E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ మిస్సింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. పోలీస్ మాటతో చక్రీ ఫైర్..

Podarillu Today Episode : మాధవ్ మిస్సింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. పోలీస్ మాటతో చక్రీ ఫైర్..
Advertisement

Podarillu Today Episode august 6th: మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతాడు నా తమ్ముళ్లు నావల్ల బాధపడకూడదు. వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి అని అందరూ పడుకున్న తర్వాత ఆలోచిస్తాడు.. అయితే ఎలాగైనా సరే ఈ ఇంట్లోంచి నేను వెళ్ళిపోతేనే నా తమ్ముళ్ళకి మంచి జరుగుతుంది అని ఆలోచిస్తాడు మాధవ్..  ఉదయం లేవగానే మాధవ్ కనిపించలేదు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. మాధవ్ ఎక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్లారు అని ఇల్లంతా వెతికితే అక్కడ నేను వెళ్ళిపోతున్నానని ఒక లెటర్ రాసి వెళ్లిపోతాడు.. మాధవ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అంతా జల్లెడ పట్టి వెతుకుతూ ఉంటారు. అసలు మాధవి ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావడం లేదు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు..

బాధపడ్డ కన్నా..

మాధవ కోసం ఊరంతా గాలించి వెతుకుతూ ఉంటారు అన్నదమ్ములు. ఎక్కడ కనిపించలేదు అని అందరూ కూడా వెతికి వెతికి ఇంటికి వస్తారు. అయితే కన్నా మాత్రం మాధవ్ లేడు అని చాలా బాధపడిపోతూ ఉంటాడు.. కన్నా పరిస్థితిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని మహాలక్ష్మి కూడా బాధపడుతుంది.. వీళ్ళందరూ ఇలా బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని మహాలక్ష్మి కూడా మాధవ్ ఎక్కడున్నా ఇంటికి రావాలని కోరుకుంటుంది.. అసలు ఏం జరిగింది మాధవ్ ఎక్కడికి వెళ్ళాడు అని మిగిలిన వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు ఇంటికి వచ్చిన నారాయణ ఏంటి చవటల్లాగా ఇంటికి వచ్చారు వెతక్కుండా ఎక్కడ కనిపించలేదా అని అంటాడు.. మాధవ్ ఎక్కడ కనిపించలేదు అని చెప్పగానే నారాయణ మాటలతో అందరినీ బాధ పెట్టేస్తాడు.

పోలీస్ పై చక్రీ సీరియస్..

Advertisement

మహాలక్ష్మి చక్రి ఇద్దరు కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అక్కడికి వెళ్తారు.. అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ ప్రవర్తన చూసి చక్రి కోపంగా ఉంటాడు.. మహాలక్ష్మి మాత్రం చాలా కూల్ గా ఇది పరిస్థితి అని వివరిస్తుంది.. అయితే ఆ పోలీస్ ప్రవర్తనతో చక్రి చాలా కోపంగా ఆవేశంగా బయటకు వెళ్తాడు.. మా అన్నయ్య గురించి మీకేం తెలుసు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తప్పిపోతే మీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అని చక్రి బాధపడిన కూడా కోపంగా అతనితో మాట్లాడడంతో ఆ పోలీసు నీకు కొత్త మాకు కొత్త కాదు అని అంటాడు.. ఇక మహాలక్ష్మి చక్రి ప్రవర్తన పై భయపడుతుంది.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇద్దరు కూడా అక్కడి నుంచి బయటికి వస్తారు.. అన్నయ్యకి మేము అంటే ప్రాణం అలాంటిది ఆయన ప్రాణాలతో లేడు అని అనగానే నేనెందుకు ఊరుకోవాలి అని బాధ పడిపోతాడు.. ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నేనే అని చక్రి బాధపడడం చూసి మహాలక్ష్మి బాధపడుతుంది..

తాయారు, రమణయ్య ఎంట్రీ..

తాయారు అలాగే రమణయ్య ఇద్దరూ వస్తు ఉంటారు.. అబ్బాలను చూసిన నారాయణ మీరు ఇక్కడ రాలేదు అని అనుకున్నాను.. వచ్చారా? మా ఇంట్లో ఏం జరిగినా కూడా మీకు ముందే తెలుస్తుంది కదా అని వెటకారంగా మాట్లాడతాడు. అయితే రమణయ్య, తాయారు మాత్రం పెద్దోడు వెళ్లిపోతుంటే మీరేం చేస్తున్నారు అని వాళ్ళ మీద అరవడంతో వీళ్ళు తనని వెతకడానికి వచ్చారా అన్నట్లుగా మహాలక్ష్మి అనుకుంటుంది.. తాయారు జాతకం చూసేవాడు వెళ్ళిపోయాడు అని అంటే వాడి మొహం చూస్తే నేను ఆగిపోయి ఉంటే గాయత్రితో ఎప్పుడో వాడి పెళ్లి అయిపోయేది.. ఇవన్నీ నమ్మడానికి వీల్లేదు మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి పొడువు వస్తాడులే అని వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు..

మనీష ఇంటికి వెళ్లిన మాధవ్..

Advertisement

మనిషా గుడికి వెళ్లి మాధవ్ దొరకాలి అని దండం పెట్టుకుంటూ ఉండగా అక్కడ మాధవిని చూసి మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది.. మాధవ్ జి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? మీకోసం ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు అని చెప్తూ ఉంటే మాధవ్ నేను ఇక్కడ ఉన్నాను సంగతి చెప్పొద్దు అని చెప్తాడు.. ఇక మనిషా మా ఇంటికైనా వెళ్దాం రండి అని అతని తీసుకొని ఇంటికి వెళుతుంది.. ఇక మనిషి ఇంటికి వెళ్ళిన తర్వాత భన్సీ ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటాడు.. అయితే తాను ఇక్కడే ఉన్నానన్న సంగతి ఎవరికీ చెప్పకుండా ఉండాలి అని మాధవ్ ఒట్టేసుకుంటాడు.. మొత్తానికి మాధవ్ అక్కడే ఉండడం ఇష్టమేని చెప్పడంతో మనిషా అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్, ప్రేమ ఫైట్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. తిరుకు తప్పని తిప్పలు..

Related News

తప్పు మగాడిదైనా.. నింద ఆడదానికేనా? అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Big Stories

Advertisement
×