SI Harish suicide case: ములుగు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఓ యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
ఎస్ఐ హరీష్ సూసైడ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఏడు నెలల కిందట ఎస్ఐ హరీష్‌కు ఓ యువతి ఫోన్ చేసింది. యువతి ఎందుకు ఫోన్ చేసిందనేది పక్కనబెడితే.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటా మాటా కలిసింది. చివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకునే వరకు వెళ్లింది.
హైదరాబాద్‌లో చదువుకునే సమయంలో వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి వెళ్లేది ఆ యువతి. ఈ క్రమంలో హరీష్-ఆ యువతి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకోగానీ
ఆ పోలీశాయనకు డౌట్ వచ్చింది.
ఆమె గురించి ఎవరికీ తెలీకుండా ఆరా తీయడం మొదలుపెట్టాడు. హరీష్ ఎంక్వైరీలో ఒక్కో విషయం బయటపడేది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి ఊర్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో క్లోజ్‌గా ఉండేది. ఒకరు పెళ్లికి నిరాకరించడం తో చిలుకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ALSO READ: టీనేజర్‌పై గ్యాంగ్ రేప్.. సవతి తల్లే డబ్బులు తీసుకొని..
ఈ విషయం ఎస్ఐ హరీష్ కు తెలిసింది. ఇంకా చాలా విషయాలే యువతి గురించి తెలిసినట్టు సమాచారం. దీంతో హరీశ్.. ఆ యువతితో పెళ్లికి ఒప్పుకోలేదు. అదే విషయం ఆమెకు చెప్పడంతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వెళ్లారు.
రిసార్టులో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ యువతి వదిలించుకోవాలని హరీష్ తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కానీ యువతి ససేమిరా అంగీకరించలేదు. మన వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు చెబుతానని బెదిరించడంతో మనస్తాపానికి గురయ్యాడు హరీష్.
ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు తల్లిదండ్రులు. తమ కొడుకు మృతికి ఆ యువతే కారణమంటూ హరీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.