BigTV English

Telangana Govt: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 31 వరకు మాత్రమే

Telangana Govt: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 31 వరకు మాత్రమే

Telangana Govt: తెలంగాణలోని  ప్రజా ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు చెప్పింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటూ ప్రజలకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఇబ్బందిగా మారిన ఎల్ఆర్ఎస్ పై కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమమైంది.


కేవలం మూడు నెలల్లో తేల్చి క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగేశారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రత్యేక టీమ్ లను రెడీ చేశారు. గడిచిన నాలుగేళ్లుగా పెండింగులోవున్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులోనూ 25 శాతం రాయితీ ఇచ్చింది ప్రభుత్వం.

సమావేశంలో ఏయే నిర్ణయాలు


సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్నవారికి మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులో రాయితీ వర్తించనుంది. బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతికుమారి ఆధ్వర్యంలో ఈ అంశంపై సమీక్ష జరిగింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని పేర్కొంది. అనుమతి లేని లే అవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. వాటిని కొనుగోలు చేసినవారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. వీరందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

ALSO READ: పార్టీని కాపాడేందుకు కేసీఆర్ వ్యూహం..అమెరికా వ్యవహారమేంటి?

వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ పెండింగులో ఉన్నవారు.. లే అవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్ధీకరణ అమలయ్యేలా ప్రస్తుతం వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఒక లే అవుట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్‌ అయ్యాయి. మిగిలిన 90 శాతం ప్లాట్లు రిజిస్టరు కాలేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వాటి క్రమబద్ధీకరణతోపాటు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు.

ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31లోగా స్పందిస్తే రాయితీ కూడా లభిస్తుంది. నాలుగేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం కోసం చాలామంది పేద ప్రజలు, రియల్ సెక్టార్  ఎదురు చూస్తోంది. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం, ఈ వెసులుబాటు కల్పించింది.  దాన్ని వినియోగించుకోవాలని మంత్రులు సూచించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ అమల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటులో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునే సౌకర్య కల్పించింది.

ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎప్పుడు?

అక్రమ లేఅవుట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎల్‌ఆర్‌ఎస్‌ (ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం)-2020 ను అమల్లోకి తెచ్చింది. రూ.వెయ్యి చొప్పున ఫీజు విధించి దరఖాస్తులు ఆహ్వానించింది. వారిలో చాలా మంది స్పందించారు. కొన్నింటిని పరిశీలించి పరిష్కరించారు. పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది.

ఈ మేరకు కోర్టు ఉత్తర్వులకు లోబడి ఫీజు చెల్లించి నిర్మాణాలకు అనుమతులు పొందారు కొందరు. అయితే మెజారిటీ దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో ఉండిపోయాయి. 14 శాతం ఫీజులు చెల్లించి భవన నిర్మాణాలకు అనుమతులు పొందారు. చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టడంతో కదలిక మొదలైంది.

పెండింగులో ఎన్ని ఉన్నాయి?

రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాల మాట. వాటిలో 9 లక్షలకు సంబంధించి మాత్రమే పరిష్కారం లభించింది. కేవలం 39 రోజుల్లో వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాల్సి వుంది. రాయితీ ప్రకటించిన నేపథ్యంలో దరఖాస్తుదారులు ముందుకు రావచ్చని భావిస్తోంది ప్రభుత్వం.

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×