Intinti Ramayanam Today Episode December 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ పై పల్లవి ప్రేమను వలకబోస్తుంది. ఇంట్లో నా ఆటలు సాగాలంటే దీన్ని మచ్చిక చేసుకోవాలని అనుకుంటుంది పల్లవి. నేనెప్పుడూ నీ దగ్గరికి వచ్చినా కోప్పడతావు చిరాకు పడతావు నేను మాట్లాడాలన్నా విసుక్కుంటావ్ కానీ ఇప్పుడు నీలో ఇంత మార్పు ఏంటి పల్లవి ఇదంతా అనేసి కమల్ ఆశ్చర్యపోతాడు. నువ్వంటే ప్రేమ లేదని నీకు ఎవరు చెప్పారు నువ్వంటే ప్రేమ ఉంది బావ లేకపోతే నువ్వు కట్టిన తాళిని నేను ఎందుకు ఉంచుకుంటాను తీసి పడేయకుండా అనేసి అంటుంది. నువ్వు చేసే పనులే నాకు నచ్చవు అందుకే నేను దూరం పెడుతున్నాను లేకున్నా అంటే నిన్ను ఎందుకు దూరం పెడతాను బావ అనేసి అంటుంది. పల్లవిలో ఇంత మార్పు నేను అసలు ఊహించలేదు అనేసి కమల్ మనసులో అనుకొని సంబరపడిపోతాడు. ఉదయం పూజ కోసం అవని అన్ని సిద్ధం చేస్తుంది. పల్లవి కూడా ఉదయాన్నే లేచి రెడీ అయ్యి పూజ దగ్గరికి వస్తుంది. భానుమతి చూసి ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చావు నువ్వు అసలే కడుపుతో ఉన్న దానివి ఇంత పొద్దున్నే లేవడం అవసరమానేసి అంటుంది. ఆవనేని పూజ చేస్తుందని అందరూ నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు. చేసే పూజ వల్ల ఇంటికి మంచి జరిగితే ఇంకేమైనా ఉందా ఆమెకే ఏకంగా పూజలు చేస్తారు నిద్ర ఎలా పడుతుందమ్మ అనేసి పల్లవి అంటుంది. ఇక నెయ్యిని నేలపాలు చేస్తుంది పల్లవి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి చెప్పినట్లు పల్లవి అందరికీ కాఫీ చేయడానికి లోపలికి వెళుతుంది. అక్కడ నెయ్యి కుండ ఉండడం చూసి మనకి కావాల్సిన నెయ్యి ఈ నెయ్యిని ఎలాగైనా పాడు చేస్తే హోమం ఆగిపోతుందని ఆ కుండకు హోల్ పెడుతుంది. ఇక అందరికీ కాఫీ ఇస్తుంది. అక్షయ్ రాజేంద్రప్రసాద్ అక్కడికి వస్తారు. స్వామీజీ వస్తే పూజకి అవి ఇవి లేవంటే కోప్పడతారు మరి అన్ని ఉన్నాయో లేదో ఒకసారి లిస్టులో చెక్ చేస్తే బెటర్ కదా అనేసి అంటాడు. లిస్ట్ ప్రకారం అన్ని చదువుతాడు అయితే ఆవు నెయ్యి అక్కడ లేదని అనగానే అవని నేను వెళ్లి తీసుకొని వస్తాను లోపలికి పెట్టాను అనేసి అంటుంది. ఇక లోపలికి వెళ్లి చూడగానే నెయ్యికుండకు హోల్ పడి కారుతూ ఉంటుంది. బయటికి వచ్చి నెయ్యకుండా హోల్ పడి కారుతూ ఉంది. ఏం చేయాలి అనేసి అడుగుతుంది. పొద్దున్నే నెయ్యి దొరకదు కదా అండి ఏం చేయమంటారు అని పార్వతి అంటుంది. కంగారు పడకండి అత్తయ్య నేను వెళ్లి ఎలాగోలాగా తీసుకొని వస్తాను అనేసి అవని అంటుంది. నావల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటా అనేసి అవని నెయ్యి కోసం బయటకు వెళ్తాను అంటుంది. కమల్ నేను కూడా తోడుగా వస్తాను వదిన అనేసి అంటాడు. వద్దులే కన్నయ్య నేను వెళ్లేసి వస్తాను అని అవని అంటుంది. భానుమతి మాత్రం కోపంతో అందరిపై అరుస్తుంది. ఏ దానిమీద దృష్టి పెట్టదు కానీ మీరు నెత్తినెక్కి కూర్చోబెట్టుకున్నారు అందుకే ఇలా శ్రద్ధ లేకుండా చేస్తుంది అనేసి అందరి ముందర అవనిని తిడుతుంది. అటు అక్షయ్ కూడా నాకు ఆఫీస్ కి బాక్స్ కట్టినప్పుడే తెలిసింది అవని ఇలా చేస్తుంది అనేసి కానీ మీరు ఎవరు నమ్మలేదు అని అవని పై కోప్పడతాడు.
ఇక నెయ్యి కోసం బయటకు వెళ్తుంది. నెయ్యి తీసుకుని రిటర్న్ వస్తుంటే వెనకలో ఒక ఆవిడ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందని అవని అనుకుంటుంది. అది గమనిస్తూ అవని ముందుకు వెళుతుంది. మళ్లీ వెనకాల ఒక ఆవిడ ఫాలో అవుతుంది. అది చూసిన అవని ఆవిడ దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావ్ అని అడుగుతుంది. ఆమె తన జేబులో ఉన్న మత్తుమందు స్ప్రే ని అవని మొహం మీద కొడుతుంది. అవని ఎవరు నువ్వు ఏం కొట్టావు నాకు అంటూ స్పృహ తప్పి పడిపోతుంది. ఇక పల్లవి ప్లాన్ సక్సెస్ అయిందని ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది. ఈ హోమం జరగకూడదని అనుకున్నాను అనుకున్నట్టే సక్సెస్ అయింది ఇక ఇంట్లో జరిగే రణరంగం గురించి చూడాలి అని సంతోషపడుతుంది. స్వామీజీ వచ్చే టైం అయింది ఇంకా అవన్నీ రాలేదు అనేసి పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకెక్కడ వస్తుంది మీరు చేసిన పనికి ఆవిడ గారు ఎక్కడికో వెళ్ళింది అనేసి భానుమతి అవని తిడుతూనే ఉంటుంది. అప్పుడే స్వామీజీ వస్తాడు. పూజకర్ని సిద్ధం చేసినట్టున్నారు మరి పూజకు కావలసిన నెయ్యి అన్ని సిద్ధం చేశారా అని రాజేంద్రప్రసాద్ ని అడుగుతాడు. నెయ్యి నేలపాలు అయింది గురువుగారు అవని తీసుకురావడానికి వెళ్ళింది అనేసి అనగానే స్వామీజీ కోప్పడతాడు. నేను అన్ని సిద్ధం చేసుకోమని చెప్పాను కదా మరి ఎందుకు మీరు ఇలా చేశారు అనేసి అడుగుతాడు.
అప్పుడే చక్రధర్ రాజేశ్వరిలు వస్తారు. భానుమతి ఆ డబ్బా ఏంటి అల్లుడుగారు అని అడుగుతుంది. ఆవు నెయ్యి అత్తయ్య గారు పల్లవి ఫోన్ చేసింది ఆవు నెయ్యి ఒలిగిపోయిందని. అవని నెయ్యి కోసం వెళ్లిందని చెప్పింది ఇంత పొద్దున్నే నెయ్యి దొరుకుతుందో లేదో అని మా ఇంట్లో ఉన్న నెయ్యిని తీసుకొని వచ్చాము అనేసి రాజేశ్వరి అంటుంది. అక్షయ్ అవనీలు ఇద్దరు పూజ చేస్తారని అందరూ అంటున్నా పూజ చేసే టైం అయిపోయింది అనేసి స్వామీజీ వెళ్ళిపోతాడు. ఇక అందరూ అవని ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. స్పృహ తప్పి పడిపోయిన అవనిని చూసి అక్కడ జనం ఎవరివిడా అని మాట్లాడుకుంటారు. అసలు ఎందుకు ఇక్కడ పడిపోయిందని మొహం మీద నీళ్లు కొట్టి లేపుతారు. ఏందమ్మా ఇక్కడ పడుకున్నావనేసి ఒక ఆవిడ అడుగుతుంది. నేను వెళ్తూ ఉన్నానండి ఒక ఆవిడ మత్తుమందు స్ప్రే కొట్టింది నేను కళ్ళు తిరిగి పడిపోయాను అనేసి అంటుంది. ఎక్కువగా తిరగడం వల్ల నేను ఒంటి మీద నా నగల్ని తీసుకోకుండా వెళ్లిపోయినట్టుంది అనేసి ఆవిడ అంటుంది. ఎంత అయిందని అవని అడగగానే 9 అయింది అని అంటుంది. ఇంట్లో పూజ ఉంది అనేసి పరుగున ఇంటికి వచ్చేస్తుంది.
ఇక భానుమతి కోపానికి కట్టలు తెంచుకుంటుంది. ఇంట్లో అందరూ ఏమైందమ్మా ఇలా చేసావు అనేసి అడుగుతారు. దానికి ఎవరి ఎవరో ఒక ఆవిడ నామీద మత్తుమందు స్ప్రే కొట్టింది నేను కళ్ళు తిరిగి పడిపోయాను అక్కడున్న వాళ్ళు నగల కోసమే ఇలా చేసిందని అంటున్నారు . లేట్ అయింది అని అవని చెప్పగానే అందరూ అవని ఎలా ఉంది అని అడుగుతారు.. ఇక రాజేశ్వరి, చక్రధర్లు మేము వెళ్ళొస్తామని వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ వెళ్లిపోతారు. అక్షయ్ మనసులో అనుమానం ఇంకా రెట్టింపు అవుతుంది.. అవని అక్షయ్ దగ్గరకొచ్చి నిజంగానే లేట్ అయిందండి నేను కావాలని చేయలేదు అని అనగానే నువ్వు ఎన్నిసార్లు చెప్తావు నీ సొంత పనులు చేసుకుని వస్తున్నావు కదా అనేసి దారుణంగా మాట్లాడుతాడు. ఒకప్పుడు నువ్వు చెప్తే ఏదైనా నమ్మాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ఏముంది ఏ ఎలా నమ్మాలి అని అనిపిస్తుంది అని అక్షయ్ అవనితో అంటాడు. దానికి అవని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఇదంతా పల్లవి ప్లాన్ అని అవని తెలుసుకుంటుంది. పల్లవి మనసులోని కుట్ర బయటపడుతుంది.. రేపు ఏం జరుగుతుందో చూడాలి..