Intinti Ramayanam Today Episode April 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆఫీస్ కి వస్తుంది ఫ్లవర్ డెకరేషన్ కోసం వస్తుందా లేక అక్షయ మనసులో ప్రేమను సంపాదించడం కోసం వస్తుందని అవని వెనకాలే ఫాలో అవుతూ ఆఫీస్ లోపలికి వస్తుంది. అక్కడ అవని అందరితో సరదాగా మాట్లాడి అక్షయ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్షయ్ రాగానే మీతో నేను కొంచెం మాట్లాడాలని అడుగుతుంది. ఏం మాట్లాడాలి అంటే అవని తన బ్యాగులోంచి ఒక పేపర్ తీయబోతుంది. అప్పుడే అక్షయ అవనీల ఫోటో బయటపడుతుంది. అది చూసిన అక్షయ్ కోపంతో ఊగిపోతాడు. దృశ్యాన్ని పల్లవి చూసి సంతోషపడతుంది.. బయటకు రాగానే అవనీని చూసి అక్క చూసావా బావగారు నీ మీద ఎంత కోపంగా ఉన్నారో.. అదే ఇప్పుడు నిన్ను దూరంగా ఉండేలా చేసింది.. బావగారు మనసులో నువ్వు లేవని తెలిసిపోయింది. ఇంత అవ్వడానికి కారణం నేనే అని నీకు తెలుసు కానీ నువ్వు ఏమి చేయలేవు. త్వరలోనే నిన్ను బావగారిని విడగొట్టేసి బావగారి చేత విడాకులు ఇప్పించి మరో పెళ్లి చేయిస్తాను నా నెక్స్ట్ టార్గెట్ అదే అని పల్లవి అవనికి వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి చక్రధర తో మాట్లాడడానికి బయటకు వస్తుంది. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. చక్రధర్ రాగానే తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఇంట్లో జరిగినా గొడవల గురించి వివరిస్తుంది. ఏంటమ్మా పల్లవి నేను లేను కదా అనేసి నాకు ఏ విషయం చెప్పలేదు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని చక్రధర అడుగుతాడు. ప్రణతికి పెళ్లి సంబంధం చూశారు డాడ్. అబ్బాయి లండన్ లో ఉండడంవల్ల అంతా రెండు మూడు రోజుల్లోనే ఎంగేజ్మెంట్ పెళ్లి కార్యక్రమాలు పెట్టుకున్నారు. కానీ ప్రణతికి ఆ పెళ్లి ఇష్టం లేదు తను ఎవరినో ప్రేమించానని ఇంట్లో లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. ఇంకో విషయం ఏంటంటే తను పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అని తన తండ్రికి అసలు విషయాన్ని చెప్తుంది పల్లవి.
ఆ ప్రణతి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా భరత్ ని. ఇంకా భరత్ రాడు వాళ్ళమ్మని భరత్ నీ చంపేయించానని అన్నారు. కానీ అబ్బాయిల బ్రతికి బయటపడ్డాడు అని అడుగుతుంది. అది నాకు అర్థం కావట్లేదు అమ్మ ఆ భరత్ పని నేను చూసుకుంటాను నువ్వేం బాధపడకు అని పల్లవిని ఇంటికి పంపిస్తాడు. ఆరాధ్య స్కూల్లో దేవుడు కళ్యాణం జరిపించలేదని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అవని అక్కడికి వస్తుంది చూడమ్మా నా ఫ్రెండ్స్ అందరూ దేవుడి కళ్యాణి జరిపిస్తున్నారు నువ్వు లేవు కదా కళ్యాణం జరిపించరా అమ్మ నువ్వు నాన్న కలిసి కల్యాణం జరిపించండి అని అడుగుతుంది.
దానికి అవని నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అలానే మనం కళ్యాణి జరిపిద్దాం అనేసి అడుగుతుంది. అవని గుడికి వెళ్లి పంతులు గారితో ఆ విషయాన్ని చెప్తుంది. నేను నా కుటుంబం అందరిని తీసుకొస్తాను కల్యాణం ఎప్పటిలాగే జరిపిద్దాం పంతులుగారు అని అంటుంది. తర్వాత భానుమతి తన భర్త కోసం ఆలోచిస్తూ ఉంటుంది. దాదాపు కమల్ ప్లాన్ బయటపడినట్లు కనిపిస్తుంది. మొత్తానికి తెలివిగా కమల్ తప్పించుకుంటాడు..
శ్రియ పల్లవి రాదని పంతులు గారు వచ్చారు కళ్యాణం జరిపించడానికి వీల్లేదని అత్తయ్య గారు అన్నారు. అవన్నీ రావడానికి ఇష్టం లేకే అత్తయ్య గారు అలా అన్నారని చెప్తుంది. ఇక అవని ఎట్టి పరిస్థితులను ఈ ఇంటికి రాదు నువ్వేం కంగారు పడకు శ్రీయా అని పల్లవి అంటుంది. ఇక పల్లవి అవని శాశ్వతంగా దూరమైపోయింది. అత్తయ్య గారిని నేను అలా మార్చేశాను. నా మాటకల ఆమె అలవాటైపోయింది. అదే మాటని నమ్మేసి అవని ఎట్టి పరిస్థితులను ఇంటికి తీసుకురాదు అని మురిసిపోతూ ఉంటుంది.
అప్పుడే పల్లవికి అవని ఫోన్ చేస్తుంది. నీతో అర్జెంటుగా మాట్లాడాలి రావాలని అడుగుతుంది. ఇంట్లో ఆమె ముద్దుల మరుగులు ఉన్నారు కదా కళ్యాణం జరిపించలేదన్న విషయాన్ని అవినీతి చెప్పినట్టున్నారు. ఇప్పుడు నాతో కాలభైరానికి వచ్చినట్లుంది. నేను అస్సలు ఒప్పుకోకూడదు నాకే వార్నింగ్ ఇస్తుందా? నన్నే కొడుతుందా? చెప్తాను అవని సంగతిని పల్లవి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవికి ఏదో చూపించి అవని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.. రేపు ఎపిసోడ్ బాగుంటుంది.