Gundeninda GudiGantalu Today episode july 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతిని రెడీ చేస్తూ తన ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు మళ్లీ ఎప్పుడు రెడీ అవుతావు శ్రీమంతా నీకే కదా వేసుకోవే అని నగల గురించి మాట్లాడతారు. శృతి దగ్గరికి రవి వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రవిని ఆటపట్టిస్తారు.. మెడ నుండి నగలు వేసుకున్నావు కదా నిన్ను ఎవరైనా ఎత్తకపోతే రేమో అని రవి కూడా సరదాగా అంటాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన శోభాను చూసి రవి షాక్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శోభన అక్కడికి రాగానే శృతి చాలా బాగున్నావు నీ పెళ్లి కోసం చేయించిన నగలలో నువ్వు నిండుగా ఉన్నావు అని అంటుంది. రోహిణి తో విజ్జి తన బాధను వెళ్ళబోసుకుంటుంది. మా నాన్న రాకపోతే కచ్చితంగా మా అత్త ఏదో ఒకటి చేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు సెట్ చేసిన అతను ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. విజ్జి ఆ వ్యక్తికి ఫోన్ చేసి త్వరగా రమ్మని అంటుంది. వీడు గనక సరిగ్గా చేయకపోతే నేను అడ్డంగా దొరికిపోతాను అని టెన్షన్ పడుతుంది రోహిణి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనాను ప్రభావతి నోటికి వచ్చినట్లు మాటలు అంటుంది. దానికి సత్యం క్లాస్ పీకుతాడు. మన ఇంట్లో ఇన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి. నీ పుట్టింటి తరపు నుంచి ఎవ్వరూ ఇవ్వలేదు నీ పుట్టింటి వాళ్లకు ఏమాత్రం ఆస్తులు ఉన్నాయని మీన అడిగితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు. అప్పుడే కామాక్షి అక్కడకు వచ్చి ఏంటి అప్పుడే గొడవ అప్పుడే ఆగిపోయింది నేను మిస్ అయిపోయాను వదిన అని అంటుంది. ప్రభావతి ఏంటి మేము వియ్యపురాలు ఇద్దరం కొట్టుకుంటే చూడాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఆ తర్వాత మనోజ్ అక్కడికి రాగానే ఫంక్షన్ ఏంటమ్మా ఇంకా స్టార్ట్ అవ్వలేదని అడుగుతాడు. రోహిణి పెద్ద కోడలు కదా.. ముందు తనకే చేయాలి. మీ మామగారు ఎక్కడ వరకు వచ్చారు రోహిణి వెళ్లి కనుక్కొని ప్రభావతి పంపిస్తుంది.
ఇక బాలు సైగలు చేస్తూ ఉంటాడు.. మీనా ఏమంటున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. ఏమంటున్నారండి నాకు అర్థం కావట్లేదు అని మీనా అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చినా కామాక్షి నేను చెప్తాను అని అంటుంది. ఈసారి నువ్వు అన్నదానికి నేను చెప్పకుండా ఉంటే నా పేరు మార్చుకుంటాను అని అంటుంది. బాలు ఎంతగా చెప్పినా కూడా కామాక్షి కనుక్కోలేకపోయింది. అంతో నువ్వు పేరు ఎప్పుడు మార్చుకుంటావు అని అడుగుతాడు.. ఆ తర్వాత శోభన సెట్ చేసిన మనుషులు బాలు దగ్గరకి వస్తారు. కాలు నలిగినా కూడా బాలు ఏం మాట్లాడకుండా గమ్మున ఉంటాడు.
బాలు మౌనంగా ఉన్న మీనా రోహిణి మాత్రం ఆ రౌడీలపై విరుచుకుపడతారు.. ఇక అక్కడి నుంచి బాలు బయటికి వెళ్లి అరిచేసి వస్తాను అని వెళ్తాడు. అయితే బాలు బయటకు వెళ్లి తన కాళ్ళు దొరికిన వ్యక్తి ఫోటోని రాజేష్ కి పంపిస్తాడు. మీరు ఈ ఫంక్షన్ లోనే ఉన్నాడు వీడు ఎవడో కనుక్కో వాడి సంగతి ఏంటో ఫంక్షన్ అయినా తర్వాత చూద్దామని అంటాడు.. అయితే శోభన దగ్గరికి రౌడీలు వస్తారు. ఏంట్రా ఇంతగా చేసినా కూడా వాడు మీకెందుకు గొడవ పడలేదు సరిగ్గా తొక్కవా లేదా అని అడగ్గాని ఆ వ్యక్తి శోభన కాల్ కి చూస్తాడు. నేను
గట్టిగా తొక్కినా కూడా బాలు ఎందుకు కోపం తెచ్చుకోలేదు. వీడ్ని ఎలాగైనా కోపం తెప్పించి గోల గోల చేయాల్సిందే అని శోభన అంటుంది. బాలుకు రాజేష్ ఫోన్ చేసి ఆ వ్యక్తి గురించి డీటెయిల్స్ చెప్తాడు. ఇక రోహిణిని బయటకు తీసుకురావడానికి ప్రభావతి కామాక్షి గదిలోకి వెళ్తారు. వెళ్ళగానే రోహిణి మీ నాన్నగారు ఎక్కడ ఫంక్షన్కు టైం అయింది. ఎప్పుడొస్తాడు అని ప్రభావతి గట్టిగా అడుగుతుంది. కానీ రోహిణి మాత్రం వస్తాడు ఆంటీ దగ్గర్లోనే ఉన్నాడు అని ఏదో ఒకటి సాకు చెప్తుంది. రోహిణి ఫోన్ చేయమని దబయిస్తుంది. ఫోన్ చేయగానే నాట్ రీచబుల్ అని రావడంతో ప్రభావతి ఇంకెప్పుడు వస్తారు మీ నాన్న మీ నాన్న వస్తారని అందరికీ చెప్పాను నా పరువు పోయేలా చేయొద్దు అని అంటుంది.
మెడనిండా నగలు వేసుకుని శృతి అందంగా ఉంది మరి నువ్వేంటి ఇలా బోసిపోయిన దానిలాగా ఉన్నావు అని అంటుంది. ఇక వాళ్ళు వెళ్లగానే రోహిణి పిలిపించిన వ్యక్తి లోపలికి వస్తాడు. నేను స్వర్గానికి పంపించాల్సిన వ్యక్తి ఎవరు అని ఆ వచ్చిన వ్యక్తి అడుగుతాడు.. అదే మందు తాగితే వెళ్ళే స్వర్గానికి ఎవరిని పంపించాలో చూపించండి అని అడుగుతాడు. విజ్జి అతని తీసుకెళ్లి బాలుకి చూపిస్తుంది.. ఇక బాలుని ఎలాగైనా రెచ్చగొట్టాలని శోభన మనుషులు ప్రయత్నిస్తారు.
Also Read : 2 వేల కోట్ల టార్గెట్.. అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్..విన్నర్ ఎవరు?
బాలు ఫోన్ మాట్లాడుతుంటేలు ఫోన్ మాట్లాడుతుంటే ఓ వ్యక్తి వచ్చి అని గట్టిగా కొడతాడు. నీ బాలు మాత్రం కాస్త సీరియస్ అయినా తర్వాత కామాక్షి వచ్చి కోడ్ చెప్పగానే చల్లారిపోతాడు.. మీనా మాత్రం వాణ్ణి నానా బూతులు తిడుతుంది. బాలుని ఎంత రెచ్చగొట్టినా సరే నువ్వు వెళ్ళు భాషని చెప్పగానే వెళ్ళిపోతాడు. ఇక శోభన మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు అని రెచ్చిపోతుంది. ఆ ఫ్యామిలీని మా ఫ్యామిలీ నుండి దూరం చేయడానికి నాకు ఒక్క నిమిషం చాలు వెళ్లి ఇంకా గట్టిగా ప్రయత్నించండి అని శోభన అంటుంది.. ఇక బాలు ఆ వ్యక్తి ఫోటోని కూడా పంపించి రాజేష్ కి చూపిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…