Bitcoin Hits All Time High: క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ దూకుడు మీదుంది. మార్కెట్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బిట్‌కాయిన్ విలువ తొలిసారి లక్ష డాలర్లు మార్క్‌ని టచ్ చేసింది. అయితే బిట్ కాయిన్ విలువ పెరగడం వెనుక అసలేం జరుగుతోంది. ఎవరైనా పెంపుకు ప్రయత్నిస్తున్నారా? ఇవే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బిట్‌కాయిన్ విలువ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేవలం నాలుగు వారాల్లో 45 శాతం దాని విలువ పెరగడంతో మార్కెట్ నిఫుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తామని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన గంటల వ్యవధిల్లో ఇది లక్ష డాలర్ల మార్క్‌ని టచ్ చేసింది. ఒకానొక దశలో లక్షా 500 పై సూచీ కదలాడుతూ వచ్చింది.
బిట్‌కాయిన్ స్పీడ్ వెనుక మస్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ సామర్థ్యం కట్టబెట్టడమే కారణమన్నది మడ్ రెక్స్ సీఈఓ మాట. దీనికితోడు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఛైర్మన్‌గా పాల్ అట్కిన్‌కు ట్రంప్ బాధ్యతలు అప్పగించారు.
ALSO READ: బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా..? నేడు బంగారం ధరలు ఇవే..!
క్రిప్టో కరెన్సీకి అనుగుణంగా పాలసీలు వస్తాయన్న అంచనాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో విలువ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో కూడా పాల్ అట్కిన్ ఎస్ఈసీ బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ట్రంప్ మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించడం విశేషం. రెండేళ్ల కిందట బిట్‌కాయిన్ విలువ 17 వేలు ఉండేది. అమెరికా ఎన్నికల రోజు బిట్ కాయిన్ విలువ 69,374 డాలర్లుగా ఉండేది. ఇప్పుడు లక్ష డాలర్లను దాటేసింది. అమాంతంగా బిట్‌కాయిన్ విలువ పెరగడంపై రకరకాలుగా చెబుతున్నారు విశ్లేషకులు.
లక్ష డాలర్లు దాటడం మైలురాయి కంటే ఎక్కువని అంటున్నారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయాలు, ఊగిసలాడుతున్న ఫైనాన్స్, టెక్నాలజీ విభాగాలకు ఇదొక నిదర్శనంగా పేర్కొన్నారు హాంకాంగ్‌కు చెందిన ఓ క్రిప్టో విశ్లేషకుడు.