Baffle filter Vs Filterless chimney: ఇండియన్ కిచెన్ అంటేనే కమ్మటి రుచుల పరిమళం, అందులోనూ వేడి వేడి గారెలు, క్రిస్పీ పకోడీల వంటి స్నాక్స్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే కిచెన్ లో ఇలాంటి స్నాక్స్.. డీప్ ఫ్రై తర్వాత వచ్చే నూనె జిడ్డు, పొగ కిచెన్ అందాన్ని మసకబారుస్తాయి. వంట గది గోడలపై పేరుకుపోయే ఆ జిడ్డు మరకలను పోగొట్టడానికి మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమే కిచెన్ చిమ్నీ. మరి ఇలా డీప్ ఫ్రైస్ ఎక్కువగా చేసే వంటింటికి ‘బాఫిల్ ఫిల్టర్’ చిమ్నీ మంచిదా ‘ఫిల్టర్ లెస్’ చిమ్నీ బెటరా ? ఏది కొంటే .. కిచెన్ లుక్ పాడవకుండా ఉంటుందో తెలుసుకుందామా..
మన ఇంట్లో రోజువారీ వంటల్లో డీప్ ఫ్రైస్ కామన్. పండగలు వచ్చినా, ప్రత్యేక రోజుల్లో అయినా గుమగుమలాడే వంటకాలు చేయాల్సిందే. అయితే.. ఈ ప్రాసెస్ లో వచ్చే నూనె ఆవిర్లు కిచెన్ క్యాబినెట్స్, టైల్స్ పై అంటుకుని మొండి జిడ్డుగా మారుతాయి. దీన్ని క్లీన్ చేయడం చాలా కష్టం. ఈ టెన్షన్ తప్పుకోవాలంటే.. సరైన చిమ్నీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. నూనె గాల్లో కలిసిపోకుండా.. నేరుగా మోటార్ లేదా ఫిల్టర్ ద్వారా బయటకు వెళ్లేలా చేయడానికి చిమ్నీ ఎంతగానో సహాయ పడుతుంది. ఇదెలా ఉంటే ప్రస్తుతం మార్కెట్ లో 2 రకాల చిమ్నీలు అందుబాటులో ఉన్నాయి. 1.బాఫిల్ ఫిల్టర్ చిమ్నీ, 2.ఫిల్టర్ లెస్ చిమ్నీ.
సాంప్రదాయ, అత్యంత నమ్మకమైన కిచెన్ చిమ్నీ టెక్నాలజీ వీటిలో ఉంటుంది. ఇందులో కర్వ్డ్ లేదా వంపులు తిరిగిన స్టీల్ ప్లేట్లు వరుసగా అమర్చబడి ఉంటాయి. వంట చేసేటప్పుడు.. పైకి వెళ్లే పొగ,నూనె ఆవిర్లు ఈ బాఫిల్ ప్లేట్ల గుండా వెళ్లాయి. ఆ వేగానికి నూనె చుక్కలు ఫిల్టర్ లో ఆగిపోయి, కింద ఉన్న ఆయిల్ కలెక్టర్ లోకి పడిపోతాయి. కేవలం శుద్ధమైన గాలి మాత్రమే మోటార్ ద్వారా బయటకు వెళ్తుంది. నూనె ఎక్కువగా వాడే డీప్ ఫ్రైస్ మన వంటకాల్లో ఎక్కువ కాబట్టి.. ఈ బాఫిల్ ఫిల్టర్లు హెవీ ఆయిల్ ను చాలా వరకు అడ్డుకుంటాయి. అయితే దీన్ని ప్రతి మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి మ్యాన్యువల్ గా విడదీసి క్లీన్ చేయాల్సి ఉంటుంది.
Also Read: రూ.615 ధరకే..పోర్టబుల్ టీవీ సౌండ్‌బార్! ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే
ఇది లేటెస్ట్ ట్రెండీ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో ఎలాంటి సాంప్రదాయ ఫిల్టర్స్ ఉండవు. బదులుగా మోటార్ లోపల ఆటో-క్లీన్ టెక్నాలజీ లేదా స్పెషల్ మోటార్ డిజైన్ ఉంటుంది. ఫిల్టర్స్ లేకపోవడం వల్ల సక్షన్ పవర్ లేదా గాలిని పీల్చుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. పొగ, నూనె నేరుగా మోటార్ లోకి వెళ్తాయి. ఫిల్టర్ లెస్ చిమ్నీలు పవర్ ఫుల్ సక్షన్ కలిగి ఉండటం వల్ల డీప్ ఫ్రై సమయంలో వచ్చే దట్టమైన పొగను క్షణాల్లో పీల్చేస్తాయి. పైగా ఫిల్టర్స్ క్లీన్ చేయాల్సిన టెన్షన్ ఉండదు. అయితే.. మోటార్ లోపలే నూనె ఆవిర్లు పేరుకుపోతుంటాయి కాబట్టి.. ఆటో-క్లీన్ ఫీచర్ ఉన్నప్పటికీ, దీన్ని ఎప్పటికప్పుడు గమనించాలి. అలాగే బాఫిల్ చిమ్నీలతో పోలిస్తే దీని ధర కొంచెం ఎక్కువే ఉంటుంది.
మీ కిచెన్ లో రోజూ చికెన్, ఫిష్ ఫ్రైలు, పూరీలు, పకోడీలు వంటి హెవీ డీప్ ఫ్రైస్ ఎక్కువగా తయారు చేస్తుంటే, బాఫిల్ ఫిల్టర్ చిమ్నీ బెస్ట్ ఆప్షన్. ఇది మీ చిమ్నీ మోటార్ లైఫ్ ను కాపాడుతుంది. అలాగే.. మీరు మోడర్న్ లుక్ కోరుకుంటూ.. తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి, బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఫిల్టర్ లెస్ చిమ్నీ వైపు వెళ్లొచ్చు. మీరు తయారు చేసే ఫుడ్, బడ్జెట్ ను బట్టి సరైన నిర్ణయం తీసుకుని, మీ కిచెన్ ను జిడ్డు లేని ప్రశాంత వాతావరణంగా మార్చుకోండి.