Intinti Ramayanam Today Episode January 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని వెళ్ళగానే పల్లవి చక్రధారిని రమ్మని చెప్పి ఈ విషయాన్ని చక్రధరకి చెప్తుంది.. ఇక చక్రధర్ ఆ పనిని చెడ్డ చేయాలంటే అవని రాసిస్తున్న డాక్యుమెంట్స్ కి ఆపోజిట్ గా మనం రాయించాలి అని అంటాడు. మరి వేరే లాయర్ ని చూడండి డాడి అని పల్లవి అంటే వేరే లాయర్ ఎందుకు అమ్మ డబ్బులుకి అమ్ముడు పోనీ లాయర్ అంటూ ఉండడు కదా ఇదే లాయర్ చేత మనం ఆ పని చేద్దాం అని అంటాడు. దానికి అసలు మా ఫ్యామిలీ లాయర్ కదా అసలు ఒప్పుకుంటాడు అంటావా ఇంట్లో తెలిస్తే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అంటే అదంతా నేను చూసుకుంటాను పదా వెళ్దామని లాయర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్తారు. మొదట లాయరు ఈ విషయానికి ఒప్పుకోడు తర్వాత డబ్బులు ఆశ చూపించడంతో చేస్తానని ఒప్పుకుంటాడు. అవని అనుకున్నట్లుగా ఒక డాక్యుమెంట్ రాయండి మేము అనుకున్నట్లుగా ఇంకొక డాక్యుమెంట్ రాయండి మేము సాయంత్రం వచ్చి ఆ డాక్యుమెంట్ ని తీసుకుంటాం ఆ తర్వాత మీకు ఎంత డబ్బులు కావాలో అంతా మీరు తీసుకోండి అని అంటాడు.. ఇక అవని డాక్యుమెంట్స్ ని తీసుకొని ఇంటికి వస్తుంది. పల్లవి మాత్రం వేరే డాక్యుమెంట్స్ ని రాయిస్తుంది. ఇక ఆస్తి పంపకాల గురించి రాజేంద్రప్రసాద్ తో అవని మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక కమల్ ఆరాధ్య ఇద్దరు కలిసి ఇంట్లో వాళ్ళందరూ మూడీగా ఉన్నారని వాళ్ళ కోసం ఒక స్వీట్ చేసి పెట్టాలని అనుకుంటారు. ఇద్దరు కలిసి పాయసాన్ని రెడీ చేస్తారు. స్వీట్ చేస్తున్న వాసనకి భానుమతి వంటగదిలోకి వెళ్తుంది. స్వీట్అయ్యాక పిలుస్తానని కమల్ అంటాడు. భానుమతికి కావాలని పాయసంలో మోషన్ టాబ్లెట్ ని వేస్తాడు. ఇక నువ్వు తింటే అందరికీ దొరికిపోతావ్ అక్కడే ఒక మూల కూర్చొని తినుపో అనేసి పంపిస్తాడు ఆ పాయసం తినగానే భానుమతి బాత్రూం కి గ్యాప్ లేకుండా వెళ్తుంది ఏమైందిరా పాయసం తినగానే ఏదో జరిగిందని అంటుంది నీ పాయసం గిన్నెలో నేను మోషన్ టాబ్లెట్ వేసానని చెబుతాడు. లేకుంటే మా వదినని పొద్దున లేచినప్పటి నుంచి ఏదో ఒకటి అంటూనే ఉంటావా అనేసి అంటాడు. ఎందుకురా నువ్వు ఇలా చేశావు నన్ను చంపేలా ఉన్నావు కదరా అనేసి భానుమతి అంటుంది.
ఆతర్వాత అవని దగ్గర అక్షయ దగ్గరకి వస్తుంది. ఏంటండీ ఇంకా నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నారా? నిద్ర పట్టడం లేదా అని అవని అడుగుతుంది. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూసి నిద్ర ఎలా పడుతుంది? నిద్ర పట్టడం లేదు అంటే అవి మర్చిపోలేక పోతున్నారా రేపటితో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అవని అంటుంది. ఇదంతా కాదు గాని నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళావు కదా డాక్యుమెంట్స్ ఏమయ్యాయి ఎలా రాయించాలి ఇలా ఇవ్వు అని అంటే మనం అనుకున్నట్లే రాయించాను అని అవని అంటుంది.. అయితే ఆ డాక్యుమెంట్స్ లైవ్ నేను ఒకసారి చూస్తాను అంటే అప్పుడు అక్షయ్కిస్తుంది కానీ అక్షయ దగ్గర నుంచి మళ్లీ తీసుకుంటుంది. ఏమైంది అంటే మీకు ఇది పెద్ద సర్ప్రైజ్ అండి మీరు రేపే చూడాలని అవని ఆ డాక్యుమెంట్స్ ని మళ్ళీ సెల్ఫ్ లో పెడుతుంది. నువ్వు నాకు మాకు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు నీకే ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నానని పల్లవి తాను రెడీ చేసిన డాక్యుమెంట్స్ ని చేతిలో పట్టుకొని చూస్తుంది. నీకు ఉదయం లేవగానే అవని పూజ చేయడానికి గదులోకి వస్తుంది డాక్యుమెంట్స్ అక్కడ పెట్టి పూజ చేస్తుంది. పల్లవి మాత్రం ఆ దీపాన్ని ఆరిపోయేలా చేస్తుంది. అగ్గిపెట్టి లేకపోవడంతో అవని పక్కకు వస్తుంది అదే సమయం చూసి ఆ డాక్యుమెంట్స్ ని మార్చేసి తన డాక్యుమెంట్స్ ని ఆ ప్లేస్ లో పెడుతుంది అది తెలియక అవని పూజ చేసి ఆ డాక్యుమెంట్స్ ని బయటకు తీసుకొస్తుంది.
అవని ఆ డాక్యుమెంట్స్ ని బయటికి తీసుకొచ్చి అందరిని పిలుస్తుంది. ఎందుకు ఏమైంది అంటే అందరికీ సమానంగా ఆస్తులు చెందేలా నేను డాక్యుమెంట్స్ రాయించానని అవనీలు అంటారు. ముందుగా రాజేంద్ర ప్రసాద్ ని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమని అవని అడుగుతుంది. శ్రీకర్ కూడా అక్కడికి వచ్చారని వస్తారని అవని. దానికి భానుమతి రాజేంద్రప్రసాద్ కి ఎందుకు కోపం తెప్పిస్తావు వారిని రావడం ఇంటికి ఇష్టం లేదు కదా నేను నువ్వే పంపించావా ఇప్పుడు నువ్వే తీసుకు రమ్మంటావా అని అరుస్తుంది. అమ్మమ్మ గారు నేను మామయ్య గారి పర్మిషన్ తీసుకుని శ్రీకర్ని రమ్మని చెప్పానని అంటుంది అప్పుడే శ్రీకర్ఇంటికి వస్తాడు. ఇక రాజేంద్రప్రసాద్ సంతకం చేస్తారు కానీ శ్రీకర్ కమల్ మాత్రం నాన్నగారి నిర్ణయాన్ని మేము ధిక్కరించమని అంటారు. ఏ ఆస్తులు అవసరం లేదంటే అప్పుడు అవని మీరు ఆస్తులు లేకపోయినా ఇలాగే ప్రేమతో కలిసి ఉంటారని మేము నిర్ణయం తీసుకున్నాం సంతకం చేయండి అని అంటుంది. శ్రీకర్ కమల్ రాజేంద్రప్రసాద్ కోమలి, ప్రణవి అందరూ సంతకం చేస్తారు. ఇక అక్షయ్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తానన్నావు కదా ఏంటి ఆ సర్ప్రైజ్ ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ లో ఏం రాయించావో చూపించు అందరికీ వినిపించేలా చదువు అని అంటాడు. దానికి పల్లవి బావ గారు నేను చదువుతానని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..