E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. అయ్యో.. అడ్డంగా దొరికిందిగా.. కమల్ ఝలక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. అయ్యో.. అడ్డంగా దొరికిందిగా.. కమల్ ఝలక్..
Advertisement

Intinti Ramayanam Today Episode june 22nd: మీనాక్షి నిర్దోషిగా ఇంటికి రావడం చూసిన పల్లవి చాలా కోపంగా ఉంటుంది. ఏంటి ఈ సంతోషాన్ని చూసి భరించలేకపోతున్నావా? నాకు తల్లిని దూరం చేస్తాను అని అన్నావు కానీ మీ ప్లాన్  దారుణంగా ఫెయిల్ అయింది.. మా అమ్మని నువ్వు ఏమి చేయలేవు అని పదవికి అవని వార్నింగ్ ఇస్తుంది.. నువ్వు ఇలా ప్లాన్ చేయడం చివరికి నువ్వే ఓడిపోవడం మొదటినుంచి జరుగుతూనే ఉంది కదా.. మరి ఎందుకు ఇప్పుడు కొత్తగా బాధపడుతున్నావు అని అవని పల్లవితో అంటుంది. ఇవాళ మీ అమ్మ వచ్చిందని సంతోష పడుతున్నావు కదా ఇక మీ అమ్మని ఎలా దూరం చేయాలో అది ఆలోచిస్తాను నా నుంచి మీ అమ్మని దూరం చేయలేరు అని పల్లవి అంటుంది.. నీకు చేతనేది చేసుకో మా అమ్మని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని అవని కూడా పల్లవికి ఛాలెంజ్ చేస్తుంది..

పల్లవికి తప్పని చివాట్లు.. 

పార్వతి మీనాక్షి ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది.. చాలా టైం అయింది కదా ఇంట్లో ఎందుకు రాలేదు అని అటు శ్రేయ కూడా అడుగుతుంది. మీనాక్షి విడుదలైనందుకు ఏదైనా గుడికి వెళ్లి వస్తున్నారేమో అని పార్వతి అంటుంది. అయితే అప్పుడే మీనాక్షి వాళ్ళు రావడం చూసినా భానుమతి వచ్చినట్టుంది. మీనాక్షి అని వెటకారంగా మాట్లాడుతుంది.. మీనాక్షి వాళ్లతో పాటుగా అటు పల్లవి కూడా ఇంటికి ఒకేసారి రావడంతో అందరూ కలిసి ఇంట్లోకి వస్తూ ఉంటారు.. అక్షయ్ పార్వతికి అత్తయ్యని తీసుకుని వచ్చేసాం అమ్మ అని చెప్పగానే అవున్రా నిర్దోషిగా బయటకు వచ్చేసింది అని పార్వతి చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఎన్ని రోజులకి ఇంట్లోకి వచ్చినందుకు నేను దిష్టి తీయాలి అని పార్వతి దిష్టి తీయడానికి అన్ని సిద్ధం చేస్తే నేను లోపలికి.. అయితే అవని నువ్వు మా అమ్మకి దగ్గరుండి దిష్టి తీసి లోపలికి తీసుకురావాలి అని అంటుంది.. మీ అమ్మకి నువ్వు తీసుకో అంతేగాని నేను తీయాల్సిన అవసరం నాకేంటి అని పల్లవి అంటుంది.. ఇక అందరూ కూడా పల్లవిని తిట్టడం మొదలుపెడతారు..

పల్లవికి మైండ్ బ్లాక్ అయ్యిందిగా..

Advertisement

మీ అమ్మకి నువ్వు తీసుకో అంతేగాని నేను తీయాల్సిన అవసరం నాకు లేదు కదా.. అసలు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అని అందరూ అంటారు.. అవనికి అమ్మ అయితే నీకు కూడా తల్లి లాంటిదే కదా మరి నువ్వు ఎందుకు ఇలా బాధపడిపోతున్నావు అని చక్రధర్ కూడా పల్లవిని తిడుతూ ఉంటాడు.. పల్లవి నీతో కొంచెం మాట్లాడాలి లోపలికి వెళ్దాం పద అని అవని లోపలికి తీసుకుని వెళుతుంది.. మీ అమ్మకి నువ్వు దిష్టి తీసుకో నేను తీయాల్సిన అవసరం నాకేంటి అని పల్లవి అడుగుతుంది. నీకోసం నేను ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. సుబ్బారావు మాట్లాడిన మాటలని పల్లవికి వినిపిస్తుంది అవని. అది విన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అసలు అప్పటివరకు నేను దిష్టి తీయను అని చెప్పిన పల్లవి బయటికి రాగానే నేను దిష్టి తీస్తాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. అవని ఏం చెప్పింది ఎందుకు పల్లవి సడన్గా మారిపోయింది అని అనుకుంటారు..

పల్లవి పై కమల్ కు అనుమానం..

మీనాక్షిని టార్గెట్ చేసిన పల్లవి తాను రిలీజ్ అయ్యి ఇంటికి రావడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మీనాక్షిని ఇలా చూడడం నాకు అస్సలు నచ్చలేదు అని తన దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇస్తుంది.. ఈ మీనాక్షిని మళ్లీ ఎలాగైనా సరే శాశ్వతంగా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.. అసలు సుబ్బారావు వాళ్లని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు.. కేవలం పల్లవికి మాత్రమే ఆ అవసరం ఉంది.. అంటే పల్లవి నీ వాళ్ళని కిడ్నాప్ చేయించిందా అని కమల్ ఆలోచిస్తూ ఉంటాడు.. వదిన ని అడిగితే అసలు విషయం బయటకు వస్తుంది అని ఎవరి దగ్గరికి వెళ్లి అడుగుతాడు.. ఇక పల్లవి పై నిజంగానే అనుమానం మొదలువుతుంది.. అసలు రౌడీల్ని పెట్టి కిడ్నాప్ చేయించాల్సిన అవసరం పల్లవికి తప్ప ఎవ్వరికీ లేదు.. అసలు వదినని అడిగితే అసలు నిజం ఏంటో బయటపడుతుంది అని కమల్ అనుకుంటాడు. కమల్ అవని దగ్గరికి వెళ్లి ఎంతగా అడిగినా సరే అవని పల్లవి గురించి చెప్తే చంపేస్తాడు అని ఏమీ తెలియనట్లే మాట్లాడుతుంది..

పల్లవికి చక్రధర్ వార్నింగ్..

Advertisement

ఇక మీనాక్షి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది అని చక్రధర్ మాట్లాడుతూ ఉంటాడు.. అవని నీకోసం ఎంతో కష్టపడింది.. నువ్వు బయటికి రాకపోయి ఉంటే నేను ఏమైపోయావ్ వాడినో నాకు అర్థం కావట్లేదు మీనాక్షి అని అంటాడు.. ఇక మీనాక్షికి దగ్గు రావడంతో వెంటనే ఉరికి వెళ్లి వాటర్ తీసుకుని వచ్చి మీనాక్షికి ఇస్తూ ఉండగా.. అది చూసిన పల్లవి లవర్స్ లాగా బాగానే ఉన్నారు కదా అని అంటుంది. ఇప్పటివరకు ఈ లవర్స్ లాగే ఉన్నారు కానీ ఎప్పుడు మాత్రం రియాల్టీ గానే ఉన్నారు కదా.. అని పల్లవి అనగానే కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అని చక్రధర్ అంటాడు. చక్రధర్ పల్లవి మాటలకి కోపంతో రగిలిపోతాడు.. తనని కొట్టబోతాడు కానీ మీనాక్షి ఆపడంతో చక్రధర్ ఆగుతాడు దానికి కూడా పల్లవి మీనాక్షిని అవమానించడం మాట్లాడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే న్యూస్.. అక్షయ్ అవుట్..

Related News

ముగిసిన ‘లాక్ అప్ 2’.. విన్నర్ ఎవరు? ట్రోఫీ, రూ.1 కోటి నగదుతో పాటూ?

Karthika Deepam 2 jyo : కార్తీక దీపం విలన్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన ప్రభావతి.. పాపం రోహిణి..

Podarillu Today Episode : మాధవ్ మిస్సింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. పోలీస్ మాటతో చక్రీ ఫైర్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్, ప్రేమ ఫైట్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. తిరుకు తప్పని తిప్పలు..

Karthika Deepam 2 Serial Today Episode August 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన పారిజాతం   

నటుడు పుట్టా భాను ఈవెంట్ లో కొట్టుకోవడానికి కారణం ఇదేనా..? టచ్ చేశాడు భయ్యా..

Intinti Ramayanam Today Episode: ఫస్ట్ టైమ్ బాబును ఎత్తుకున్న పల్లవి.. అవని పూజ.. అడ్డంగా దొరికిన మగాళ్లు…

Big Stories

Advertisement
×