Rachin Ravindra Phone Stolen: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా సొంత గడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్ లోనే పేలవమైన ఆట తీరును ప్రదర్శించింది. అన్ని రంగాలలో విఫలమైన పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమిని మూటగట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిధ్య పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగింది.
ఈ తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తోలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోర్ ని నమోదు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్, టామ్ లేథమ్ సెంచరీలతో అదరగొట్టారు. వీరికి గ్లెన్ ఫిలిప్స్ కూడా తోడయ్యాడు. ఫిలిప్స్ 39 బంతుల్లో 61 పరుగులు చేశాడు. టామ్ లాథమ్ 104 బంతులలో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విల్ యంగ్ 113 బంతులలో 107 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.
అనంతరం 321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 47.2 ఓవర్లలో కేవలం 260 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఖుల్ దిల్ షా 49 బంతుల్లో 69 పరుగులు, బాబర్ అజామ్ 90 బంతులలో 64 పరుగులు చేశారు. చివర్లో కుష్ దీ షా కాసేపు పాకిస్తాన్ క్రీడాభిమానులకు ఆశలు రేకెత్తించినా.. అతడు కూడా పెవిలియన్ చేరడంతో పాకిస్తాన్ ఓటమి ఖరారైంది. ఇక ఈ మ్యాచ్ లో టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేసిన బాబర్ అజామ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓపెనర్ గా బరిలోకి దిగే ఫకర్ జమాన్.. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కారణంగా అతడి స్థానంలో సౌద్ షకీల్.. బాబర్ అజామ్ తో కలిసి ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు.
అయితే వీరిద్దరూ టెస్ట్ మ్యాచ్ తరహా బ్యాటింగ్ చేయడంతో సాధించాల్సిన రన్ రేట్ క్రమంగా పెరుగుతూ పోయింది. పాకిస్తాన్ ఓటమికి వీరే కారణం అన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ముక్కోనపు సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో రచిన్ రవీంద్ర నుదుటికి బంతి బలంగా తాకింది. దీంతో ఫిజియోలు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ గాయం కారణంగా ముక్కోనపు సిరీస్ కి దూరంగా ఉన్న రచిన్ రవీంద్ర రీ ఎంట్రీ ఇచ్చాడు.
కానీ అతడు తొలి మ్యాచ్ కి దూరంగా ఉన్నాడు. రచిన్ రవీంద్ర పూర్తి ఫిట్ గా లేని కారణంగా అతడి స్థానంలో విల్ యంగ్ ని జట్టులోకి తీసుకున్నారు. అయితే ఈ తొలి మ్యాచ్ లో బెంచ్ కి పరిమితమైన రచిన్ రవీంద్ర ఐ ఫోన్ చోరీకి గురైంది. ఓ క్రీడాభిమాని డ్రెస్సింగ్ రూమ్ లోకి ప్రవేశించి రచిన్ రవీంద్ర ఫోన్ ని దొంగిలించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరైన సెక్యూరిటీని కల్పించలేని కారణంగానే రవీంద్ర ఫోన్ దొంగతనానికి గురైందని, అలాంటిది ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీని ముందు ముందు ఎలా నిర్వహిస్తారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
When Rachin Ravindra tried to call his number – https://t.co/OLh7QZAyNE pic.twitter.com/HzuxE0E0OR
— ನಗಲಾರದೆ… ಅಳಲಾರದೆ… (@UppinaKai) February 18, 2025