచ్చి కూర్చుంటాయి. పైగా పర్సనల్ లోన్ పై కూడా ఎక్కువ వడ్డీలు కూడా పడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ నెలనెలా వాయిదాలు చెల్లిస్తుండటం వల్ల, మీ ఇతర లక్ష్యాలపైన కూడా ప్రభావం పడుతుంది. ఏదిఏమైనా పండగల వేళ విజయవంతమైన ఆర్థిక ప్రణాళికను అమలు చేస్తేనే, ఆ తర్వాత ఆర్థికంగా చిక్కుల్లో పడకుండా ఉంటాము.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×