Intinti Ramayanam Today Episode February 20 th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన పల్లవి వీడు బాధపడతాం చూసి అత్తయ్య అవనిని తీసుకొని వస్తుంది ఎలాగైనా విరిద్దరిని దూరం చేయాలి అవని మళ్లీ ఇంటికి రాకుండా చేయాలి అని అత్తయ్య ను రెచ్చగొడితేనే ఆ పని జరుగుతుందని పల్లవి అనుకుంటుంది. ఇక పార్వతి దగ్గరికి వెళ్లి పల్లవి బావగారు చాలా బాధపడుతున్నారు అత్తయ్య ఆయన బాధని చూడలేకపోతున్నాను ఈ బాధ తగ్గిపోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అత్తయ్య అనేసి అంటుంది.. దానికి పార్వతి అక్షయ బాధని నిజంగానే చూడలేకపోతున్నాను అవని గురించి మర్చిపోవాలంటే అక్షయ జీవితంలోకి మరొక రావాలని ఆలోచిస్తుంది.. అక్షయ బావ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని పల్లవి అడుగుతుంది. ఈ బాధ నుంచి బయట పడాలంటే అక్షయ జీవితంలోకి మరో అమ్మాయి రావాల్సిందని అంటుంది. మనసులో ఉన్న మాట కూడా అదే అత్తయ్య మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి నేను చేస్తాను అని పల్లవి అంటుంది. అక్షయ్కి మరో పెళ్లి చేస్తే ఇల్లంతా గుల్ల గుల్ల అవుతుంది ఇక అవని పీడ వదిలిపోతుంది అని సంతోషంతో పల్లవి డాన్స్ వేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఇంటికి రాగానే సంతోషంగా స్వరాజ్యం దయాకర్ కి స్వీట్లు ఇవ్వాలని అనుకుంటుంది. అయితే అవని సంతోషాన్ని చూసి వాళ్ళు బాధపడతారు ఏమైంది ఎలా ఉన్నారు? ఒక స్వీట్ తింటే ఏం కాదులే అనే సన్నగాని నువ్వు మా కోసం స్వీట్ తీసుకొచ్చావ్ కానీ నీకు మేము చేదు వార్తలు చెప్పాల్సి వస్తుంది అని స్వరాజ్యం అంటుంది. ఏమైంది పిన్ని అంటే నీకు మీ ఆయన విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడని అంటుంది. అది చూసి షాక్ అయినా అవని పరిగెత్తుకుంటూ వాళ్ళింటికి వెళ్తుంది. అటు శ్రీయా కోమలి ఇద్దరూ మీ ఆయన మా ఆయన ఎక్కడికి వెళ్లారని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అవని అక్కడికి వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ అని కోమలి అంటుంది. ఇంట్లో కొన్ని విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటి గురించి మాట్లాడాలి ఇంట్లో పెద్దవాళ్ళు అని పిలుస్తామని అడుగుతుంది.
ఇక కోమలి పార్వతి భానుమతిలను పిలుస్తుంది. మళ్లీ ఎందుకు వచ్చావు అని పార్వతి అడుగుతుంది. అది తెలుసుకున్న నాకు మా ఆయన విడాకులు నోటీసు పంపించారు దాని వెనక మీ హస్తం ఉంటుంది అయితే ఆ విడాకులు నోటీసు పంపించడానికి మీరే కారణం అని నాకు తెలుసు అసలు నేను చేసిన తప్పేంటి అని పార్వతిని అవని అడుగుతుంది. నా కొడుకు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఆ విడాకులు పేపర్ మీద సంతకాలు పెట్టాల్సిందే అని పార్వతి అడుగుతుంది. నా కొడుకు కాపురం చేయడు అని పార్వతి అంటుంది.. ఆస్తి లాక్కోవాలని అనుకున్న దాంతో నా ఇంట్లో సంబంధం లేదని పార్వతి అరుస్తుంది. ఇక భానుమతి కూడా విడాకులు ఇచ్చేస్తే నా మనవడు సంతోషంగా ఉంటాడు కదా అనేసి అంటుంది. నేను విడాకులను సంతకం పెడతాను మరి నా కూతురు పరిస్థితి ఏంటి అనేసి అడుగుతారు. నా కూతురు బాధపడాలా.. తండ్రికి దూరం అయిపోవాలా అని అడుగుతుంది.. నా బిడ్డని అనాధం చేయాలని నేను అనుకోవట్లేదు తండ్రికి దూరమైతే నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది కదా అనేసి అడుగుతుంది. దానికి భానుమతి మీ బిడ్డ దూరం ఎందుకు అవుతుంది ఈ ఇంట్లోనే పెరుగుతుంది అని అంటుంది.
మీరు నా గురించి ఇంతగా ఆలోచించి సంతకం పెట్టమంటున్నారు కదా అయితే నా తప్పేమీ లేదు అని నాకు అందరు సంతకాలు పెట్టివ్వండి అప్పుడు నేను ఈ విడాకులు నోటీస్ మీద సంతకం పెడతాననేసి అవని అంటుంది దానికి కోమలి. దాని కోమలి మనందరినీ అవనీ తెలివిగా ఇరికించాలని అనుకుంటుందమ్మా అట్లా చేస్తే ఆ నోటీస్ ని కోర్టులో చెప్పేసి వీళ్ళే తప్పు చేశారని విడాకులు రానివ్వకుండా చేస్తుందని తన ప్లాను అని అంటుంది. మీరు అలా చేస్తేనే మీకు విడాకులు నోటీసు మీద సంతకం చేసి ఇస్తాను అని అవని కండిషన్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బయట పల్లవి ఎదురుగా వస్తుంది. విడాకుల నోటీసులు పంపడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు అని అవని అంటుంది.. ఇప్పటివరకు నీకు జరిగిన ప్రతి దాని వెనక నా హస్తముంది నా తెలివితేటలు ఉన్నాయని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అవని అక్క అనేసి పల్లవి అంటుంది. నువ్వు నాకు ఎంత చేస్తున్నావో అంతకంత అనుభవించాలని చేస్తాను ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకో అనేసి అవని వార్నింగ్ ఇస్తుంది.. నీ వార్నింగులకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు చెప్తే ఇక్కడ వినే వాళ్ళు ఎవరూ లేరని పల్లవి అంటుంది అది చూద్దాం నీ లెక్కలు తేలే సమయం వచ్చేసిందని పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక స్వరాజ్యం దయాకర్ ఇద్దరు అవని గురించి బాధపడుతూ ఉంటారు. ఏమైంది ఇంకా అవన్నీ రాలేదు ఎప్పుడో అనగా వెళ్లింది అని స్వరాజ్యం టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అవని ఇంట్లోకి వస్తుంది. విడాకుల గురించి నీ వాళ్ళతో మాట్లాడవా అని స్వరాజ్యం అడుగుతుంది. కానీ వాళ్లకి దగ్గరగా ఉండాలని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారు ఈ గొడవలు ఇవి ఎంత వరకు వెళ్తాయో ఎప్పుడూ ముగుస్తాయో తెలియట్లేదు పిన్ని అని అవని బాధపడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో అక్షయ అవని దగ్గరికి వెళ్తాడు. నేను నీకు విడాకులు నోటీస్ పంపడానికి కారణం పల్లవి అని పల్లవికి కమల్ విడాకులు పంపించాడు అని అంటాడు. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..