Intinti Ramayanam Today Episode july 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వస్తుంది. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే నేను అసలు నమ్మలేకున్నాను అన్నయ్య. నా గుండె తరుక్కుపోతుంది అని బాధపడుతుంది. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావ్ అన్నయ్యా అంటూ ఏడుస్తుంది రాజేశ్వరి.. చానాళ్ల తరువాత నిన్ను చూసినందుకు ఆనందంగా ఉంటే.. కన్నీళ్లు పెట్టుకుంటావ్ ఏంటమ్మా అని అంటాడు రాజేంద్ర. అవునూ మీ ఫ్రెండ్‌కి ఎవరికో బాలేదని అమెరికా వెళ్లావ్.. ఇప్పుడు వాళ్లకి ఎలా ఉంది? నువ్వు ఎప్పుడొచ్చావ్ అని అడుగుతాడు రాజేంద్ర. బాగానే ఉంది అన్నయ్యా.. పార్వతి మాత్రం కనీసం పట్టించుకోని కూడా పట్టించుకోదు. ఏంటి వదిన నువ్వు కనీసం ఎలా ఉన్నావ్ అని కూడా మాట్లాడట్లేదు అని రాజేశ్వరి అంటుంది. నువ్వు మీ అన్నయ్యని వెంటపెట్టుకుని వచ్చావ్ అంటే.. మమ్మల్ని నిలదీయడానికి గొడవలు పడటానికే వచ్చి ఉంటావ్ అని అర్థం అయ్యింది. పార్వతి మాటలకు రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీకరు చక్రధర్ ని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు. అవని ఫోన్ చేసి మీ అత్తయ్యకు ఈ విషయాన్ని చెప్పి ఫైల్ గురించి వెతుకు శ్రీకర్ అని అంటుంది. శ్రీకరు రాజేశ్వరి దగ్గరికి వెళ్లి అవని వదిన మీకు అంత చెప్పింది కదా అత్తయ్య నేను మావయ్యకి వాళ్ళకి సంబంధం ఏమైనా ఉందేమో అని తెలుసుకోవడానికి వచ్చాను. ఒకవేళ వీళ్లిద్దరికి సంబంధం గనక ఉంటే ఆ ఫైల్ ఇక్కడే ఉంటుంది కదా అత్తయ్య మళ్ళీ ఆస్తులని తిరిగి తెచ్చుకోవచ్చు అని అడుగుతాడు. ఆ మాట వినగానే రాజేశ్వరి పదా నీకు మామయ్య ఫైల్స్ పెట్టే గదిని చూపిస్తానని తీసుకెళ్తుంది. అప్పుడే ఫైల్ మర్చిపోయిన చక్రధర్ ఇంటికి వస్తాడు..
రాజేశ్వరి శ్రీకర్ కి మెసేజ్ చేస్తుంది. శ్రీకరు జస్ట్ మిస్ అయ్యి తప్పించుకుంటాడు. ఇక ఆ ఫైల్ దొరకలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత అవని ఆరాధ్యను స్కూల్ కి తీసుకెళ్లమని రాజేంద్ర ప్రసాద్ తో చెబుతుంది.. కానీ భరత్ నేను తీసుకెళ్తాను అక్కని అంటాడు. కానీ రాజేంద్రప్రసాద్ ఏమైందమ్మా నువ్వు ఈ రోజు తీసుకెళ్లట్లేదని అడుగుతాడు. అయితే నాకు ఈరోజు ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది మామయ్య అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పాను అని అంటుంది.. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్లడం ఎందుకమ్మా నాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర జాబ్ ఉంది నువ్వు అక్కడ చెయ్యి అని రాజేంద్రప్రసాద్ అన్న కూడా అవని మాత్రం అలా తెచ్చుకున్న జాబ్ నాకొద్దు మావయ్య నా అంతట నేను తెచ్చుకొని చేయాలి అని అంటుంది..
ఇంటర్వ్యూ కు అవుతుందని ఆటోని పిలుస్తుంది.. ఎక్కడికి అక్షయ్ కూడా వచ్చి ఆటో ని పిలుస్తాడు. ఆటో వచ్చి ఇంటి మీద ఆగ్గానే నేను పిలిచాను నేను పిలిచాను అంటూ వాదులు ఆడుకుంటూ ఇద్దరు చిరాకుపక్క ఆటో నెక్కేస్తారు. అయితే ఓకే ఇంటర్వ్యూ కి ఇద్దరు వెళ్తారు. అవని చీర కొంగు ఆటోలు ఇరుక్కున్న అక్షయ మాత్రం పట్టించుకోకుండా ఇంటర్వ్యూకి వెళ్లిపోతాడు. అవని నిదానంగా లోపలికి వెళ్ళగానే అక్కడున్న వార్డు బాయ్ ను నా పేరు పిలిచారంట నేను ఇంటికి వెళ్లొచ్చా అని అడుగుతుంది. అతను లేదమ్మా ఒకసారి పేరు పిలుస్తారు రెండో సారి పిలవరు అని అంటాడు. ఆ మాట వినగానే అక్షయ్ నవ్వుతాడు..
భరత్ ప్రణతి ఇద్దరూ బైక్ పై బైటికి వెళుతూ ఉంటారు అది చూసిన పార్వతీ వాళ్ళిద్దరికీ అడ్డుగా వచ్చి ఆపుతుంది. నా కూతుర్ని నీ బైక్ వింటర్ షికారుకు తిప్పుతున్నావా నీకు ఎంత ధైర్యం రాని పార్వతి నోటికి వచ్చినట్లు భరత్ ని తిడుతుంది. కానీ ప్రణతి మాత్రం భరత్ అవని వదిన లేకుండా అంటే నేను ఈరోజు మీ ముందు ఇలా ఉండేదాన్ని కాదు అది నువ్వు నీ కొడుకు అర్థం చేసుకుంటే మంచిది అని తల్లి అని కూడా చూడకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. భరత్ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు పద వెళ్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు..
Also Read: ప్రభావతికి సత్యం స్ట్రాంగ్ వార్నింగ్.. బాలుకు చుక్కలు చూపించిన శోభన..రోహిణికి బిగ్ షాక్..
ఇక అక్షయ్ ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. క్వాలిఫికేషన్ అన్ని బాగానే ఉన్నా కూడా వాళ్ళ ఆఫీసు దివాలా తీయడానికి ఆయనే కారణమని అక్కడ తెలుసుకొని అక్షయ్ ని ఘోరంగా అవమానిస్తారు. ఏంటండీ ఈ జాబ్ మీకైనా వచ్చిందా అని అవని బయటికి రాగానే అడుగుతుంది. అక్కడున్న వార్డ్ బాయ్ ఈయన ఆఫీసు దివాలా తీయడానికి ఈయనే కారణమని వాళ్లకు తెలిసిపోయింది అందుకే బయటకు పంపించారు అని అంటాడు. అవని బయటకు రాగానే చూసారా అండి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా నేను ఎంత చెప్పినా కూడా వినకుండా సంతకాలు పెట్టి ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళు అని సలహా ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..