E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఇంట్లో  నుంచి వెళ్లిపోతున్న శ్రీకర్.. రాజేంద్రకు అక్షయ్ క్షమాపణలు..

Intinti Ramayanam Today Episode: ఇంట్లో  నుంచి వెళ్లిపోతున్న శ్రీకర్.. రాజేంద్రకు అక్షయ్ క్షమాపణలు..
Advertisement

Intinti Ramayanam Today Episode December 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీకర్ శ్రీయ ఇద్దరు కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి గదిలోనే మందు పార్టీ చేసుకోవడం పై అవని సీరియస్ అవుతుంది. ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు అన్న సంగతి కూడా తెలియకుండానే మీరు ఇలాంటి చేస్తారని అస్సలు ఊహించలేదు అని అరుస్తుంది.. దానికి శ్రియ మేమేమన్నా మీ గదిలోకి వచ్చి తాగుతున్నామా మా గదిలో మేమే కదా తాగుతున్నాం ఎందుకు మీరు మాదే తప్పు అని అడుగుతారు అని అంటుంది. శ్రియ మాటకు మాట సమాధానం చెప్పడంతో అవనీ సీరియస్ అవుతుంది.. ఒకవైపు మామయ్య అత్తయ్య బాగోలేదని పడుకున్నారు వాళ్ల గురించి ఆలోచించకుండా నువ్విలా తాగుతున్నావా కొంచెం కూడా సిగ్గు లేదా అనేసి అంటుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఏంటి ఏం జరుగుతుంది అని రాజేంద్రప్రసాద్ అడుగుతారు.. పార్టీ పేరుతో ఇంట్లోనే మందు తాగుతున్నారు నాన్న అని కమల్ అంటాడు.. ఆ మాట వినగానే ఏంటి ఇలా తయారయ్యారు కొంచెం కూడా బుద్ధి లేకుండా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. మేమేమి బుద్ధిలేని పనేమి చేయట్లేదు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం బుద్ధిలేని పనా అని శ్రీయా అంటుంది.. శ్రీయా, శ్రీకర్ తాగడంతో ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. రాజేంద్రప్రసాద్ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే మనశ్శాంతి లేదమ్మా అనేసి అంటాడు.. ఇవన్నీ కాదు వీళ్ల వల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. ఆర్డర్ అని డెలివరీ బాయ్ వస్తాడు. ఎవరు డెలివరీ చేశారు.. ఏం ఆర్డర్ చేశారు అని అవని అడుగుతుంది.. మీరు రాత్రి మాతో గొడవ పెట్టుకుని తినకుండా చేశారు కదా.. అందుకే నాకోసం శ్రీకర్ టిఫిన్ ఆర్డర్ చేశాడు అని శ్రీయ అంటుంది.. ఇంట్లో అందరం కలిసి తింటున్నాం కదా మళ్లీ కొత్తగా ఇదేంటి అని పార్వతి అంటుంది. నాకు కావాలంటే నేను చేసి పెడతాను కదా నువ్వెందుకు టిఫిన్ ఆర్డర్ చేసుకున్నావు అని పార్వతి అడుగుతుంది. జైల్లో అయినా ఖైదీకి నచ్చితేనే తింటాడు. లేకపోతే తినడు అలాంటిది మీ అమ్మ నిన్ను అడుగుతుంది చూసావా శ్రీ అని కావాలని రెచ్చగొడుతుంది శ్రియ. మొత్తానికి ఇంట్లో వాళ్ళందరి కోపానికి శ్రీయ శ్రీకర్ కారణమవుతారు.. ఇంట్లో ఇన్ని అవమానాలు భరిస్తూ ఉండాల్సిన అవసరం మనకు లేదు అని శ్రీకర్ అంటాడు.

Advertisement

శ్రియ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆస్తి రాకుండా అయిపోతుంది ఆస్తి కోసమైనా ఇక్కడే ఉండాలి అని వెంటనే ప్లేట్ మార్చేస్తుంది. అయినా మనల్ని ఎవరన్నారు మీ అమ్మానాన్ననే కదా మనం తప్పు చేశామని వాళ్ళు అన్నారు అందుకే బాధపడాల్సిన అవసరమేంటి ఇకనుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు అని శ్రియ అంటుంది. ఊరుకున్నాం కదా అని వీళ్ళు ఎన్ని మాట్లాడిన పడాల్సిన అవసరం నాకు లేదు పద వెళ్లిపోదామని శ్రీకర్ అంటాడు. కానీ శ్రియ మాత్రం ఆస్తి వచ్చేంతవరకు ఎలాగైనా సరే ఇక్కడే ఉండాలి అని అనుకుంటుంది.

లోపలికి కోపంగా వెళ్ళిన శ్రీకర్ తన బ్యాగ్ ని సర్దుకుంటూ ఉంటాడు.. ఈయన గారేంది బ్యాగ్ సర్దుతున్నాడు ఇకనుంచి వెళ్ళిపోతే ఆస్తి మన చేతికి రాదు కదా.. ఎలాగైనా సరే శ్రీకర్ని కూల్ చేసి ఆస్తి వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి అని అనుకుంటుంది. ఈ విషయాలు శ్రీకర్ కూడా చెప్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆస్తి మనకు రాకుండా పోతుంది.. ముందు సీరియస్ అవ్వకుండా నేను చెప్పేది విను.. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనకు రావాల్సిన ఆస్తి కూడా మనకు దక్కకుండా పోతుంది.. కొంచెం నిదానంగా ఆలోచించు కోట్ల ఆస్తిని ఎలా వదిలేసుకుంటాము అని శ్రీయా అంటుంది.

Advertisement

ఆస్తికోసం వీళ్ళు ఎవరని ఏమన్నా కూడా ఇక్కడే పడిండాలా నేను వెళ్తున్నాను నువ్వు వస్తావా రావా అని అడుగుతాడు. ఈ ఆస్తి లేకపోతే మనం బ్రతకలేమా ఏంటి అని శ్రీకర్ అంటుంటే శ్రియ మాత్రం ఊరికే వచ్చే కోట్ల ఆస్తిని ఎందుకు కాదనుకోవాలి కొద్దిశ్రియ మాత్రం ఊరికే వచ్చే కోట్ల ఆస్తిని ఎందుకు కాదనుకోవాలి కొద్ది రోజులు ఉందాం. ఆస్తి రాగానే వెళ్ళిపోదాం అని కూల్ చేస్తుంది.. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ బాధపడుతూ ఉంటే పార్వతి అక్కడికి వెళుతుంది. ఏవండీ బీపీ టాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంది. ఒకప్పుడు ఒక్క టాబ్లెట్ మాత్రమే వేసుకునే వాడిని ఇప్పుడున్న టెన్షన్లకి రోజుకి మూడు పైన అయ్యాయి ఎన్ని వేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది పార్వతి అని అంటాడు.

Also Read: శ్రీవల్లికి వరుస షాక్ లు.. భాగ్యం ఏం ప్లాన్ చేస్తుంది..? ఇదే ఎపిసోడ్ లో అసలు ట్విస్ట్..

అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ అవని రాజేంద్రప్రసాద్ ని టెన్షన్ పడొద్దు అని అంటారు. వాళ్లని అనడం నా తప్పే వాళ్లు చిన్నవాళ్ళు కాబట్టి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని అక్షయ్అం టారు. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు లేరా నువ్వేం బాధపడకు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. మిమ్మల్ని అంత మాట అని లోపల నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే అనేసాను నాన్న నన్ను క్షమించండి అని అంటాడు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అంటాడు. తర్వాత రోజు ఉదయం మీనాక్షి పోలీసులతో పాటు దిగుతుంది. అది చూసిన అందరూ షాక్ అవుతారు. ఏంటమ్మా నువ్వు పోలీసులతో పాటు వచ్చావ్ ఏంటి అని అవని అడుగుతుంది. ఒక దొంగ బ్యాగులు తెచ్చి మీ అమ్మ చేతిలో పెట్టాడు ఆ తర్వాత వాడి వెళ్ళిపోయాడు. ఆ దొంగకు మీ అమ్మకు ఏదో సంబంధం ఉందని మా అనుమానం అందుకే ఇక్కడికి వచ్చాము మీ ఐడి కార్డులు చూపించండి అని అడుగుతారు. అక్కడితో ప్రోమ్ ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×