E-Paper
Advertisement

యాడ్స్ లేవు.. 4 నెలలు ఫ్రీ సాంగ్స్, స్పాటిఫైతో జతకట్టిన బోట్.. ఆఫర్ ఎలా పొందాలంటే?

యాడ్స్ లేవు.. 4 నెలలు ఫ్రీ సాంగ్స్, స్పాటిఫైతో జతకట్టిన బోట్.. ఆఫర్ ఎలా పొందాలంటే?
Advertisement

Boat Spotify Premium Offer: భారతదేశంలో ప్రముఖ ఆడియో బ్రాండ్‌గా పేరుగాంచిన బోట్ (Boat).. ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ స్పాటిఫైతో జతకట్టింది. తాము ఎంపిక చేసిన ఆడియో ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులకు 4 నెలల స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. రోజువారీ డిజిటల్ సేవలను హార్డ్‌వేర్ పరికరాలతో కలిపి వినియోగదారులకు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం.

ఈ ఆఫర్ ద్వారా యూజర్లు నాలుగు నెలల పాటు స్పాటిఫై ప్రీమియం సేవలను ఆస్వాదించవచ్చు. మొదటి 12 వారాల పాటు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల మధ్యలో యాడ్స్ ఏవీ రాకుండా పాటలు వినవచ్చు. అంతేకాకుండా.. పాటలను ఆఫ్‌లైన్ కోసం డౌన్‌లోడ్ చేసుకోవడం, హెచ్‌డీ క్వాలిటీతో స్పష్టమైన ఆడియోను స్ట్రీమింగ్ చేసుకోవడం వంటి సదుపాయాలు లభిస్తాయి.

Advertisement

Also Read: రూటు మార్చిన ఐటెల్.. జస్ట్ రూ.949కే టైప్-C ఛార్జింగ్, ఏఐ బ్యాటరీతో Ace 3 Heera లాంచ్!

ఈ కాంబో ఆఫర్‌ను ప్రమోట్ చేయడానికి బోట్, స్పాటిఫై కలసి ‘హాఫ్ ది ఎక్స్‌పీరియన్స్’ పేరుతో ఒక డిజిటల్ ప్రకటనను కూడా ప్రారంభించాయి. దీనిలో ప్రముఖ సంగీత విద్వాంసుడు చార్ దివారీ సగం మాత్రమే పూర్తయిన కాన్సర్ట్‌లో పాడుతున్నట్లు చూపిస్తారు. సాధారణ ఆడియోకి, ప్రీమియం ఆడియోకి మధ్య ఉన్న తేడాను చూపించడమే ఈ యాడ్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ కు మంచి స్పందన వస్తోంది.

Advertisement

బోట్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి ‘నిర్వాణ యుటోపియా 2 ANC’ హెడ్‌ఫోన్‌లను రూ.5,999 ధరకు విడుదల చేసింది. ఇవి 80 గంటల బ్యాటరీ లైఫ్, 3D స్పేషియల్ ఆడియో వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చాయి. వీటితో పాటు రూ.1,499లకే ‘బోట్ సేలర్ ప్లే’ పేరుతో చిన్నారులు, యువత కోసం ప్రత్యేక హెడ్‌ఫోన్‌లను కూడా లాంచ్ చేసింది. ఇవి 60 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తాయి. అయితే, స్పాటిఫై ఉచిత ఆఫర్ ఏయే మోడల్స్‌కు వర్తిస్తుందో కంపెనీ త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.

Also Read: నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

Related News

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

Big Stories

Advertisement
×